For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమికుల దినోత్సవం వాలెంటైన్ చనిపోయినందుకు కాదు ఆ దేవత కోసం చేసుకుంటున్నాం

రెండో వాలెంటైన్ రోమ్ రాజు అయిన గ్లాడియస్ చేతితోనే చనిపోయాడు. గ్లాడియస్ సైనికులెవరరూ కూడా పెళ్లి చేసుకోకూడదనే నిబంధన పెట్టేవాడు. అలా చేసుకుంటే సైన్యం పూర్తిగా దెబ్బతింటుందని అతని విశ్వాసం. అయితే వాల

|

వాలెంటైన్స్ డే ప్రతి ఫిబ్రవరి 14న మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ప్రేమికుల రోజు కోసం చాలా మంది యువత కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటుంది. దీని వెనుకు ఒక కథ ఉంది. వాలెంటైన్ అనే ఇటలీ దేశస్థుడు ప్రేమ కోసం తన ప్రాణాలను విడిచాడు. అందువల్లే ఆయన చనిపోయిన రోజును స్మరించుకుంటూ ప్రతి ఫిబ్రవరి 14 ప్రపంచలోని చాలా దేశాల్లో వాలెంటైన్స్ డే నిర్వహించుకుంటూ ఉంటారు.

The real story behind valentines day

అయితే వాలెంటెన్ కు సంబంధించి చాలా కథలున్నాయి. ఇటలీలో ముగ్గురు వాలెంటైన్స్ కు సంబంధించి కథనాలున్నాయి. ఇందులో ఏది నిజమో ఎవరికీ తెలియదు. ఒక వాలెంటైన్ మతాధికారిగా ఉండేవారు. అతను ప్రేమికులను కలపడం వల్ల రాజుకు కోపం వచ్చి యువతను చెడు మార్గం పట్టిస్తున్నావని చెప్పి ఉరి తీశాడని ఒక కథనం ఉంది. అలాగే మరో వాలెంటైన్ రోమ్ రాజు అయినటువంటి గ్లాడియస్ సైన్యంలో సైనికుడు.

ప్రేమికుల దినోత్సవం

ప్రేమికుల దినోత్సవం

ఇక మూడో వాలెంటైన్ రోమ్ లో ఒక సాధారణ పౌరుడు. ఈ ముగ్గురికి సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి. అందులో ఏ వాలెంటైన్ స్మరించుకుంటూ మనం ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటామో మనకే అర్థం కాదు.

సైన్యం పూర్తిగా దెబ్బతింటుందని

సైన్యం పూర్తిగా దెబ్బతింటుందని

రెండో వాలెంటైన్ రోమ్ రాజు అయిన గ్లాడియస్ చేతితోనే చనిపోయాడు. గ్లాడియస్ సైనికులెవరరూ కూడా పెళ్లి చేసుకోకూడదనే నిబంధన పెట్టేవాడు. అలా చేసుకుంటే సైన్యం పూర్తిగా దెబ్బతింటుందని అతని విశ్వాసం. అయితే వాలెంటైన్ అనే సైనికుడు తన తోటి సైనికులకు పెళ్లిళ్లు చేసేవాడంట. ఈ విషయం రాజుకు తెలిసి అతన్ని చంపేశాడట. ఇక మూడో వాలెంటైన్ మామూలు పౌరుడు. అతను ప్రేమ కోసం ప్రాణాల్నే విడిచాడు. ఇది కూడా ఎంతవరకు నిజమో తెలియదు.

జూనో అనే దేవతను

జూనో అనే దేవతను

అయితే అసలు కథ ఏమిటంటే రోమన్స్ జూనో అనే దేవతను పూజించేవారు. ఆమె స్త్రీలకు సంబంధించిన దేవత. ఆమెను పూజిస్తే ఆడవారికి కోరుకున్న వాడితో పెళ్లి అయ్యేలా చేస్తేందుని రోమ్ మహిళల నమ్మకం. జూనో దేవతను భక్తి తో కొలిచి, పెద్ద ఉత్సవం నిర్వహించుకునేందుకు పూర్వం రోమ్ లో ప్రతి ఏటా ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించేవారు.

Most Read :మాంసాహారాన్ని ఆ రోజుల్లో అస్సలు తినకూడదు, మన పూర్వీకులు తీసుకొచ్చిన అద్భుతమైన సంప్రదాయంMost Read :మాంసాహారాన్ని ఆ రోజుల్లో అస్సలు తినకూడదు, మన పూర్వీకులు తీసుకొచ్చిన అద్భుతమైన సంప్రదాయం

ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజుగా

ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజుగా

ఏటా ఫిబ్రవరి 14 న రోమ్ లో నిర్వహించే పండుగను చూసి తాము కూడా అలాంటి వేడుకను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. అలా ఫిబ్రవరి 14న అమెరికాలోని ప్రేమికులు తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజుగా నిర్వహించుకోవచ్చని అక్కడి ప్రభుత్వం సూచించింది. దీంతో అక్కడ కూడా ఏటా ఫిబ్రవరి పద్నాలుగున ఒక పండుగ వాతావరణం నెలకొనేది.

వాలెంటైన్స్ కు సంబంధించిన కథలు

వాలెంటైన్స్ కు సంబంధించిన కథలు

ఈ క్రమంలో ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామని కొన్ని తరాల తర్వాత ప్రజలకు డౌట్ వచ్చింది. అప్పుడు రోమ్ లో చనిపోయిన వాలెంటైన్స్ కు సంబంధించిన కథలని తెరపైకి తీసుకొచ్చారు. వాళ్లను స్మరించుకుంటూ మనం వాలెంటైన్ డే జరుపుకుంటున్నాం అని అమెరికాతో పాటు మిగతా దేశాల్లో ప్రచారం మొదలైంది.

జూనో దేవతను కొలిచేందుకు

జూనో దేవతను కొలిచేందుకు

అలా ఈ ఫిబ్రవరి 14 కాలక్రమేణ వాలెంటైన్ డే గా మారింది. వాస్తవానికి వారికి ప్రేమికుల దినోత్సవానికి సంబంధం లేదు. కానీ రోమ్ లో ఏటా జూనో దేవతను కొలిచేందుకు నిర్వహించుకునే ఉత్సవాన్ని కొన్ని దేశాలు ఇలా మార్చేశాయి. ఇరాన్ లో, పాకిస్థాన్ లో వాలెంటైన్స్ డే వేడుకలు జరుపుకోవద్దని అక్కడి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. పాశ్చత్య సంస్కృతిని ప్రతిబింబించే ఈ వేడుక ఎందుకు వచ్చిందో తెలియదుగానీ ప్రజలు మాత్రం గుడ్డిగా జరుపుకుంటున్నారు.

Most Read :ఈ చిట్కాలు పాటిస్తే మగతనం పెరుగుతుంది, సంతానోత్పత్తి శక్తి వస్తుంది, వీర్యకణాలు పెరుగుతాయిMost Read :ఈ చిట్కాలు పాటిస్తే మగతనం పెరుగుతుంది, సంతానోత్పత్తి శక్తి వస్తుంది, వీర్యకణాలు పెరుగుతాయి

English summary

The real story behind valentine's day

It's a story that teaches us a lot about love, sacrifice, and commitment—the true meaning of Valentine's Day. In the third century, the Roman Empire was ruled by Emperor Claudius II Gothicus. ... He had Valentine thrown into prison and deemed that he would be put to death.
Desktop Bottom Promotion