Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
లవ్ సింబల్ చరిత్ర తెలుసా, ఆకు నుంచి హార్ట్ సింబల్ వచ్చింది, చివరి సందేశం దానిపైనే
అందుకే ఎవరూ పెళ్లి చేసుకునేవారు కాదు. కొన్ని వేల మంది సైనికులు ఇలా ఇబ్బందిపడేవారు. ఈ విషయం వాలెంటైన్ అనేటటువంటి ఒక సెయింట్కు తెలిసింది. ఆయన సైనికులకు ధైర్యం ఇచ్చాుడు. రాజుకు తెలియకుండా రహస్యంగా సైనికు
ప్రతి ఫిబ్రవరి 14న లవర్స్ మొత్తం ప్రేమికుల దినోత్సవం, వాలెంటైన్ డే సంబరంలో తేలిపోతూ ఉంటారు. మనస్సు పడ్డ వ్యక్తికి మదిలో మాటను చెబుతారు. ప్రేమలో ఉన్నవారు రొమాన్స్ లో తేలిపోతారు. ఇక వాట్సాప్ లలో, ఫేస్ బుక్ లలో ఒక్క సింబల్ మాత్రం మారుమోగిపోతూ ఉంటుంది. అదే ప్రేమ సింబల్ . లవ్ సింబల్
హృదయాకారంలో ఉండే ఈ చిహ్నం ఆప్యాయత, ప్రేమలకు ప్రతీక. హార్ట్ సింబల్ నే ప్రేమకు గుర్తుగా ఎందుకు మారిందనే విషయం చాలా మందికి తెలియదు. వాస్తవానికి అది హార్ట్ సింబల్ కాదు. మన గుండె ఆకారం వేరు. లవ్ సింబల్ వేరు. ప్రేమ సింబల్ వెనుక ఒక కథ ఉంది. తర్వాత అది హార్ట్ సింబల్ గా మారింది.

సైనికులకు ఎవ్వరికీ పెళ్లి కాకూడదు
అప్పట్లో రోమన్ క్లాడియస్ పరిపాలించేవాడట. అయితే తన సైనికులకు ఎవ్వరికీ పెళ్లి కాకూడదనేది అతని అభిమతం. అందుకే సైనికులు ఎవరూ పెళ్లి చేసుకోవొద్దని ఆదేశించేవాడు. కానీ చాలా మంది సైనికులు ప్రేమలో పడ్డారు. వారు మనసిచ్చిన అమ్మాయిలను మనువాడాలనుకునేవారు. కానీ రాజుకు తెలిస్తే చంపేస్తాడని భయం.

రాజుకు తెలియకుండా
అందుకే ఎవరూ పెళ్లి చేసుకునేవారు కాదు. కొన్ని వేల మంది సైనికులు ఇలా ఇబ్బందిపడేవారు. ఈ విషయం వాలెంటైన్ అనేటటువంటి ఒక సెయింట్కు తెలిసింది. ఆయన సైనికులకు ధైర్యం ఇచ్చాుడు. రాజుకు తెలియకుండా రహస్యంగా సైనికులకు వారు ఇష్టపడ్డ అమ్మాయిలతో పెళ్లిళ్లు జరిపించేవాడు.

వాలెంటైన్‌ను జైల్లో పెట్టించాడు
సైనికుల్లో వచ్చిన మార్పును రాజు గమనించాడు. అనుమానం వచ్చింది. అసలు విషయం తెలుసుకున్నాడు. వెంటనే సైనికులకు వివాహాలు చేయించిన వాలెంటైన్‌ను జైల్లో పెట్టించాడు. ఉరి శిక్ష విధించాడు. అయితే వాలెంటైన్ తాను మరణించే ముందు చివరకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. కానీ ఎలా తన సందేశాన్ని పంపాలో తెలియలేదు.

సేల్ఫియం అనే చెట్టు ఆకులు
అయితే ఆయన ఉండే కారాగారం దగ్గర సేల్ఫియం అనే చెట్టు ఆకులు పడి ఉన్నాయి. సెల్ఫియం ఆకులు రావి చెట్టు ఆకుల మాదిరిగానే ఉంటాయి. వాటిపై తన సందేశం రాస్తాడు. "నేను సైనికుల జీవితాల్లో ప్రేమను నింపేందుకే వారికి వివాహాలు చేశాను. ప్రతి మనిషికి ప్రేమ అవసరం. అది లేకపోతే మనిషి మనుగడ ఉండదు. ప్రేమను విశ్వవ్యాప్తం చేయండి" అంటూ ఆకుపై బొగ్గుతో రాసి తన చివరి సందేశాన్ని పంపుతాడు. వాటిని కిటికీలో నుంచి బయటకు వేయడంతో అవి రోమ్ లోని ప్రజలకు చేరుతాయి.

ప్రేమకు చిహ్నాన్ని
తర్వాత అతన్ని ఉరి తీస్తారు. కానీ చనిపోయినా కూడా అతను చివరగా ఇచ్చిన సందేశం వల్ల ప్రజల్లో ఎప్పటికీ జీవించే ఉంటాడు. అయితే
వాలెంటైన్ చివరగా తన సందేశాన్ని రాసిన ఆకులు ఇప్పుడు మన లవ్ సింబల్ మాదిరిగా ఉండేవి. దీంతో ప్రేమకు చిహ్నాన్ని ఆ ఆకుల రూపం మారింది. ఇప్పుడు మనం ఉపయోగించే లవ్ సింబల్ అలాగే వచ్చింది.



Click it and Unblock the Notifications
