Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
తల్లి సర్జరీ కోసమనీ పొట్టలోని శిశువును బయటకు తీసి, తిరిగి పొట్టలో అమర్చిన ఆశ్చర్యకర సంఘటన
ప్రతి విషయ౦లోనూ అపారమైన ప్రగతి సాధి౦చిన విజ్ఞాన శాస్త్ర౦తో, తల్లి గర్భ౦లోని గర్భస్థ శిశువుని శస్త్రచికిత్స కోసం కాసేపు బయటకు తీసిన సంఘటన గురించి వింటే మీకు ఆశ్చర్య౦ కలుగకమానదు. పైగా ఈ శస్త్రచికిత్స విజయవంతంకావడం ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఈ సంఘటన విజయవంతం అయిన కారణాన, వైద్య శాస్త్రంలోనే ఒక చరిత్రగా మారింది. మన సైన్స్ మరియు టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అనుభవపూర్వకంగా తెలియచేసే ఈ సంఘటనకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకునేందుకు వ్యాసంలో ముందుకు సాగండి.

ఈ జంట గర్భాన్ని తొలగించవలసినదిగా కోరుకున్నారు ..
గర్భస్థ శిశువుకు స్పినా బిఫిడా అనే సమస్య ఉందని పరీక్షలలో తేలిన తర్వాత, ఈ 26 ఏళ్ల మహిళ, ఆమె భాగస్వామితో కలిసి గర్భాన్ని తొలగించవలసినదిగా వైద్యులను కోరుకున్నారు. వాస్తవానికి గర్భస్థ శిశువుకు ఈ సమస్య ఉన్నట్లుగా, 20 వారాల రొటీన్ స్కాన్లోనే మెడిక్స్ కనిపెట్టగలిగారు. ఈ సమస్య కారణంగా గర్భస్థ శిశువు తల సరైన కొలమానంలో లేదని గ్రహించడం జరిగింది.

అసలేమిటీ స్పినా బిఫిడా ?
గర్భంలో ఉన్న శిశువుకు వెన్నెముక పూర్తిగా పెరగలేని స్థితిగా స్పినా బిఫిడాను పేర్కొనడం జరుగుతుంది. ఫలితంగా, ఇది పిల్లల నడవడికని మరియు ఆలోచనా తీరుని ప్రభావితం చేయగలదు.

గర్భస్థ పిండానికి శస్త్రచికిత్స చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చునని వైద్యుల సూచించారు …
గర్భవిచ్చిత్తికి సిద్దపడిన ఆ జంటకు, గర్భస్థ శిశువుకే సర్జరీ చేసే విధానాన్ని సూచించారు వైద్యులు. క్రమంగా సమస్యను పరిష్కరించవచ్చునన్న భరోసాని అందించారు. ఈ శస్త్రచికిత్స ద్వారా గర్భస్థ శిశువును తల్లి గర్భం నుండి బయటకు తీసి, శిశువు వెన్నుముకకు సర్జరీ చేసి తిరిగి గర్భంలోనికి ప్రవేశపెట్టడం జరుగుతుంది.

సర్జరీ తర్వాత పాపను తిరిగి గర్భంలో ప్రవేశపెట్టారు...
పాపను గర్భం నుంచి వెలికితీసి శస్త్రచికిత్స చేసిన అనంతరం తల్లి గర్భంలోనికే తిరిగి ప్రవేశపెట్టినట్లు వైద్యులు వెల్లడించారు. క్రమంగా ఈ శస్త్రచికిత్స కూడా విజయవంతం అయినట్లు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా, ఇటువంటి పరిస్థితి గురించి తెలిసిన వెంటనే 80 శాతం జంటలు గర్భాన్ని తొలగించుకోడానికి సిద్దపడుతున్నారని కూడా అధ్యయనాలలో తేలింది. కానీ, ప్రయత్నం చేస్తే ప్రాణాన్ని నిలబెట్టడానికి కనీస అవకాశం ఉంటుందని ఇటువంటి సంఘటనలు చూస్తే తెలుస్తుంది.
ఇంతకీ ఈ సంఘటన గురించి మీరేం ఆలోచిస్తున్నారు? మీ ఆలోచనలను, అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications