For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాస్తు టిప్స్: ప్రశాంతమైన జీవితానికి నెమలి ఈకలు ఎలా ప్రభావితం అవుతాయి

|

హిందూ మతంలో నెమలి ఈకను పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక వస్తువుగా భావించడం జరుగుతుంటుంది. హిందువుల పవిత్ర గ్రంధాలలో కూడా వీటి గురించిన ప్రస్తావన తరచుగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆ నెమలి ఈకలపై విస్తరించిన నమూనాలు మరియు రంగులు చూసేందుకు అందంగా ఉండడమే కాకుండా, దైనందిన జీవితంలో వివిధ సమస్యలకు పరిష్కారంగా కూడా ఉండగలదని చెప్తుంటారు పండితులు. అవును, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు అంత మంచిగా లేకపోయినా, మీ అభ్యాసాల మీద ఏకాగ్రత నిలపలేకపోయినా, చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యంగా జరుగుతున్నా, ఈ నెమలి ఈకలను నివారణగా వాడుకోవచ్చునని చెప్పబడింది. మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

ప్రశాంతమైన, సమర్ధవంతమైన జీవన విధానానికి సూచించదగిన నెమలీక చిట్కాలు .. !

నెమలి ఈక ద్వారా రాహు దోష నివారణా చర్యలు :

నెమలి ఈక ద్వారా రాహు దోష నివారణా చర్యలు :

రాహు దోష నివారణా చర్యల దృష్ట్యా, నెమలి ఈక అత్యద్భుత నివారణిగా ఉపయోగించవచ్చునని తెలుపబడింది. రాత్రిపూట పడుకునే సమయంలో, తమ దిండు కింద ఈ నెమలి ఈకను ఉంచడం ద్వారా, రాహు గ్రహ ప్రతికూల ప్రభావాలు తొలగిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పబడింది.

ఆలస్యమైన ప్రాజెక్టులకు నెమలి ఈక చిట్కాలు :

ఆలస్యమైన ప్రాజెక్టులకు నెమలి ఈక చిట్కాలు :

గ్రహాల యొక్క అననుకూల స్థానాల కారణంగా, లేదా మరేదైనా ఇతర కారణాల వలన కొన్ని అనుకున్న పనులు లేదా ప్రాజెక్టులు సమయానుసారం జరుగకుండా అవరోధాలు తలెత్తుతూ ఉంటాయి. అయితే పడక గదిలో తూర్పు లేదా ఈశాన్య మూలలో ఒక నెమలి ఈకను ఉంచడం ద్వారా, ఇటువంటి సమస్యలను తగ్గించుకోవడానికి సహాయపడుతుందని, మరియు పనులు మరియు పధకాలు సమయానికి పూర్తయ్యేలా దోహదపడుతుందని చెప్పబడింది.

మెరుగైన ఏకాగ్రతకు నెమలి ఈక సహాయం :

మెరుగైన ఏకాగ్రతకు నెమలి ఈక సహాయం :

నెమలి ఈకను, తరచుగా విద్యార్ధులకు సిఫార్సు చేయబడుతుంది. విద్యార్థులు ఒక నెమలి ఈకను పుస్తకంలో ఉంచుకోవడం ద్వారా, ఇది వారి ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు విద్యా సంబంధిత అంశాలలో చురుకుగా ఉండేందుకు వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని చెప్పబడింది. కానీ కొందరు పిల్లలు, నెమలి ఈక పిల్లలు పెడుతుంది అని అంటూ ఉంటారు. అది నిజం కాదు.

నెమలి ఈక ద్వారా వాస్తు దోష నివారణ :

నెమలి ఈక ద్వారా వాస్తు దోష నివారణ :

నెమలి ఈకను వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంటుంది. . ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేషుని విగ్రహం మరియు నెమలి ఈకను ఉంచడం ద్వారా, ఇది వాస్తు దోషాలను తొలగించడానికి సహాయపడుతుందని చెప్పబడింది. అంతేకాకుండా పరిసరాలలోని వ్యతిరేక శక్తులను కూడా తొలగిస్తుందని చెప్పబడింది.

నెమలి ఈక గ్రహ కాల సర్ప పరిహారార్ధం కూడా వినియోగించబడుతుంది :

నెమలి ఈక గ్రహ కాల సర్ప పరిహారార్ధం కూడా వినియోగించబడుతుంది :

జన్మ కుండలిలో కొన్ని అననుకూలమైన స్థానాలలోని గ్రహాల కారణంగా ఇవి కొన్ని ప్రతికూల ఫలితాలకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి నివారణగా ఒక నెమలి ఈకను తీసుకొని, ఈక మీద 21 మార్లు నీటి చుక్కలను వేస్తూ జ్యోతిష్య పండితుడు సిఫార్సు చేసిన మంత్రాన్ని పఠించి, ఈ ఈకను పూజ గదిలో ఉంచండి. తరువాతి రోజు ఈ ఈకను పారే నీటిలో వదిలివేయండి. మరిన్ని వివరాల కోసం జ్యోతిష్య పండితుని సంప్రదించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Vastu Tips: Remove All Your Doshas With A Peacock Feather

Peacock feathers are considered sacred and spiritual. It is very often heard that Peacock feathers contain remedies for various common problems. The spiritual uses and benefits can help remove even Vastu doshas. If used in the right way, they can help in better concentration of the students and a cordial relation between the couple.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more