For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

75 Years of Dandi March: దండి మార్చ్ కు ఎందుకంత క్రేజ్ వచ్చిందో తెలుసా...

దండి మార్చి యొక్క ప్రాముఖ్యత, చారిత్రక ఉద్యమం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు 'దండి మార్చి'కి ఎంతో ప్రాధాన్యత ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక దాని ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు. ఈ దండి మార్చి ఉద్యమం ఎందరికో ఆదర్శంగా మారింది. గాంధీజీ తలపెట్టిన అహింసా, శాంతియుత ఉద్యమానికి నేటితో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి.

75 Years of Dandi March: Things that you must know about this historic movement in Telugu

ఈ సందర్భంగా మార్చి 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దండి మార్చ్ స్మారక మార్చ్ ను ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని అభయ్ ఘాట్ సమీపంలోని మైదానం వద్ద దీన్ని ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ అయిన అభయ్ ఘాట్, సబర్మతీ ఆశ్రమం దగ్గర్లోనే ఉండటం విశేషం.

75 Years of Dandi March: Things that you must know about this historic movement in Telugu

ఈ వేడుకలకు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'(స్వాతంత్య్రానికి అమృత మహోత్సవం) వేడుకలుగా నామకరణం చేశారు. ఈ మార్చ్ 21 రోజుల పాటు కొనసాగనుంది.

75 Years of Dandi March: Things that you must know about this historic movement in Telugu

స్వాతంత్య్రానికి ముందు దండి మార్చ్ ప్రారంభించిన తేదీని మార్చి 12గా మార్చి స్మారకంగా ఈ మార్చ్ ను ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా దండి మార్చి అంటే ఏమిటి? దీనికి ఎందుకని అంత ప్రాధాన్యత ఏర్పడిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

దండి మార్చ్ అంటే...

దండి మార్చ్ అంటే...

దండి మార్చ్ నే ఉప్పు సత్యాగ్రహాం అని కూడా పిలుస్తారు. మహాత్మ గాంధీజీ నాయకత్వంలో ఆంగ్లేయుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగా జరిగిన ఉద్యమమే ఈ దండి మార్చ్. 1930లో మార్చి 12వ తేదీన ఈ మార్చ్ ని గుజరాత్ లోని దండి ప్రాంతంలో ప్రారంభించి, ఏప్రిల్ 15వ తేదీవ రకూ అంటే దాదాపు 24 రోజుల వరకు దీన్ని కొనసాగించారు.

40 కిలోమీటర్లు..

40 కిలోమీటర్లు..

ఆ తర్వాత అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరాసన పార్టీ పని మీద గాంధీజీ బయలుదేరగా.. ఆయనను మే 5వ తేదీన ఆంగ్లేయులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ మార్చ్ లో పాల్గొన్న వారిని కూడా ఒక్కొక్కరిగా అరెస్టు చేసుకుంటూ వెళ్లారు. దీంతో అప్పటి నుండి మన పూర్వీకులు బ్రిటీష్ వారికి సహాయ నిరాకరణ చేయడం ప్రారంభించారు.

పలు కార్యక్రమాలు..

పలు కార్యక్రమాలు..

గాంధీజీ చేపట్టిన ఈ ఉద్యమం 75 ఏళ్లు పూర్తి కావడంతో, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1930 సంవత్సరంలో గాంధీజీ విశ్రాంతి తీసుకున్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో గాంధీ పుట్టిన పోర్బందర్, రాజ్ కోట్, వడోదర, బర్దోలి(సూరత్), మాండ్వీ(కచ్), దండి(నవ్సారీ) ఉన్నాయి.

పాదయాత్ర..

పాదయాత్ర..

ఈ ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా 21 రోజుల పాటు పాదయాత్ర చేయాలని రాజకీయ నాయకులు నిర్ణయించారు. వాకర్స్ విశ్రాంతి తీసుకునే ప్రాంతాల్లో కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించనున్నారు. ఈ 21 రోజుల్లో ప్రతిరోజూ సుమారు 20 కిలోమీటర్ల చొప్పున నడవాలని, ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి పది మందికి ఒక ఫిట్ నెస్ కోచ్ కూడా అందుబాటులో ఉంటారు. వారికి కావాల్సిన సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకుంటారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ..

కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ..

ఈ దండి మార్చ్ కార్యక్రమాన్ని 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. మార్చి 12వ తేదీన సబర్మతీ ఆశ్రమం వద్ద సోనియా గాంధీ ఈ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముంబైకి చెందిన మహాత్మ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రస్తుతం జరగనున్న కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తోంది. 75 వారాల పాటు స్వతంత్ర భారత్ ని చూపేలా తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కూడా వెల్లడించింది.

English summary

75 Years of Dandi March: Things that you must know about this historic movement in Telugu

Here we are taking about the 75 years of Dandi March: Things that you must know about this historic movement in telugu. Read on
Story first published:Friday, March 12, 2021, 12:43 [IST]
Desktop Bottom Promotion