For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ రాశి చక్రాలను బట్టి మీరు ఎలాంటి విద్యార్థో తెలుసుకోవచ్చు...

|

ఫిబ్రవరి నుండి ఏప్రిల్ అంటేనే పరీక్షల సమయం, కొన్ని సందర్భాలలో అది మే వరకు కూడా కొనసాగుతుంటుంది. క్రమంగా ప్రతి విద్యార్ధికీ బిజీ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. మధ్యలో అరుదుగా విరామం దొరికితే, ఒక 2-3 నిముషాల సమయం తీసుకుంటూ తిరిగి మరలా అభ్యాసాల మీద దృష్టి సారించక తప్పదు. అవునా ? క్రమంగా ఆ విరామం మానసిక స్వాంతనకు ఉపయోగపడేలా ఉండాలి, అంతేకాకుండా తిరిగి మన అభ్యాసాల మీద దృష్టి సారించడానికి ఆ విరామం ఎంతగానో దోహదం చేస్తుంది. కానీ అనేకమందికి మానసిక స్వాంతన అనేది గాడ్జెట్ల రూపంలోనే దొరుకుతూ ఉంది అన్నమాట వాస్తవం. గేమ్స్, సోషల్ నెట్వర్క్స్, న్యూస్ మొదలైన అంశాల రూపంలో లభిస్తుంది. అందులో భాగంగానే, మీ మానసిక స్థితిని తేలికపరచే వ్యాసాన్ని తీసుకుని రావడం జరిగింది. ప్రేమ, సంబంధాలు, వివాహం మరియు జీవితంలోని అనేక అంశాల గురించిన వాస్తవాలను ఎలా అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంచనా వేయగలమో, విద్యాభ్యాసాల దృష్ట్యా కూడా వారి మానసిక స్థితిగతులను అంచనా వేసే వీలుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. క్రమంగా ఈరోజు విద్యార్ధులను అంశంగా ఎంచుకుందాం. ఈ వ్యాసం ద్వారా, మీ రాశి చక్రం ఆధారంగా మీ పరీక్షా ఫలితాల సాధనలో, మీరు ఏ రకమైన విద్యార్థిగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

మేష రాశి :

మేష రాశి :

స్వతహాగా కోపం మరియు ఆందోళనలు తారా స్థాయిలో ఉండే మేష రాశి వారికి, ఈ సమయంలో ఈ భావోద్వేగాలు మరింత ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. కాకపోతే, అగ్ని సంకేతం అయిన మేష రాశి, ప్రతి అంశములోనూ, ప్రతి పరీక్షలోనూ విజయం తమదే అవ్వాలన్న ఉత్సుకతను ప్రదర్శిస్తుంటుంది. క్రమంగా మీ పోటీతత్వాన్ని పెంచడంలో ప్రేరణను అందిస్తుంది. ఇది ఒకరకంగా మంచి విషయమనే చెప్పాలి. సంవత్సరం చివరలో విజయాలను మూటగట్టుకునే లక్షణం ఒక్క మేష రాశి వారికే చెల్లింది. మీరు అనుకున్న ఫలితాల కన్నా ఉత్తమంగానే ఉండునట్లు మీ ఆలోచనా ధోరణి ఉపకరిస్తుంది. లక్ష్య సాధనలో మీకు గ్రహాలు పూర్తి స్థాయిలో తోడ్పాటును అందివ్వగలవు.

వృషభ రాశి :

వృషభ రాశి :

స్కోరింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలిసిన వ్యక్తిగా ఈ వృషభ రాశికి చెందిన వారు ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. వీరు తమ లక్ష్య సాధనల పట్ల నిజాయితీతో ఉంటారు; తమకు తామే గురువుగా మారగల శక్తి వీరి సొంతం. ఎక్కువ స్కోర్ చేసే క్రమంలో భాగంగా వీరు వేసే ప్రణాళికలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మానసికంగా నిర్ణయం తీసుకుంటే, పూర్తయ్యే దాకా అభ్యాసాన్ని వీడని లక్షణం వీరిది. లక్ష్య సాధనలో రాత్రి పవలు తేడాలు ఉండవు. కేవలం ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతారు. అభ్యాసాలు, అసైన్మెంట్ల పట్ల సమయపాలన, క్రమశిక్షణ పట్టుదల వీరి ఆభరణాలుగా ఉంటాయి. అంతేకాకుండా పరీక్షా సమయాలలో నలుగురికి నిద్రకు ఉపక్రమిస్తున్నామని అబద్దం చెప్పి, రాత్రిళ్ళు మేలుకుని చదివే అలవాటును కూడా కలిగి ఉంటారు.

మిధున రాశి :

మిధున రాశి :

ఇతరులు తమ పట్ల ఎటువంటి ఆలోచనలను కలిగి ఉన్నారు అన్న అంశం మీద ఎక్కువ ఫోకస్ కలిగి ఉంటారు. క్రమంగా పుస్తకాలు, ప్రాజెక్టులు అసైన్మెంట్లు వంటివాటిని తమకు భారంగా భావిస్తూ, ద్వేష భావాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా విద్యార్ధిగా ఉండడం కూడా వీరికి అంతగా రుచించదు. మరియు ఇష్టంలేని అభ్యాసాల సంబంధిత ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వీరికి చికాకుగా ఉంటాయి. కానీ వీరు ఇష్టం చూపిన అంశాలనందు మాత్రం, వీరితో పోటీపడడం కష్టం. వీరు తమకు నచ్చిన అభ్యాసాలనందు పూర్తిస్థాయిలో సమాచారాన్ని కలిగి ఉంటారు. వీరి భవిష్యత్ నిర్మాణానికి కావలసిందల్లా, ఇష్టమున్న అంశాలలో తర్ఫీదు పొందడమే.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

తరగతి గది వీరికి సంతోషాన్ని ఇస్తుంది. చివరి స్థానంలో చేరి అందరిని గమనిస్తూ ఉండడం వీరి అలవాటు. అనేక మంది విద్యార్థులు సమాధానం చెప్పడానికి చేతులు ఎత్తుతుంటే, ఒక్క కర్కాటక రాశి వారు మాత్రం తమను అడిగినప్పుడే సమాధానం ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. మరియు సమాధానం తెలిస్తేనే చెప్తారు. (వాస్తవానికి, ఇది చాలా గొప్ప లక్షణం). వారు క్లాసులో తరచుగా తిరుగుతూ ఉంటారు, వీరు మార్కులను తమ తెలివి తేటలకు ప్రామాణికాలుగా పరిగణించరు. ఎక్కువ విషయ పరిజ్ఞానం పరంగానే అభ్యాసపాఠవాలను కలిగి ఉంటారు.

సింహ రాశి :

సింహ రాశి :

ఎప్పుడూ సరదాగా, థ్రిల్ కోసం బ్రతకాలి అనుకునే నైజం సింహ రాశి వారిది. ఎప్పుడూ అదృష్టాన్ని వెంటేసుకుని తిరగాలనే భ్రమలో ఉంటారు. క్రమంగా ఒక ప్రణాళికాబద్దమైన పోకడలను అనుసరిస్తూ ఉన్నతమైన జీవన సరళిని నడుపుతూ, నలుగురికీ ఆదర్శప్రాయంగా ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా ఆ ప్రదేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరు. మరియు ఏదైనా అంశం పట్ల ఆసక్తిని కనపరిస్తే, ఆ అభ్యాసం పూర్తయ్యేదాకా నిద్రపోని లక్షణాన్ని కలిగి ఉంటారు. ఇది ఒకరకంగా వృషభరాశి మరియు తులా రాశి వారి లక్షణాలను పోలి ఉంటుంది. క్రమంగా వీరు అభ్యాస సాధనకు ఎంచుకునే ప్రదేశం ఇల్లైనా, తరగతి గదైనా ఏదైనా ఒకటే. పైగా వీరు వ్యక్తిత్వాన్ని అంత తేలికగా మార్చుకోరు, కార్యసాధకునిగా ముందుకు దూసుకుని వెళ్ళాలన్న తపనను కనపరుస్తుంటారు. క్రమంగా వీరి ఏకాగ్రతను పక్కదారి పట్టించడం జరగనిపని.

కన్యా రాశి :

కన్యా రాశి :

కన్యా రాశి వారిని, క్యాంపస్ నాయకులుగా పరిగణించవచ్చు. వీరు కొంతమేర మేష రాశి వారి లక్షణాలను కలిగి ఉంటారు. ఒక ఆశయం జీవితాన్ని నడిపిస్తుందని వీరి ప్రఘాడ నమ్మకం. వీరు ఎప్పుడూ జీవితంలో ప్రణాళికాబద్దమైన ఆలోచనలను కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి లక్ష్యాలు కూడా అధికంగానే ఉంటాయి. ఎన్ని లక్ష్యాలు ఎదురుగా ఉన్నా, అదరక బెదరక ముందుకు సాగిపోయే తత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. క్రమంగా ఏదైనా అభ్యాసం పట్ల దృష్టి సారించినప్పుడు, ఆ అభ్యాసాన్ని పూర్తి చేసే క్రమంలో వీరు చేసే ప్రణాళికలను గమనిస్తే, ఎవరైనా ఒకింత ఆశ్చర్యానికి గురికావలసిందే. మరియు ఫలితాల సాధనలో కూడా ముందు ఉంటారు. మార్కుల కోసం చదవడం కన్నా, విషయ పరిజ్ఞానం దృష్ట్యా ఆలోచనలు చేస్తుంటారు. క్రమంగా అత్యంత తెలివైన వారిగా ఉంటారు.

తులారాశి :

తులారాశి :

వీరు పూర్తిగా ఇతర రాశుల వారికన్నా భిన్నమైన శైలిని, వ్యక్తిత్వాన్ని కనపరుస్తుంటారు. తరగతి గదుల్లో చెప్పే ఏ విషయాన్ని కూడా విననట్లే ఉంటారు. కానీ హోం వర్క్స్ అధికంగా చేస్తుంటారు. ఒకేసారి అనేక రకాల పనులను చేయగలిగే మల్టీటాస్కర్ వలె ఉంటారు. మరియు అవసరమైన అంశాలను మాత్రమే మెదడులో ఉంచుకునేలా ప్రయత్నిస్తుంటారు. క్రమంగా వీరి అభ్యాస సాధనలో ఎటువంటి అవరోధాలు లేకుండా ముందుకు దూసుకుని పోగలరు. వీరికి విషయ పరిజ్ఞానమూ అవసరమే, మార్కులూ అవసరమే. మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. క్రమంగా ఎవరు ఏం చెప్పినా వింటున్నట్లే నటిస్తుంటారు. ఏదిఏమైనా తమకంటూ ప్రత్యేకమైన ఆలోచనా ధోరణి, ప్రణాళికలను కలిగి ఉంటారు. తమ మనసు చెప్పినట్లే నడుచుకుంటూ ఉంటారు. అందరి దృష్టిలో అమాయకులుగా, అంత పరిజ్ఞానంలేని వారి వలె కనిపించే వీరు, ఏకసంతాగ్రాహిగా ఉంటారు కూడా.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి :

వీరు సైలెంట్ విన్నర్స్ వలె ఉంటారు. ఎవరికీ అంతుబట్టని వ్యక్తిత్వం వీరిది. ఎవరు ఎన్ని విధాలుగా కష్టపడ్డా, అనేక అంశాల నడుమ ఫలితాలు ఉంటాయన్న అవగాహన వీరికి ఉంటుంది. క్రమంగా వీరికంటూ ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. అందరూ చదువుతున్నప్పుడు నిద్రపోవడం, లేదా వేరే ఇతర అంశాలలో కాలక్షేపం చేస్తూ కనిపించినా, ఫలితాల దగ్గర మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందు వరుసలో ఉంటారు. క్రమంగా శిష్యరికం చేయాలని తోటి విద్యార్ధులు ఆలోచించేలా ఉంటుంది వీరి వ్యక్తిత్వం.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

ధనస్సు రాశి వారు, కేవలం ప్రతిష్టాత్మక విజయాల గురించి మాత్రమే కాదు, సరదా మరియు సాహసాల పరంగా కూడా తీవ్రమైన ప్రయత్నాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరి ఆలోచనలు స్కోరింగ్ పరంగా ఎక్కువ ఉంటాయి. ఎల్లప్పుడూ మొదటి స్థానం దృష్ట్యా అడుగులు పడుతుంటాయి. క్రమంగా అవసరం దృష్ట్యా మోసపూరిత చర్యలకు పాల్పడాలనే ఆలోచనలు కూడా తలెత్తుతుంటాయి. కానీ వీరు ఎక్కువగా శ్రమకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. క్రమంగా నిజమైన కృషితో స్కోరును ఇష్టపడతారు. వీరి ఆలోచనలు అత్యధిక వేగంగా మరియు స్మార్ట్ గా కూడా ఉంటాయి. హోంవర్క్ కోసం సమయం అధికంగా కేటాయిస్తుంటారు. క్రమంగా, పరీక్షలకు ఏవిధంగా ప్రణాళికలు చేయాలో ఖచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉంటారు.

మకర రాశి :

మకర రాశి :

తరగతులు హాజరవడం, క్రమశిక్షణతో చదవడం, స్వాంతన కోసం ఆటలకు సమయాన్ని కేటాయించడం, ఆరోగ్యకర శరీరాన్ని నిర్వహించడం, మానసిక ప్రశాంతత దృష్ట్యా తమ దినచర్యలను పాటించడం. ఇటువంటి తత్వాలన్నీ ఒక పెద్దమనిషి తరహాలో, లేదా మహిళల ఆలోచనా దృక్పథంతో కూడుకుని ఉంటాయి. క్రమంగా మంచి స్కోరింగ్ దృష్ట్యా వీరి ఆలోచనలు సాగుతూ ఉంటాయి. వీరు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా ఇప్పటి నుండే కష్టపడాలన్న ఆలోచనలను కలిగి ఉంటారు. క్రమంగా, పట్టుదలతో లక్ష్య సాధన దృష్ట్యా అడుగులు వేస్తుంటారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా, తగినంత సమయం ఆటలకు మరియు కుటుంబ సభ్యులతో ముచ్చటించడానికి వెచ్చిస్తుంటారు. క్రమంగా వీరిలో మానసిక ప్రశాంతత అధికంగా ఉండడమే కాకుండా, చమత్కార ధోరణి కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు తరగతి గదులలో ఆహ్లాదకరమైన హాస్యానికి కూడా కారణమవుతుంటారు.

కుంభ రాశి :

కుంభ రాశి :

కుంభ రాశి వారి మనసు ఒక చోట నిలకడగా ఉండకుండా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటుంది. అనేక ఆలోచనల నడుమ లక్ష్య సాధన పట్ల దృష్టిని కలిగి ఉంటారు. క్రమంగా భౌతికంగా తరగతి గదిలో ఉన్నప్పటికీ, మానసికంగా వేరే ఎక్కడో ఉండే వారిగా ఉంటారు. కానీ వీరు మనసు పెట్టి శ్రద్ద వహిస్తే, వీరి స్కోర్ దాటడం కష్టతరంగా ఉంటుంది. వీరు ఎక్కువగా తమ ఆసక్తుల దృష్ట్యా విద్యాభ్యాసం చేయాలన్న కుతూహలాన్ని కలిగి ఉంటారు.

మీన రాశి :

మీన రాశి :

మీన రాశి వారికి మనసే ఒక ఆయుధంలా ఉంటుంది. ఒకేసమయంలో భిన్న కార్యాలను నిర్వహించగల మల్టీటాస్కర్ వలె ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, తమ భావోద్రేకాలను నిర్వహించగల శక్తివంతులుగా ఉంటారు. అనగా వీరు అనుకున్న ఫలితాలతో పరీక్షలో విజయవంతమైతే ఆ క్రెడిట్ టీచర్, లేదా తమ కష్టానికి అన్వయించుకుంటారు. విఫలమైతే, అది కేవలం తమ దురదృష్టంగా భావించి, మరోసారి విఫలం చెందకుండా ప్రయత్నాలపై దృష్టి సారిస్తారు. నిజానికి ప్రతి ఒక్క విద్యార్ధి ఇలా ఆలోచించగలిగితే, డిప్రెషన్ అనే పదం ఆమడ దూరంలో ఉంటుంది.

English summary

The Kind Of Student You Are Based On Your Zodiac

What Kind of a student are you, or have you been, as per astrology? Were the last bencher or the teacher's delight? Well, here is The Kind Of Student You Are Based On Your Zodiac sign.Read more.
Desktop Bottom Promotion