For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mother's Day 2021: మదర్స్ డే రోజున ‘అమ్మ’ మధురమైన అనుభూతిని పొందాలంటే... ఇలా ట్రై చేయండి...

|

మనం అరక్షణం కనబడకపోయినా.. అల్లాడిపోతుంది అమ్మ.. అంతేకాదు.. సమయానికి తిన్నామా.. తింటున్నామా లేదా అని తెగ ఆరాటపడుతుంది. కానీ మనలో చాలా మంది అమ్మ తినిందా.. కనీసం తిన్నావా అని కూడా అడగరు.

తన పస్తులుండి మరీ మన కడుపు నింపే వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ ఒక్కటే. అందుకే ఈ లోకంలో అమ్మను మించిన దైవం ఏదీ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భూమిపై మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, మన సంతోషాన్ని రెట్టింపు చేసేది అమ్మే. మనం బాధలో ఉన్నప్పుడు తన ఒడిలో నిద్రపుచ్చుతూ ఓదార్చేది అమ్మే.

ఈ ప్రపంచంలో ఇప్పటికీ తన గురించి కాకుండా, తన పిల్లల గురించే అనునిత్యం ఆలోచిస్తూ ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ ఒక్కటే. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ ఎంతో ప్రత్యేకం..

అలాంటి అద్భుతమైన అమ్మ ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజే మదర్స్ డే. ఈ మదర్స్ డే సందర్భంగా మీ జీవితానికి ఎంతో ప్రత్యేకతను అందించి.. దాన్ని పరిపూర్ణంగా మార్చిన మీ అమ్మకు తను ఎంతో ప్రత్యేకం అనుకునేలా కొన్ని పనులు చేయండి.. అమ్మకు మధురమైన అనుభూతిని కలిగించండి. దీంతో తను ఎంతగానో సంతోషిస్తుంది.

Mother's Day 2021: అమ్మను మించిన దైవం లేదు... ఆమె జీవితం అందరికీ ఆదర్శం..

కొంచెం కొత్తగా..

కొంచెం కొత్తగా..

మీ అమ్మ గారి కోసం మీరు ఏమి చేయగలరో.. కొంచెం కొత్తగా చేయండి. అందుకోసం క్రియేటివ్ గా ఏదైనా చేయగలరేమో ఆలోచించండి. గ్రీటింగ్ కార్డ్, మేకప్ బాక్స్, స్క్రాప్ బుక్ ఇలా ఏదైనా మీ ఇష్టం.. మీలో ఉన్న క్రియేటివిటిని మొత్తం బయటకు తీయండి. మీ అమ్మను మదర్స్ డే రోజున ఆశ్చర్యపరచండి.

డిజిటల్ ప్రపంచాన్ని..

డిజిటల్ ప్రపంచాన్ని..

ప్రస్తుతం మళ్లీ లాక్ డౌన్ కారణంగా.. అమ్మకు ఏమీ కొనివ్వలేకపోతున్నామని.. బయటకు తీసుకెళ్లలేకపోతున్నామని ఫీలవుతున్నారా? అయితే అమ్మకు ప్రత్యేకమైన డిజిటల్ ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, జి5 వంటి వాటిలో తనకు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి. బింజ్ - వాచింగ్ లో ఉన్న మజాను తనకు చూపించండి. తను వాటిని చూస్తున్నప్పుడు మధ్యలో స్నాక్స్, జ్యూస్ వంటివి ఇవ్వండి.

మీ చేతి వంట..

మీ చేతి వంట..

ఈ విశ్వంలో ఎంత పెద్ద చెఫ్ అయినా సరే.. మనకు అమ్మ చేతి వంట కంటే రుచికరంగా ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా అమ్మతో కలిసి ఉన్న లక్కీ పర్సన్స్ లో మీరు కూడా ఉంటే మీ అమ్మకు ఇష్టమైన వంటకాలను మీరే స్వయంగా తయారు చేయండి. ఎందుకంటే మీ పుట్టినరోజుకు, మీరు స్కూల్, కాలేజీ, జాబ్ లో జాయినింగ్ వంటి స్పెషల్ డేస్ లో అమ్మ మీకు ఎన్ని ప్రత్యేకమైన వంటకాలు చేశారో గుర్తు చేసుకోండి. కాబట్టి ఒకసారి ఈ రెసిపీలలో తనకు ఏవి ఇష్టమో తెలుసుకుని తనకిష్టమైన వంటలను లంచ్ కు లేదా డిన్నర్ సమయంలో ప్లాన్ చేయండి. ఒకవేళ మీరు మధ్యాహ్నం, రాత్రి కూడా వీటిని చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఒకవేళ మీకు వంట రాకపోతే.. యూట్యూబ్ లో వంటకాలు చూస్తూ ప్రయత్నించి చూడండి. మీ చేతి వంట ఎలా ఉన్నా చాలా బాగుంది అంటూ వాటిని అమ్మ తినడం మాత్రం గ్యారంటీ.

అమ్మకు ఒక్కరోజేనా? కాదు... ప్రతి రోజూ ఆమెదే.. అందుకే అమ్మను మనసారా హత్తుకునే కోట్స్ ను షేర్ చేయండి..

మధురమైన అనుభవాలు..

మధురమైన అనుభవాలు..

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మధురమైన అనుభవాలుంటాయి. అలాంటి అనుభవాలలో కొన్నింటిని మనం ఫొటోల రూపంలో బంధించి దాచుకుంటాం. అలా మీరు దాచుకున్న అనుభవాలన్నింటితో పాటు మీ అమ్మకు సంబంధించిన ఫొటోలను సేకరించి, వాటిని కొన్ని చాక్లెట్లతో కలిపి ఎక్స్ ప్లోజన్ బాక్స్ గా చేసి తనకు అందించండి. ఇలాంటి వాటిని మీ అమ్మ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేదు.

అమ్మ పేరుతో ఓ స్టార్..

అమ్మ పేరుతో ఓ స్టార్..

మన నింగిలో నిత్యం మనకు కొన్ని కోట్ల నక్షత్రాలు కనిపిస్తుంటాయి. అందులో అమ్మ పేరుతో ఓ స్టార్ ఉంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఒకవేళ అది సాధ్యమైతే ఎప్పటికీ అది గుర్తుండిపోతుంది. అందుకే మదర్స్ డే సందర్భంగా ఓ తారలకు పేర్లు పెట్టే అవకాశాన్ని ఓ ఇంటర్నేషనల్ స్టార్ ఏజెన్సీ అందిస్తోంది. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. మీ అమ్మ పేరుతో ఓ నక్షత్రానికి పేరు పెట్టి.. ఆ స్టార్ ను అమ్మకు చూపుతూ తనని సర్ ప్రైజ్ చేయండి.

తన ఫ్రెండ్స్ తో..

తన ఫ్రెండ్స్ తో..

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా, ట్విట్టర్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిలో గ్రూప్స్ లో అందరూ కలిసే అవకాశం ఉంది కాబట్టి.. మనం స్నేహితులతో ఎప్పుడూ టచ్ లో ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది. మన అమ్మల కాలంలో అవేవీ లేవు. అయితే పాఠశాలల్లో లేదా కళాశాలల్లో తనతో పాటు చదువుకుని తమ అనుభవాలన్నీ పంచుకున్న ఫ్రెండ్స్ మాత్రం ఎంతో మంది ఉంటారు. మీరు ఏదో విధంగా ప్రయత్నించి వారిని చేరుకుని.. మీ అమ్మతో ఓసారి కలిసేలా ప్రయత్నం చేయండి. వారిని అకస్మాత్తుగా అమ్మ ముందు నిలబెట్టి తనను ఆశ్చర్యపరచండి.

ప్రతిరోజూ ప్రేమగా..

ప్రతిరోజూ ప్రేమగా..

చూశారు కదా.. మదర్స్ డే రోజు అమ్మకు మధురమైన అనుభూతిని కలిగించేందుకు గల మార్గాలు. అయితే కేవలం ఈ ఒక్కరోజు అమ్మపై ప్రేమ చూపడం కాదు.. ప్రతిరోజూ మీరు అమ్మకు ప్రేమను అందిస్తుంటే మదర్స్ డేకు సరైన ప్రాధాన్యతనిస్తూ అమ్మను ప్రేమించినట్లు అవుతుంది. ఈ ఒక్క రోజు విషెస్ చెప్పి మిగిలిన రోజు అమ్మను పట్టించుకోకపోతే ఈరోజు మీరు ఏమి చేసినా.. ఎంత చేసినా అది వృథా ప్రయాసే అవుతుందని గుర్తుంచుకోండి.

English summary

Best Ways to Celebrate Mother's Day in Telugu

Here are the best ways to celebrate mother's day in telugu. Take a look