For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు నెలల పాపతో జై చిరంజీవ హీరోయిన్ చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే..

|

తెలుగులో జై చిరంజీవ, అశోక్, నరసింహుడు సినిమాల్లో నటించిన హీరోయిన్ సమీరా రెడ్డి మీకు గుర్తుందా? అప్పట్లో అగ్రనటులందరితో కలిసి నటించిన ఈ అందాల భామ ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. కానీ సినిమాలకు సంబంధించిన విషయంలో కాదు.

ఈ భామ రెండు నెలల కిత్రమే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాలింతగా ఉన్న ఈ బాలీవుడ్ భామ ఎవ్వరూ చేయని ఓ సాహసం చేసింది. ఇంతకీ ఆమె ఏమి చేసింది తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

1) అందరికీ భిన్నంగా సమీరా రెడ్డి..

టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో అగ్రనటులతో నటించిన అందాల ముద్దుగుమ్మ 35 ఏళ్ల వయస్సులో సాధారణ ప్రజలు ఎవ్వరూ చేయని సాహసం చేసింది. సాధారణంగా తల్లి అయిన సందర్భాల్లో అందరూ బెడ్ రెస్ట్ తీసుకుంటుంటారు. కానీ ఈ భామ అందుకు భిన్నంగా నేచర్ తో కలిసిపోయింది.

2) అందరినీ ఆశ్చర్యపరించింది..

ఇంతకీ ఆమె ఏమి చేసిందంటే.. కర్నాటకలోని ముల్లయనగిరి అనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. తను ఒంటరిగా వెళ్లకుండా ఆమె తన 2 నెలల పాప నైరాతో కలిసి ముల్లయనగిరి శిఖరం వద్ద సుందరమైన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ లో అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

3) కర్నాటకలోనే ఎత్తైన శిఖరం..

కింద ఉన్న వీడియోలో ఆమె తన చిన్నపాపను మోసుకెళ్లడాన్ని మీరు చూడొచ్చు. ఇంతకీ ఆ కొండ ఎత్తు ఎంతో తెలుసా.. అక్షరాలా 6,300 అడుగుల ఎత్తు. కర్నాటకలోనే ఇది ఎత్తైన శిఖరం అని తన పోస్ట్ లో సమీరా తెలిపింది.

4) మంచి స్పందన..

ఆ వీడియోలో ఆమె ఏమన్నారంటే.. ‘‘నైరాతో కలిసి ముల్లయనగిరి శిఖరం ఎక్కడానికి ప్రయత్నించాను. నేను మధ్యలో ఊపిరి తీసుకోలేక కాసేపు ఆగిపోయాను. అందరి తల్లుల మాదిరిగానే నాకు కూడా పర్యాటక ప్రదేశాలంటే ఇష్టం. కర్నాటకలో ఇదే ఎత్తైన శిఖరం. నేను చాలా చోట్ల మా పాపకు తన కోరిక ఆహారం ఇచ్చాను. నా ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సందర్భాల్లో మనం ఏమేమో చేయాలనుకున్నా చేయలేకపోతాం. భవిష్యత్తులో నాకు అలాంటి బాధ ఉండకూడదని ఇలా ధైర్యం చేశాను. తన చేసిన పోస్టులకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. ఇంత మంచి స్పందన చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను‘‘ అని ఈ బాలీవుడ్ భామ అన్నారు.

5) వినూత్న కామెంట్లు..

ఈ సందర్భంగానే ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘కొత్తగా తల్లులు అయ్యే వారందరికీ మీరే ఆదర్శం‘ అని కామెంట్లు చేస్తే.. ఇంకొందరు మాత్రం తల్లీ, బిడ్డ ఎత్తైన పర్వతాలు ఎక్కితే ఇద్దరి ఆరోగ్యానికి ప్రమాదం అని హెచ్చరిస్తు కామెంట్లు చేస్తున్నారు.

6) సినిమాలకు గుడ్ బై..

సమీరా రెడ్డి 2014లోనే అక్షయ్ అనే ఓ బిజినెస్ మెన్ పెళ్లి చేసుకుంది. అంతకుముందు తెలుగులో నరసింహుడు, అశోక్, జైచిరంజీవ సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసింది.

7) అందరితోనూ టచ్ లో..

కేవలం తన కుటుంబంతో జాలీగా గడుపుతోంది. సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ మంచి మంచి ఫొటోలను షేర్ చేస్తూ అందరితో టచ్ లోనే ఉంటోంది ఈ అందాల భామ.

English summary

Actress Sameera Reddy Climbed The 'Tallest Peak In Karnataka' With Her 2-Month-Old Daughter Nyra

In her post, Sameera stated that she received an overwhelming response from new moms, who were inspired by her. She added, "So many messages from new moms saying they are inspired to travel and I'm thrilled my travel stories are getting such a positive response.