For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భర్త యొక్క అవెంజర్స్ టాయ్ కలెక్షన్స్ ను అమ్మడానికి ప్రయత్నించిన భార్య

|

యాక్షన్ మరియు ఫాంటసీ సినిమాలను అధికంగా ప్రేమించే వ్యక్తులు, కల్పిత పాత్రలకు కూడా ఎక్కువ భావోద్వేగాలకి లోనవుతుంటారు. క్రమంగా సినిమాలో తమ అభిమాన పాత్రదారి మరణిస్తే, నిశ్చేష్టులవడం సర్వసాధారణంగా ఉంటుంది.

అదేవిధంగా ఎవెంజర్స్ సినిమాను అమితంగా ప్రేమించే ఒక వ్యక్తికి సంబంధించిన ఈ కథనం, ఇప్పుడు వైరల్ అయింది. ఎందుకంటే 40 సంవత్సరాల వయస్సు ఉన్న ఇతను, తాను కొనుగోలు చేసిన అవెంజర్స్ బొమ్మలతో ఆడుకోవడానికే ఎక్కువ మక్కువను ప్రదర్శిస్తూ వచ్చాడు. కానీ భార్యకు ఈ అలవాటు నచ్చలేదు.

క్రమంగా తన భర్త దూరంగా ఉన్న సమయంలో, ఈ అవెంజర్స్ బొమ్మలను అమ్మేయాలని భార్య నిర్ణయం తీసుకుంది అంటేనే, పరిస్థితి ఎంత దూరానికి వెళ్లిందో ఆలోచించవచ్చు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

సినిమా చూసిన తర్వాత బొమ్మలు కొన్నాడు ..

సినిమా చూసిన తర్వాత బొమ్మలు కొన్నాడు ..

హాంకాంగ్ చెందిన ఈ వ్యక్తి వయసు 40లలో ఉంటుంది. అతను ఎవెంజర్స్ : ఎండ్ గేం సినిమా చూసిన తర్వాత, ఆ పాత్రలకు ప్రభావితమై కొన్ని ఐరన్ మాన్ యాక్షన్ బొమ్మలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

కానీ అతని భార్యకు ఈ విధానం నచ్చలేదు …

కానీ అతని భార్యకు ఈ విధానం నచ్చలేదు …

అతనికి ఉన్నపళంగా వచ్చిన ఈ అలవాటు, భార్యకు నచ్చలేదు. క్రమంగా ఆ అవెంజర్స్ బొమ్మలను ఆన్లైన్లో అమ్మివేయాలన్న నిర్ణయానికి వచ్చింది. సరైన సమయంకోసం ఎదురుచూడసాగింది.

ఆమె షేర్ చేసిన పోస్ట్ …

ఆమె షేర్ చేసిన పోస్ట్ …

ఒకసారి ఆమె భర్త వేరే ఊరికి కొన్నిరోజులు వెళ్ళవలసి రావడంతో, మంచి అవకాశం దొరికినట్లుగా భావించింది. క్రమంగా తక్కువ ఖరీదుకే ఈ బొమ్మలను అమ్మివేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా, ఆ బొమ్మలను అమ్మివేయాలన్న సంకల్పంతో సామాజిక మాధ్యమాలలో ఈ విధంగా పోస్ట్ షేర్ చేసింది. " నా భర్త అవెంజర్స్ : ఎండ్ గేం సినిమా చూసిన తర్వాత, పిచ్చివానిగా ప్రవర్తిస్తున్నాడు. క్రమంగా అతని దైనందిక వృత్తికార్యకలాపాల మీద ఆ ప్రభావం పడుతూ ఉంది. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు చొప్పున ఈ అవెంజర్స్ బొమ్మల బాక్సులను తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇతనికి ఇప్పటికే 40+ వయసు ఉన్నా, చిన్న పిల్లవానివలె ప్రవర్తిస్తూ ఉన్నాడు. మా ఇల్లు అసలే చిన్నదిగా ఉంటుంది, ఈ బొమ్మలను ఇంటిలో అమర్చేందుకు కూడా తగిన జాగా లేదు. ఈ బొమ్మలను క్లియర్ చేయడానికి నాకు సహాయం చేయండి. నా భర్త ఇంటికి చేరేలోపునే ఈ బొమ్మలను కొంటే నాకు సహాయకంగా ఉంటుంది", అని.

ఈ పోస్ట్ నెటిజెన్స్ ఆగ్రహానికి దారితీసింది….

ఈ పోస్ట్ నెటిజెన్స్ ఆగ్రహానికి దారితీసింది….

ఈ పోస్ట్ చదివిన, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవెంజర్స్ ఫాన్స్, మరియు ఆమె ఆలోచనలను విభేదించిన నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆమె తన భర్తని మోసంచేసి బొమ్మలను అమ్మే ప్రయత్నం చేయడం హేయనీయమని కొందరు అంటుండగా, కొందరైతే ఏకంగా తన భర్తతో ఆమెకు విడాకులు ఇప్పించాలి అంటూ పోస్టు కింద కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. క్రమంగా ఆ మహిళ, ఈ పోస్ట్ను తొలగించింది కూడా.

ఇంతకీ ఈ సంఘటన గురించి మీరేం ఆలోచిస్తున్నారు ? మీ ఆలోచనలను క్రింద వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర విషయాలతో పాటు. ఆరోగ్య, జీవనశైలి, మాతృ, శిశు సంక్షేమ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

Read more about: life fact
English summary

Wife Tries To Sell Husband’s Avenger’s Toy Collection

An irritated wife shared a post online to sell off her husband's Avenger's toy collection. The wife was so displeased with his addiction of playing with the toys that she decided to sell those action figures when he was away for a few days. The netizens were not pleased with her decision and roasted her for this.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more