For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Republic Day 2023: రిపబ్లిక్ డే రోజు బీటింగ్ రీట్రీట్.. చరిత్ర, ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

బీటింగ్ రీట్రీట్ రిపబ్లిక్ డే ఈవెంట్స్ ముగింపులో జరుపుకునే సైనిక వేడుక. ఏటా జనవరి 26న ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ఏడాది కూడా అట్టహాసంగా జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతోంది. ఏటా ఈ బీటింగ్ రీట్రీట్ వేడుక విజయ్

|

బీటింగ్ రీట్రీట్ రిపబ్లిక్ డే ఈవెంట్స్ ముగింపులో జరుపుకునే సైనిక వేడుక. ఏటా జనవరి 26న ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ఏడాది కూడా అట్టహాసంగా జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతోంది. ఏటా ఈ బీటింగ్ రీట్రీట్ వేడుక విజయ్ చౌక్‌లో జరుగుతుంది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ఉంటారు. బీటింగ్ రీట్రీట్ అనే పదం డ్రమ్ బీటింగ్ ఈవెంట్ నుండి వచ్చింది.

Beating retreat history, significance, order of the ceremony in Telugu

బీటింగ్ రీట్రీట్ చరిత్ర:

బీటింగ్ రిట్రీట్ వేడుక మొదట 1950లో నిర్వహించారు. అప్పటి నుండి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. రిట్రీట్ ఆలోచన వెనక భారతీయ సైన్యంలోని పదాతిదళ రెజిమెంట్‌లోని అధికారి మేజర్ రాబర్ట్స్ కీలక పాత్ర పోషించారు.

బీటింగ్ రిట్రీట్ గురించి ఆసక్తికర విషయాలు:

బీటింగ్ రిట్రీట్ గురించి ఆసక్తికర విషయాలు:

1. ఈ బీటింగ్ రిట్రీట్ వేడుక జనవరి 29న రిపబ్లిక్ డే తర్వాత మూడో రోజు జరుగుతుంది.

2. రక్షణ మంత్రిత్వ శాఖలోని సెక్షన్ D ఈ వేడుకను నిర్వహిస్తుంది.

3. బీటింగ్ రిట్రీట్ వేడుకను ఢిల్లీలోని రైసినా హిల్స్ నిర్వహిస్తారు.

4. 1971లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించినదానికి గుర్తుగా వేడుకలో స్వర్ణిమ్ విజయ్ ప్రదర్శిస్తారు.

5. వైమానిక దళానికి చెందిన తిరంగ సేనాని, నిదా యోధ, నేవీకి చెందిన భారత్ వందన, ఆర్మీ మిల్ యొక్కు గురుద్ ప్రహార్, సంబోధన్ ఎకో, మాస్డ్ బ్యాండ్ యొక్క భారత్ కే జవాన్ వంటి ఇతర కొత్త కంపోజిషన్‌లు ప్రదర్శించబడతాయి.

6. పైప్ బ్యాండ్‌లు రిట్రీట్‌ను నిర్వహిస్తాయి. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీకి చెందిన సామూహిక బ్యాండ్‌లు ఉంటాయి.

7. బగ్లర్‌లు ఫ్యాన్‌ఫేర్‌తో బీటింగ్ రిట్రీట్‌ను ప్రారంభిస్తాయి. సారే జహాన్ సే అచ్చాతో బీటింగ్ రిట్రీట్ ముగుస్తుంది.

ఏ వేడుక ఎప్పుడంటే:

ఏ వేడుక ఎప్పుడంటే:

1. రాష్ట్రపతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.

2. ప్రెసిడెంట్స్ బాడీ గార్డ్ గౌరవ వందనం తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదే సమయంలో సామూహిక బ్యాండ్‌లు జాతీయ గీతాన్ని ప్లే చేస్తాయి.

3. సామూహిక బ్యాండ్‌లు, ట్యూన్లను ప్లే చేస్తుంటాయి. అదే సమయంలో పరేడ్ జరుగుతుంది.

4. చివరగా ఎయిర్ ఫోర్స్, నేవీ బ్యాండ్ లు ప్రదర్శన ఇస్తాయి.

5. బీటింగ్ రిట్రీట్ వేడుక ముగింపులో జాతీయ జెండాను అవనతం చేస్తారు.

6. రాష్ట్రపతి వెళ్లిపోయిన తర్వాత పటాకులు పేలుస్తారు.

ఆన్‌లైన్‌లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే..

ఆన్‌లైన్‌లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే..

1. ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డులతో బూత్‌ల నుండి టికెట్లు పొందవచ్చు.

జంతర్ మంతర్, ప్రగతి మైదాన్(గేట్ నం.1), పార్లమెంట్ హౌస్(రిసెప్షన్ ఆఫీస్), సేన భవన్(గేట్ నం.2), శాస్త్రి భవన్(గేట్ నం.3) వద్ద బూత్‌లు ఉంటాయి.

2. www.aamantran.mగod.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

3. టికెట్ల కోసం మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది. ఒక్క ఫోన్ నంబరుపై 10 టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

4. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాను నమోదు చేయాలి.

5. ఎంత మంది హాజరు కాబోతున్నారో ఇవ్వాలి.

6. మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలి.

7. ఏదైనా ఒక టికెట్ రకాన్ని ఎంచుకోవాలి.

8. టికెట్ పాస్‌లు ఇమెయిల్, సందేశం రూపంలో మొబైల్ కు వస్తాయి.

9. ఉదయం 10 గంటల నుండి పగలు 12.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 వరకు.

English summary

Beating Retreat Ceremony history, significance, order in Telugu

read this to know Beating retreat history, significance, order of the ceremony in Telugu
Desktop Bottom Promotion