For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమె చనిపోవాలని ఇన్స్టాగ్రామ్ పోల్లో 69% ఓట్లు చూసి ఆత్మహత్య చేసుకుంది

|

ఈ ప్రపంచంలో సగానికి సగం మంది ఐడెంటిటీ క్రైసిస్ లో బ్రతుకుతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఉనికి కోసం పోరాటం పోయి, ఉనికి కోసం ఆరాటం అన్నట్లుగా తయారయింది నేటితరం. క్రమంగా సోషల్ మీడియాలో తమను తాము ఉన్నతంగా చూపించుకోవడం కోసం, ఏం చేయడానికైనా సిద్దపడుతున్నారు. సాహసోభరితమైన ఫీట్స్ నుండి, తమ నైపుణ్యాల ప్రదర్శన వరకూ ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా సోషల్ మీడియాలో ప్రదర్శించడం జరుగుతూ ఉంది. చివరికి చనిపోవాలన్న నిర్ణయాన్ని కూడా సోషల్ మీడియాకే వదిలిపెడుతున్నారు.

క్రమంగా మనుషుల జీవన ప్రమాణాలను సైతం శాసించే స్థాయికి సోషల్ మీడియా చేరుకుంది.

Teen Commits Suicide After 69% Of People Voted For Her To Die In IG Poll

కొన్ని సందర్భాలలో తమ ఉనికిని కాపాడుకునేందుకు, లేదా గుర్తింపు సాధించేందుకు, లేదా నలుగురి దృష్టిలో పడేందుకు, కొందరు కొన్ని వెర్రి చేష్టలకు సైతం పూనుకుంటూ ఉంటారు. క్రమంగా తమ మానసిక సమస్యల గురించి, వాటికి గల కారణాల గురించి కూడా సోషల్ నెట్వర్క్స్లో పోస్టులు, లైవ్ స్ట్రీమింగ్లు పెట్టడం చేస్తుంటారు.

అదేక్రమంలో భాగంగా, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించిన ఆ అమ్మాయి, బ్రతకమంటారా ? చావమంటారా ? అన్న ప్రశ్నతో పోల్ ఉంచింది. కానీ ఆ పోల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దురదృష్టకర సంఘటనకు మలేషియా వేదికైంది. ఈమె "బందర్ బారు బాటు కవా, మలేషియా" లోని ఒక దుకాణ సముదాయం మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఆ అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, ఒక పోల్ రూపొందించింది, "ఇది నిజంగా ముఖ్యమైనది, నా నిర్ణయానికి మీ సహాయం కావాలి D (డై) లేదా L (Live)" అని. ఆమె తన విధిని నిర్ణయించుకోవడానికి, నెటిజన్ల నిర్ణయాన్ని కోరింది.

ఈ పోల్ క్రియేట్ చేయడానికి ముందు, ఆ అమ్మాయి "నా జీవితానికి స్వస్తి చెప్పాలని భావిస్తున్నాను, నేను అలసిపోయాను" అని తన ఫేస్ బుక్ అకౌంట్లో కూడా పోస్ట్ చేసింది. అయినా ఆమె స్నేహితులు ఎవరూ కూడా, ఆమె మానసిక స్థాయిలను, ఆత్మహత్యా ధోరణులను గుర్తించలేకపోయారు. మరియు ఆమె జోక్ గా పోస్ట్ ఉంచిందేమోనని భావించి, చనివలసినదిగా ఓట్ వేశారు. కానీ ఆమె అన్నంత పని చేస్తుందని భావించలేకపోయారు.

నివేదికల ప్రకారం ఆ బాలిక సవతి తండ్రి, సింగపూర్లో నివాసం ఉంటున్న ఓ వియత్నాం మహిళను వివాహం చేసుకున్నాడు. క్రమంగా ఈ కుటుంబ సమస్యలే ఆమె మానసిక స్థాయిల మీద పెను ప్రభావాన్ని చూపాయి. అంతేకాకుండా ఆన్లైన్లో, నెటిజన్లను నిర్ణయం కోరినప్పుడు, సమస్య గురించిన అవగాహనలేని కారణంగా, ఎక్కువమంది చనిపోవడానికే ఓట్లు వేశారు. క్రమంగా ఈ ప్రపంచానికి తాను అక్కర్లేదని భావించిన ఆ యువతి, దుకాణ సముదాయం పైఅంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కుటుంబమూ ఒకే రకమైన కథను కలిగి ఉండదు, క్రమంగా వ్యక్తివ్యక్తికీ మానసిక స్థాయిలు మారుతూ ఉంటాయి. కావున ఇతరులపట్ల అవగాహనా లేమితో ప్రవర్తిస్తే, అవాంచనీయ సంఘటనలు జరుగుతాయని గుర్తుంచుకోవడం మంచిది.

ఈ సంఘటన మీద మీ అభిప్రాయాలేమిటి ? మీ భావాలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక అంశాలు, ఆసక్తికర విషయాలతో పాటు. ఆరోగ్య, జీవనశైలి, మాతృ, శిశు సంక్షేమ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

Read more about: life fact
English summary

Teen Commits Suicide After 69% Of People Voted For Her To Die In IG Poll

In a shocking case, a 16-year-old Malaysian teenager had posted an Instagram poll in which she asked her followers if she should take her life or not. When the majority of people said a 'yes', the girl committed suicide.Social media plays a vital role in the lives of people and people tend to do anything for the sake of getting attention on social sites.
Story first published: Sunday, May 19, 2019, 10:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more