For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

22/02/2022: ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? రెండో నెంబరుకు ఎందుకంత ప్రాధాన్యత..!

మంగళవారం నాడు వచ్చిన పాలిండ్రోమ్ మరియు అంబిగ్రామ్ ఒకేసారి అంటే తలకిందులుగా ఒకే విధంగా చూడొచ్చు. ఇంకా వీటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈరోజు 22/02/2022, ముందు నుంచి చూసినా.. వెనుకవైపు నుండి చూసినా ఒకే సంఖ్య వస్తోంది. అదే రెండో నెంబర్. అది కూడా మంగళవారం నాడు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా మంది ఈరోజు ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటారు. 22/02/2022లో ఏముందిలే అనుకుంటే మీరు పొరబడినట్టే.. ఈరోజు తెల్లవారుజామునో, మధ్యాహ్నమో 2 గంటల 22 నిమిషాల 22 సెకన్లు కూడా మళ్లీ మళ్లీ రావడం అరుదైన సందర్భాల్లోనే జరుగుతుంది. ఎందుకంటే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు.

22/02/2022: Tuesday date is both a palindrome and an ambigram? Know what special in Telugu

సాధారణంగా మన హిందూ క్యాలెండర్ ప్రకారం అయినా, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయినా ప్రతి సంవత్సరంలో, ప్రతి నెలలో, అంతెందుకు ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇదిలా ఉండగా సంఖ్యాశాస్త్రాన్ని(Numerology) నమ్మే వారికి ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు. ఎందుకంటే 2022 సంవత్సరంలో రెండో నెలలో 22వ తేదీ మంగళవారం నాడు చాలా ప్రత్యేకమైనదని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.

22/02/2022: Tuesday date is both a palindrome and an ambigram? Know what special in Telugu

సంఖ్యాశాస్త్రం ప్రకారం, సాధారణంగా ప్రతి ఒక్క సంఖ్యకు, సంవత్సరానికి ఏదో ఒక లింక్ ఉంటుంది. అయితే 22022022గా చూస్తే.. రాస్తే దీనికి ఒక ప్రత్యేకత ఉంటుందని చెబుతున్నారు.

Shani Uday 2022:ఫిబ్రవరి 24 నుండి ఈ 5 రాశుల వారికి శని దేవుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందట..!Shani Uday 2022:ఫిబ్రవరి 24 నుండి ఈ 5 రాశుల వారికి శని దేవుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందట..!

ఈ తేదీని పాలిండ్రోమ్, అంబిగ్రామ్ గా చెబుతారు. పాలిండ్రోమ్ అంటే ముందు నుంచి చూసినా.. వెనుక నుంచి చూసినా ఒకటే విధంగా ఉంటుంది. అదే విధంగా అంబిగ్రామ్ అంటే పై నుండి కింద వరకు.. కింద నుండి పైన వరకు చూసినా అదే అర్థం వస్తుంది. అయితే ఈరోజు తేదీని మాత్రం 2 అనే సంఖ్యను డిజిటల్ క్లాక్ పద్ధతిలో రాయాల్సి ఉంటుందట.

22/02/2022: Tuesday date is both a palindrome and an ambigram? Know what special in Telugu

ఈరోజుకు మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఈరోజు ప్రెగ్నెన్సీతో ఉండే వారు.. ముఖ్యంగా తొమ్మిది నెలలు నిండిన మహిళలు ఇటువంటి అరుదైన తేదీ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ పుట్టినరోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. అయితే ఇలా 22022022 అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఇలాంటి ప్రత్యేకత ఉన్న రోజున తమ బిడ్డ జన్మించాలని చాలా మంది పేరేంట్స్ ఆశిస్తున్నారు.

అందుకే ఈ ప్రత్యేకమైన రోజున తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీగా డెలివరీ ప్లాన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. 22022022 రోజున తమకు బేబీ పుడితే.. జీవితాంతం చాలా సులభంగా గుర్తు పెట్టుకోవచ్చని కోరుకుంటున్నారు. అంతేకాదు ఈ ప్రత్యేకమైన రోజున తమకు బేబీ పుట్టారని చెప్పుకుని పేరేంట్స్ ఎంతో హ్యాపీగా ఫీలవుతారు.

సమయానుకూలంగా ఉన్న ఒక ప్రముఖ వెబ్ సైట్ ప్రకారం, ఫోర్ట్ ల్యాండ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అజీజ్ ఎస్ ఇనాన్ mm-dd-yyyy రూపంలో, పాలిండ్రమ్ రోజులు ప్రతి సహస్రాబ్దిలో మొదట కొన్ని శతాబ్దిలో మాత్రమే సంభవిస్తాయని లెక్కించారు.

డాక్టర్ ఇనాన్ ప్రకారం ''mm-dd-yyyy అనేది ప్రస్తుత మిలీనియంలో '(జనవరి 1, 2001 నుండి డిసెంబర్ 31, 3000 వరకు) 36 పాలిండ్రమ్ రోజులలో మొదటిది అక్టోబర్ 2, 2001(10-02-2001) మరియు అలాంటి చివరి రోజు సెప్టెంబర్ 22, 2290(09-22-2290). 21వ శతాబ్దంలో mm-dd-yyyy రూపంలో 12 పాలిండ్రోమ్ రోజులు ఉన్నాయి. మొదటిది అక్టోబర్ 2, 2001(10-02-2001) ఉంది. చివరిది సెప్టెంబర్ 2, 2090(09-02-2090) న ఉంటుంది.

FAQ's
  • పాలిండ్రోమ్ మరియు అంబిగ్రామ్ అంటే ఏమిటి?

    సంఖ్యాశాస్త్రం ప్రకారం, సాధారణంగా ప్రతి ఒక్క సంఖ్యకు, సంవత్సరానికి ఏదో ఒక లింక్ ఉంటుంది. అయితే 22022022గా చూస్తే.. రాస్తే దీనికి ఒక ప్రత్యేకత ఉంటుందని చెబుతున్నారు. ఈ తేదీని పాలిండ్రోమ్, అంబిగ్రామ్ గా చెబుతారు. పాలిండ్రోమ్ అంటే ముందు నుంచి చూసినా.. వెనుక నుంచి చూసినా ఒకటే విధంగా ఉంటుంది. అదే విధంగా అంబిగ్రామ్ అంటే పై నుండి కింద వరకు.. కింద నుండి పైన వరకు చూసినా అదే అర్థం వస్తుంది. అయితే ఈరోజు తేదీని మాత్రం 2 అనే సంఖ్యను డిజిటల్ క్లాక్ పద్ధతిలో రాయాల్సి ఉంటుందట.

English summary

22/02/2022: Tuesday date is both a palindrome and an ambigram? Know what special in Telugu

22/02/2022: Tuesday date is both a palindrome and an ambigram, can be read the same way forward, backward and upside down. Know more about the speciality. Read on
Story first published:Tuesday, February 22, 2022, 9:06 [IST]
Desktop Bottom Promotion