For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక ఐఫోన్ కొనడం కోసమని గర్భాశయంలోని అండాలను అమ్ముకోవడంతో దాదాపు చనిపోయే స్థితికి చేరింది!

|

ప్రజలు తమకు ఇష్టం వచ్చిన వాటిని కొనుక్కునే క్రమంలో భాగంగా ఎంతదూరం వెళ్ళగలరని మీరు భావిస్తున్నారు?

ఐఫోన్ కొనడం కోసం కిడ్నీలను అమ్ముకున్న వారిని ఇదివరకే మనం చూశాం. ఆఖరికి వస్తువులను అమ్మడం దగ్గర నుండి దొంగతనాలు చేసైనా అనుకున్నది దక్కించుకోవాలన్న మనస్తత్వాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అవునా? చివరికి కొందరైతే తప్పులుచేసి పట్టుబడి, జైలు ఊచలు సైతం లెక్కబెట్టారు. కానీ ఇటువంటివి చూస్తూ కూడా, ఆర్భాటాల కోసం డబ్బు సంపాదనలో సులువైన మార్గాలను అన్వేషిస్తూ జీవితాన్నే పణంగా పెట్టే వాళ్ళు ఇంకనూ లేకపోలేదు.

ఆ క్రమంలో భాగంగానే, ఇక్కడ ఒక అమ్మాయి తాజా ఐఫోన్ XS మాక్స్ కొనుగోలు చేయడానికి, సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఒక వినూత్నమైన ఆలోచన మనసుకు తట్టింది. ఆ ఆలోచన ఎటువంటి పరిస్థితులకు దారితీసిందో ఇప్పుడు చూడండి.

ఆమె తన అండాలను అమ్మాలని నిర్ణయించుకుంది :

ఆమె తన అండాలను అమ్మాలని నిర్ణయించుకుంది :

వినడానికే వింతగా ఉంది కదూ! తూర్పు చైనాలోని ఒక విశ్వవిద్యాలయ విద్యార్ధిని, (ఆమె పేరుని వెల్లడించలేదు) ఐఫోన్ కొనుగోలు చేసే క్రమంలో భాగంగా డబ్బును ఆదా చేయడానికి ఒక సులభమైన మార్గం ఎంచుకుంది. ఐఫోన్ కొనుగోలు చేయడానికి ఆమె తన అండాలను బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి నిర్ణయించుకుంది. క్రమంగా ఈ నిర్ణయం ప్రాణాలనే ఇరకాటంలో పెట్టే పరిస్థితులకు దారితీసింది.

ఆమె సుమారుగా 10 కన్నా ఎక్కువ ఇంజెక్షన్లను తీసుకుంది !

ఆమె సుమారుగా 10 కన్నా ఎక్కువ ఇంజెక్షన్లను తీసుకుంది !

ఈ 20 ఏళ్ల విద్యార్థినికి శస్త్రచికిత్సకు ముందు 10 కన్నా అధికంగా ఇంజెక్షన్లను ఇవ్వడం జరిగింది. ఈ ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలో భాగంగా అండాలను సేకరించేందుకు ఆమె అండాశయాన్ని ఉద్దీపనగావించడం కోసంగా ఇవ్వడం జరిగింది.

చివరికి సర్జరీ కూడా చేయించుకుంది :

చివరికి సర్జరీ కూడా చేయించుకుంది :

ఆమెకు శస్త్ర చికిత్స చేసి అందాలను సేకరించిన మూడు రోజులలోనే ఆమె ఆరోగ్యం త్వరితగతిన క్షీణించడం మొదలుపెట్టింది. ఆమె తీవ్రమైన ఉబ్బరం మరియు శ్వాసకోశ సంబంధిత పరిస్థితులను ఎదుర్కొంటూ ఆసుపత్రికి వెళ్లింది.

ఆమెకు ఈ దుష్ప్రభావాల గురించిన అవగాహన లేదు !

ఆమెకు ఈ దుష్ప్రభావాల గురించిన అవగాహన లేదు !

ఈ అండాలను అమ్మడం కోసం తాను తీసుకున్న ఈ నిర్ణయం వలన కలిగే దుష్ప్రభావాల గురించిన కనీస అవగాహన కూడా ఈ విద్యార్థినికి లేదు. అండాలను అమ్మడం వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగదని ఆ బ్లాక్ మార్కెట్ సభ్యుడు ఆమెకు స్పష్టంగా చెప్పారనీ, అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. అంతేకాకుండా శస్త్రచికిత్సకు ముందు 15 రోజుల పాటు, రోజుకొక ఇంజెక్షన్ చొప్పున తీసుకున్నట్లు తెలిపింది.

రోగ నిర్ధారణ :

రోగ నిర్ధారణ :

క్రమంగా జరిపిన పరీక్షలలో భాగంగా ఆ మహిళకు ' ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేటింగ్ (అండాశయ అధిక ఉద్దీపన) సిండ్రోమ్ ' తలెత్తినట్లు గుర్తించారు. అండం ఎదుగుదలకు అండాశయం ఎక్కువ స్థాయిలో ఉద్దీపన చెందినప్పుడు, అండాల చుట్టూ ద్రవం నిర్మితమవుతున్నప్పుడు ఈ పరిస్థితి కలుగుతుంది.

ఆమెకు వెంటనే చికిత్స చేయడం ప్రారంభించారు ...

ఆమెకు వెంటనే చికిత్స చేయడం ప్రారంభించారు ...

ఆమె పొత్తికడుపులో సుమారు ఐదు లీటర్ల కన్నా ఎక్కువ ద్రవం పేరుకుని ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె అండాశయం 7-8 నెలల గర్భవతిగా ఉన్నట్లుగా విస్తరించింది.

అదృష్టవశాత్తూ ఆమె కోలుకుంది :

అదృష్టవశాత్తూ ఆమె కోలుకుంది :

ముందుగానే కాస్త పరిస్థితిని గమనించి ఆసుపత్రికి వచ్చిన కారణాన ఆమె బ్రతికింది కానీ, ఆలస్యం చేసి ఉంటే ప్రాణాలే పోయి ఉండేవని వైద్యులు తెలిపారు. క్రమంగా ఆమెకు 3 రోజుల పాటు చికిత్స చేసి, ఆమె కోలుకొన్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలియజేశారు.

డబ్బు సంపాదన కోసం సులువైన మార్గాలను అన్వేషిస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందో ఆమెకి అర్ధమయ్యే ఉంటుంది. ఆర్భాటాలు, ఉనికి కోసం పాకులాట వంటివి జీవితాన్ని చివరికి ఎటువంటి దుర్భర పరిస్తితుల్లోకి తీసుకెళ్తాయో తెలియజేయడానికి ఇటువంటి వ్యక్తులు ఉదాహరణలుగా మిగుల్తారు అనడంలో ఏమాత్రం తప్పులేదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలతో పాటు, ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Student Sells Her Eggs To Buy A New iPhone And Nearly Dies

All that she wanted was to own a brand new iPhone, hence she decided to sell her eggs to buy the new iPhone illegally. She almost died after that!.
Story first published:Friday, March 15, 2019, 18:11 [IST]
Desktop Bottom Promotion