For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్డర్ చేసి ఆహారంలో 40పైగా బొద్దింకలు కనుగొన్న మహిళ!

|

మనలో అనేకమంది ఇంటర్నెట్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. కానీ మీరు తినే ఆహారం ఎంతవరకు తాజాగా మరియు పరిశుభ్రంగా ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా ? చనిపోయిన బొద్దింకలను తనకు వచ్చిన పార్సిల్లో కనుగొన్న ఈ మహిళ ఉదంతాన్ని వింటే ఇంటర్నెట్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు మార్లు ఆలోచిస్తారేమో.

ఇది చైనాలో జరిగిన ఒక వాస్తవ సంఘటన. ఆమె ఆర్డర్ చేసిన భోజనంలో 40 చనిపోయిన బొద్దింకలు దర్శనమిచ్చాయి. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

ఇంటర్నెట్లో మీల్స్ ఆర్డర్ చేసిన మహిళ ..

ఇంటర్నెట్లో మీల్స్ ఆర్డర్ చేసిన మహిళ ..

నివేదిక ప్రకారం, ఎవరైతే ఈ సమస్యను బయటకు తెచ్చారో, వారి వివరాల ప్రకారం చైనాలో ఇంటర్నెట్లో "బాతు కూర" ను ఆర్డర్ చేసిన మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 బొద్దింకలు దర్శనమిచ్చాయి.

ఆహారం తినడానికి ముందుగా చూడడమే ఆమె అదృష్టం !

ఆహారం తినడానికి ముందుగా చూడడమే ఆమె అదృష్టం !

ఈ మహిళ పేరు వివరాలను వెల్లడించకపోయినా, ఇతర వివరాల ప్రకారం ఈమె చైనాలోని, చాసోన్లో, గువాంగ్డాంగ్ పరిసర ప్రాంతాలలో ఈ సంఘటన జరిగినట్లు స్పష్టమైంది. ఆమె డెలివరీ అయిన మీల్స్ పాకెట్ తెరిచిన వెంటనే బొద్దింకలు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. ముందుగా కనపడడం ఆమె అదృష్టమనే చెప్పాలి.

భోజనం మొత్తం బొద్దింకలతోనే ….

భోజనం మొత్తం బొద్దింకలతోనే ….

ఆ మహిళ తన భోజన౦ పార్సిల్ తెరవగానే, దాని ను౦డి విసురుగా బొద్దింకలు బయటకు వెదజల్లాయి. క్రమంగా వాటిని టిష్యూ పేపర్లతో సేకరించింది.

సంఘటనపై ఫిర్యాదులు చేసింది . .

సంఘటనపై ఫిర్యాదులు చేసింది . .

ఆ హఠాత్పరిణామానికి దిక్కుతోచని స్థితికి లోనైన ఆ మహిళ, వారంరోజుల పాటు భోజనమంటేనే భయపడింది కూడా. క్రమంగా విషయం జరిగిన వెంటనే ఆ మహిళ రెస్టారెంట్ కు ఫిర్యాదు చేసింది. కానీ ఆ భోజనానికి డబ్బులయితే తిరిగి ఇచ్చారు కానీ, ఆ పరిస్థితికి మాత్రం సరైన సమాధానం లేదు. ఈ సంఘటన మీద పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మనం కూడా తరచుగా ఇటువంటి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. కొన్ని సందర్భాలలో ఇంటికి వచ్చిన ఆహారంలో తరచుగా ఈగలు లేదా ఇతర కీటకాలు ప్రత్యక్షమవడం, వాటి గురించి ఫిర్యాదును ఇస్తే, మాకు సంబంధం లేదని బుకాయించడం వంటివి చూస్తుంటాము. తరచుగా వీటి గురించి కొన్ని వీడియోలు కూడా సోషల్ నెట్వర్క్లలో తిరుగుతుంటాయి. కావున జాగ్రత్త తప్పనిసరి.

మీరేమైనా ఇటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారా, ఎదుర్కొంటే మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

Read more about: food life
English summary

Woman Ordered Meal And Found 40 Dead Cockroaches In It!

A woman ordered the meal online but was shocked when she discovered a dead cockroach. On closer examination, the woman realised the entire meal was infested.
Story first published: Tuesday, March 19, 2019, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more