For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google Meet Wedding:గూగుల్ మీట్ లో పెళ్లి..జొమాటోలో వివాహ విందు..వెస్ట్ బెంగాల్ కపుల్ వెరైటీ వెడ్డింగ్ ఐడియా..

కరోనా వంటి కష్టకాలంలో పశ్చిమ బెంగాల్ జంట పెళ్లి చేసుకునేందుకు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు.. గూగుల్ మీట్ లో పెళ్లి, జొమాటోలో డిన్నర్ ఇంకా ఎన్నో.. ఆ విశేషాలేంటో మీరూ చూడండి..

|

Google Meet Wedding:గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారితో మన దేశంతో పాటు ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతోంది. ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి కనికరించింది అనుకునేలోపు.. ఓమిక్రానే వేరియంట్ రూపంలో వచ్చి మరింత బెంబేలెత్తిస్తోంది.

Bengal Couple Finds

దీంతో కరోనా కేసులు మరోసారి విపరీతంగా పెరిగిపోయాయాయి. మళ్లీ నైట్ కర్ఫ్యూలు ప్రారంభమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే వీకెండ్ కర్ఫ్యూ కూడా ప్రారంభమైంది. దీంతో అన్ని కార్యక్రమాలపై మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. కరోనా వంటి కష్టకాలంలో కూడా పశ్చిమ బెంగాల్(West Bengal) జంట వివాహ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు ఓ ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. వారు గూగుల్ మీట్ ద్వారా కళ్యాణం చేసుకోబోతున్నారు. అంతేకాదు వివాహ విందును జొమాటో ద్వారా అతిథులకు చేర్చనున్నారు. సందీపన్ సర్కార్ మరియు అదితి దాస్ కపుల్ జనవరి 24వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వివాహం వంటి కార్యక్రమాలకు 200 మంది అతిథులను అనుమతించినప్పటికీ.. వారు వివాహం చేసుకోవాలన్న విధానం బంగాల్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ సందర్భంగా ఈ జంట గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

సందీపన్ కి కరోనా..
బెంగాల్ లోని బుర్ద్వాన్ కు చెందిన సందీపన్ తన భాగస్వామి అదితిని వివాహం చేసుకోవాలని చాలా కాలంగా కలలు కంటున్నాడు. అయితే కరోనా మహమ్మారి తన కళ్యాణానికి అడ్డుగా మారింది. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుందామనుకున్నా కరోనా కారణంగా తన పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాదు ఇటీవలే తను కరోనా బారిన పడి ఆసుపత్రికి చేరాల్సి వచ్చింది. 2022 సంవత్సరంలో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు పెళ్లి చేసుకునేందుకు ఈ మార్గాన్ని కనుగొన్నారు. అందుకే తన పెళ్లి వేడుక కారణంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం సమంజసం కాదని భావించాడు. ఈ కారణంగా తన పెళ్లి మాత్రమే కాకుండా తన సన్నిహితులను కూడా ఆన్ లైన్ లో చేర్చాలని ప్లాన్ చేశాడు. ఇది మాత్రమే కాదు, అతిథులకు ఆహారం అందించేందుకు జొమాటో సహాయం తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం ఓ టెకీని సైతం నియమించారు.

ఇది వరకే కరోనా వంటి కాలంలో ఆన్ లైనులో పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే సందీపన్, అదితిల వివాహం మాత్రం చాలా విభిన్నంగా ఉండనుంది. అందుకే ఈ ఆన్ లైన్ మ్యారేజ్ సజావుగా జరిగేలా చూసేందుకు, పెళ్లి వేడుకలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతిక నిపుణుడిని సైతం నియమించుకున్నారు.

ఇ-కార్డ్ ద్వారా ఆహ్వానం..
అదే సమయంలో సందీపన్, అదితిల వివాహానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తన పెళ్లికి వచ్చే వారందరికీ ఇ-కార్డులు పంపుతున్నారు. మొత్తం 450 మంది ఆహ్వానితులు ఉన్నారని.. వారందరూ గూగుల్ మీట్ లో వివాహానికి ప్రత్యక్షంగా వీక్షిస్తారట. ఈ పెళ్లికి ఒక రోజు ముందు, ఆ జంట వారితో ఆ లింకును షేర్ చేసుకోనున్నారు. ప్రత్యక్షంగా సుమారు 100 నుండి 120 మంది ఈ వివాహ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అంతేకాదు పెళ్లి రోజున బంధువులందరికీ జొమాటో ద్వారా వర్చువల్ అతిథులందరికీ విందు భోజనం అందించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసేశారు.. ఇందుకోసం ప్రత్యేక టీమ్ పనిచేస్తూ ఉంటుంది.

English summary

Bengal Couple Finds a Different Marriage Idea in Pandemic Wedding on Google Meet Dinner Via Zomato

West Bengal Couple Finds a Different Marriage Idea in Pandemic; Wedding on Google Meet, Dinner Via Zomato. Know more
Story first published:Wednesday, January 19, 2022, 10:17 [IST]
Desktop Bottom Promotion