For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఉత్తమ తండ్రో కాదో మీ రాశిని బట్టి తెలుసుకోండి

|

మీరు నాన్న అయ్యారు అన్న భావన ఎంత బాగుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ? నాన్న, అన్నది ఒక పదవి లేదా బిరుదును పొందినంత సంతోషాన్ని ఇస్తుంది. అప్పటి వరకు సాధారణ పౌరునిగా ఆలోచించిన మీరు, ఒక్కసారిగా తండ్రిగా ఆలోచించడం మొదలు పెడుతారు. అవునా ? పిల్లలతో మీరు ఆడుకునే ఆటలు మీ మనసుకు స్ఫురించిన మరుక్షణం మీ పెదాలపై చిరునవ్వు జనిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర అంచనాల ప్రకారం, మీరు జీవితంలో ఎంత గొప్ప తండ్రులుగా ఉండగలరో తెలుసుకోడానికి వీలవుతుందని చెప్పబడింది.

Zodiac Signs

ఒక పరిపూర్ణ తండ్రికి నిర్వచనం ఎలా ఉన్నా, అది ఒక శిశువు మరియు తండ్రికి మధ్యగల అవినాభావ సంబంధం మరియు పరస్పర అవగాహనల మీద ఆధారపడి ఉంటుంది. అవునా ? ఆ క్రమంలో భాగంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఉత్తమ తండ్రులుగా ఉండగలిగిన వారి జాబితాలో ప్రధమంగా ఉన్న రాశిచక్రాల వివరాలను పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

వృషభ రాశి :

వృషభ రాశి :

వృషభరాశి వారు ఓపిక, సహనానికి మారుపేరుగా ఉంటుంది. కానీ ఒక్కసారి వీరు కోపోద్రిక్తులైతే వీరిని అదుపు చేయడం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉంటుంది. కాకపొతే ఈ కోపం అత్యంత అరుదైన అంశంగా ఉంటుంది. అధికంగా ఓర్పు, సహనాన్ని ప్రదర్శించే వీరు తమ పిల్లల ఆరోగ్యం, మానసిక స్థాయిల గురి౦చిని అంచనాలు వేస్తూ వారిని ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి బలమైన సంకల్పశక్తి, కష్టపడి పనిచేసే ఎద్దు వంటి మనస్తత్వం దృష్ట్యా తమ పిల్లలకు కూడా అటువంటి ఆలోచనా విధానం ఉండాలని పరితపిస్తుంటారు. వారి పిల్లల కోసం, ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటారు. అంతేకాకుండా, తమకు ఎటువంటి నష్టం కలిగినా అంతగా ఆలోచించరు కానీ, తమ పిల్లలు మరియు కుటుంబం పట్ల నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే, అస్సలు సహించలేని స్వభావాన్ని కలిగి ఉంటారు. క్రమంగా ప్రత్యర్ధుల పట్ల ప్రతీకారేచ్చలను సైతం ప్రదర్శిస్తారు. మరియు సామాజిక ఎదుగుదలని అస్త్రంగా వాడుతారు. ఇటువంటి లక్షణాలు పిల్లలలో ధైర్యం తెగింపు తీసుకుని రావడంలో కీలకంగా సహాయం చేస్తాయి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారు కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. తమ కుటుంబం గుర్తింపు కొరకు నిర్ధిష్ట విలువలను నిర్మించడానికి ప్రయత్నిస్తుంటారు. తమ పిల్లలు విలువలను గౌరవించాలని కోరేవారిగా ఉంటారు. అటువంటి విలువలను, మంచి లక్షణాలను తండ్రి నుంచి పిల్లలకు ఎలా బదిలీ చేయాలో కూడా వారికి తెలుసు. క్రమంగా ఈ జాబితాలో వారికి చోటు దక్కింది.

సింహ రాశి :

సింహ రాశి :

సింహం అడవికి రాజు. సింహానికి రాజ్యాధికార లక్షణాలు పుట్టుకతోనే సహజంగా వస్తాయి. అదేవిధంగా సింహ రాశి వారు కూడా. వారి ప్రతి అడుగులోనూ భద్రతాపరమైన చర్యలను కలిగి ఉంటారు. మరియు వారి పిల్లలకు నిరంతరం రక్షణగా ఉండడానికి ప్రయత్నిస్తారు. తమ పిల్లలు ఏది కోరుకున్నా, తమ పరిమితిని మించి అందివ్వడానికి కూడా సిద్దంగా ఉంటారు. కానీ, ప్రతి అంశంలోనూ ఆర్ధిక స్థితిగతుల గురించి చర్చిస్తూ సామాజిక విలువలను నేర్పే ప్రయత్నాలు చేస్తుంటారు. క్రమంగా క్రమశిక్షణ, పట్టుదల వంటి లక్షణాలు అనాలోచితంగానే పిల్లలకు అందుతాయి.

తులా రాశి :

తులా రాశి :

తులా రాశి వారు తమ చుట్టూ శాంతి, సంతోషాలను చూడాలని కోరుకుంటూ ఉంటారు. సమస్యను పరిష్కరించగల తెలివితేటలు వీరి సొంతం. అంతేకాకుండా, ఇతరులు సమస్యలలో ఉండడం వీరికి నిద్ర లేకుండా చేస్తుంటుంది. మరియు ఎదుటివారిలో అసంతృప్తిని అస్సలు సహించలేరు. వీరికి ఇంచుమించుగా వృషభరాశి వారి లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరి ఆలోచనలు, విధానాలు భావోద్వేగ పూరితంగా కూడా ఉంటాయి. మరియు ధైర్యం, తెగింపు, క్రమశిక్షణ, పట్టుదల వీరికి ఆభరణాలనే చెప్పవచ్చు. క్రమంగా తమ పిల్లలకు ఇంచుమించుగా అటువంటి లక్షణాలే వచ్చేలా ప్రణాళికలు చేస్తుంటారు. అంతేకాకుండా తమకు లేని లక్షణాలైన ఓర్పు, సహనాన్ని కనీసం పిల్లలకు వచ్చేలా చూడాలని భావిస్తుంటారు.

మకర రాశి :

మకర రాశి :

మకర రాశి గురించి మీరు అనేకమార్లు వినే ఉంటారు., వీరి ఆలోచనలన్నీ లక్ష్య సాధన మీదనే ఉంటాయని. అవునా ? అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. దీనికి కారణం, కుటుంబ శ్రేయస్సు కోసం వీరు చూపే పట్టుదల, క్రమశిక్షణ. క్రమంగా వీరి లక్ష్యాల వలెనే భావోద్వేగాలు కూడా అధిక స్థాయిలోనే ఉంటాయి. కుటుంబం కన్నా అధికంగా పనిని ప్రేమించే వారిలా ఉంటారు, కానీ విజయాన్ని మాత్రం కుటుంబానికే అంకితమిస్తారు. అంతేకాకుండా, కుటుంబ సభ్యుల కోరికలను తమ కోరికలుగా భావించి, వారి కలల సాకారానికి వీరు పరితపిస్తుంటారు. ఇటువంటి ఉత్తమమైన లక్షణాలు తమ పిల్లలకు కూడా రావాలని ఆకాంక్షిస్తుంటారు.

మీన రాశి :

మీన రాశి :

ఎటువంటి అంశాలలోనైనా, అత్యంత శ్రద్ధను కనపరచే రాశిచక్రాలలో ఉత్తమ రాశి మీన రాశి. వీరు భావోద్వేగాలను అధికంగా కలిగి ఉండడమే కాకుండా, ముక్కుసూటితత్వానికి మారుపేరుగా ఉంటారు. ఇటువంటి లక్షణాలు నెమ్మదిగా తమ పిల్లలకు కూడా అందించేలా ఉంటారు. పిల్లల పట్ల తమ ప్రేమను బాహాటంగానే వ్యక్తపరచే వీరు, వారు కోర్కెలను తీర్చే క్రమంలో భాగంగా నిరంతర శ్రామికునిలా కష్టపడుతుంటారు. క్రమంగా ఈ విధానం, పిల్లలకు, తండ్రిపై నమ్మకాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది.

English summary

These Zodiac Signs Make The Best Dads

Ever wondered how you would behave and look when you become a dad? Though there is no definition of a perfect dad, we still believe there are some qualities which children want to have in their dads. Based on these qualities, the zodiac signs Taurus, Cancer, Leo, Libra, Pisces are believed to be near-perfect dads.
Story first published: Monday, March 18, 2019, 15:35 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more