For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్లక్ష్యం చేయడం మరియు భాదపెట్టడం ఈ రాశుల యొక్క లక్షణాలు

|

అన్ని సంబంధాలను తీవ్రంగా పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం ఉందని భావిస్తున్నారా? అలా అయితే, మీరు అవమానింపబడడం తిరస్కారానికి గురవడం వంటివి సర్వసాధారణంగానే ఉంటాయి. అందులో ఎటువంటి అనుమానమూ లేదు. అయితే వీటి తీవ్రత ఎంతసేపు వరకు ఉంటుంది అంటే, అది ఒక వ్యక్తి రాశిచక్రం మీద ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కొంతమంది వ్యక్తులు వీటిని ఎదుర్కొనలేకపోవచ్చు మరియు వాటి ప్రభావాలను దీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ ఉండవచ్చు. నిరంతరం ఆ ఆలోచనలతోనే ఉంటూ ద్వేషం, క్రోధం పెంచుకుంటూ ఆగ్రహ జ్వాలలతో కాలం వెళ్ళదీస్తూ కూడా ఉండవచ్చు. ముఖ్యంగా 5 ప్రధాన రాశి చక్రాలు ఈ కోవకు చెందుతాయని చెప్పబడుతుంది.

మీ స్నేహితుల జాబితాలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారా ? మీ నుంచి ప్రేమను, స్నేహాన్ని సకాలంలో ధృవీకరించాల్సిన అవసరం లేదని మీరు భావిస్తున్నారా? అలా అయితే మీ భావనలు సమస్యాత్మకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు ఆశ్చర్యకరం ఏమిటంటే, మీ స్నేహితులు పైనచెప్పిన విధంగా తీవ్ర భావోద్వేగాలను కలిగి ఉంటే, అవి సంబంధాలనే ప్రభావితం చేయవచ్చు. ఇదంతా వారి వారి రాశిచక్ర చిహ్నాల మీద ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎలాగో తెలుసుకోండి.

మేష రాశి :

మేష రాశి :

మీరు తరచుగా మేష రాశి వారిని అత్యంత మానసిక దృఢత్వాన్ని కలిగిన వారిగా భావిస్తున్నారా?, వారు స్వతహాగా ఎక్కువ మాట్లాడడానికి ప్రాధాన్యతనివ్వరు, కానీ లోలోపల మదనపడుతూ ఉంటారు. క్రమంగా వారు తిరిగి మాట్లాడిన రోజున, వాళ్ళని కట్టడి చేయడం అసాధ్యమే అవుతుంది. వారు ఆశించిన ఆప్యాయత లభించని పక్షంలో, అగ్గిమీద గుగ్గిలం చేస్తారు. వాస్తవంగా వారు మానసికంగా బలమైనవారిగానే ఉంటారు, కానీ సంబంధాలు దూరం అవుతాయేమో అన్న భయం వారిలో ఎక్కువగా ఉంటుంది. క్రమంగా వారి ఆలోచనలు తీవ్రరూపం దాలుస్తుంటాయి. ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి, తరచుగా మానసిక కల్లోలానికి గురవుతూ ఉంటారు. కావున వీరిని విస్మరించడం కూడదు. మరియు విషయాలను గుర్తుపెట్టుకునే లక్షణాలు ఉన్న కారణాన, ఏ చిన్న తగాదా వచ్చినా పాత జ్ఞాపకాలతో గొడవను సాగదీస్తూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలి అంటే, మేష రాశి వారు భావోద్వేగాలగని అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

మిధున రాశి :

మిధున రాశి :

మిధున రాశి వారు, అందరితోనూ ఒకేలా ఉండరు. క్రమంగా సన్నిహితులు కూడా తక్కువగానే ఉంటారు. మరియు మితభాషిగా ఉంటారు. కేవలం తమ సన్నిహితులతో మాత్రమే సమయాన్ని వెచ్చించాలని భావిస్తూ ఉంటారు. మిథున రాశి వారు కొన్ని సందర్భాలలో నిగూఢ గుప్తంగా కనిపిస్తుంటారు. ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే, మిధున రాశి వారు కూడా భావోద్వేగాల మహాసముద్రాన్ని కలిగి ఉంటారు. వీరి మనసు ఒకరకంగా ఆలోచనల ప్రపంచంగా చెప్పబడుతుంది. పరిశీలనల పరంపర దృష్ట్యా వారి మనసుల్లో ఆలోచనలు ఎప్పటికప్పుడు సరికొత్త రూపాన్ని దాలుస్తూనే ఉంటాయి. క్రమంగా మిథున రాశి వారు తిరస్కారాలను, అవమానింపబడడాన్ని ఎన్నటికీ సహించలేని వారుగా ఉంటారు. ఒక్కోసారి వీరి కోపావేశాల కారణంగా, సంబంధాలు విచ్చిన్నం దిశగా అడుగులు వేస్తుంటాయి.

సింహ రాశి :

సింహ రాశి :

సింహ రాశి వారు అత్యంత దృఢ సంకల్పాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడుకుని, గర్వంగా కనిపిస్తుంటారు. అందుకే, వారు సింహంలా కనిపిస్తుంటారని చెప్పబడుతుంది. కానీ అహంకారం కొంచం ఎక్కువగా ఉన్న కారణాన, అహంకారం దెబ్బతింటుందన్న భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. క్రమంగా ఎంత ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉన్నా కూడా, నిరంతరం ఇతరుల దృష్టిని తమ మీదే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వారు దానిని పొందడంలో విఫలం అయినప్పుడు, అది వారి మనస్థాపానికి కారణం అవుతుంది.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి వారికి ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా కట్టడి లేదా అదుపు చేసే శక్తి ఉంటుంది. క్రమంగా సంబంధాలు, భావోద్వేగాల విషయంలో పరిణితితో కూడిన ఆలోచనలు చేస్తూ కొంత జాగరూతులై వ్యవహరిస్తుంటారు. ఈ కారణంగా వారితో సంబంధాలు అంత తేలికగా దూరం కావు. కానీ వారు నిరంతరం సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు తలెత్తుతాయేమో అన్న భయాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ అనుమానం బలపడినా, సంబంధాలపరమైన ప్రతికూలతలు వీరి దృష్టికి వచ్చినా, ముందుగా వీరే నిర్ణయాలు తీసుకునేలా ఉంటారు. మరియు స్నేహం, సంబంధాల విషయంలో మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించని వారిగా ఉంటారు..

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారు సంబంధాల పరంగా ఎల్లప్పుడూ నమ్మదగిన వ్యక్తులుగానే ఉంటారు. కానీ సంబంధ బాంధవ్యాలపట్ల వీరు చూపే అతి విశ్వాసాల కారణంగా తరచుగా అవమానాల పాలవడం కూడా జరుగుతుంటుంది. కానీ వీటిని గుణపాఠాలుగా తీసుకుని జీవితంలో ముందుకు సాగుతుంటారు. ఒక్కోసారి వీరి ఆలోచనలు తీవ్ర రూపాన్ని దాలుస్తుంటాయి కూడా. మరొకసారి అటువంటి తప్పు తమ జీవితంలో తలెత్తకూడదన్న ఆలోచనలను కలిగి ఉన్న, కొత్త సంబంధాలను అంత తేలికగా విశ్వసించేవారిగా ఉండరు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర జ్యోతిష్య, ఆద్యాత్మిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Zodiac Signs Who Have Fear Of Rejection And Getting Hurt

Some people are quite sensible when it comes to relationships. They trust but with a tinge of doubt of betrayal. They live in constant fear of getting hurt or ignored or rejected. Well, astrology says that these people can be identified on the basis of their zodiac signs. Aries, Gemini, Leo, Scorpio, Sagittarius and Pisces are some of them.
Story first published: Monday, April 1, 2019, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more