For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన పెళ్లికి అతిథులు రూ. లక్ష ఇవ్వలేదని వివాహాన్ని విరమించుకున్న వధువు..

అతిథులు, స్నేహితులందరూ కలిసి తనకు కావాల్సినంత నగదు బహుమతి ఇవ్వమని చెప్పడంతో మనస్తాపం చెందిన సుసాన్ అనే మహిళన వివాహానికి 4 రోజుల ముందు పెళ్లికి నిరాకరించింది. ఆమె ఎందుకు నిరాకరించిందో తెలుసుకోవాలంటే ఈ

|

మన దేశంలో వివాహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. అసలు పెళ్లి అంటే అటు ఏడుతరాలు.. ఇటు ఏడుతరాలు అన్నీ చూసి సంబంధం కుదుర్చుకుంటారు. ఒకప్పుడు ఇలా జరిగే పెళ్లిళ్లు కాస్త కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ప్రతి పెళ్లికి మ్యారేజీ బ్రోకర్ ను సంప్రదించేవారు. కానీ ఇప్పుడు ఆన్ లైన్, సోషల్ మీడియా పుణ్యమా అని మ్యారేజీ బ్రోకర్లను సంప్రదించడం చాలా వరకు తగ్గించారు. ఇప్పటి యువత అయితే ఒకడుగు ముందుకు వేసి మరీ వారికి కావాల్సిన జీవిత భాగస్వామిని వారే వెతుక్కుంటున్నారు. కొందరు ఈ పెళ్లిళ్ల కోసం ఆన్ లైన్ వెబ్ సైట్లను చక్కగా వినియోగించుకుంటున్నారు. టెక్నాలజీపై అంతగా అవగాహన లేని వారు మాత్రం వరుడి వివరాలు తెలుసుకోకుండా తొందరపడుతున్నారు. అలాంటి వార్తలు, కథలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా జరిగాయి.

ఫేస్ బుక్ లో పరిచయమై పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి కొందరు జారుకోవడం.. ఇంకొందరు విదేశాల్లో ఉంటున్నట్లు నకిలీ వివరాలు పొందుపరుస్తున్నారు. ఆఖరికి అసలు నిజాలు తెలుసుకొని బాధపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే పత్రికలలో ప్రకటనలు, ఆన్ లైన్ వేదికగా ఉండే సైట్లలో వరుడు లేదా వధువు వివరాలు పొందుపరిచి వివాహ సంబంధాలను సెట్ చేసుకుంటుంటారు. మన దేశంలో చాలా వరకు వివాహ సమయంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగిపోతాయి.

Bride Calls Off Wedding After Guests Refuse To Pay 1 Lakh Each As Wedding Gift

కానీ అదే కొన్ని సినిమాల్లో అయితే సరిగ్గా తాళి కట్టే సమయానికి పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. అలా ఎందుకు జరుగుతుందో ఆ సినిమా చూసే వారికి ఇట్టే తెలిసిపోతుంది. కట్నం తక్కువగా ఇచ్చారనో, లేదా కట్నం డబ్బులు ఇంకా బాకీ ఉన్నారనో అంతవరకు పెళ్లి జరగదని డైలాగ్ లు వినిపిస్తుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే
ఇపుడు మీరు చదివే స్టోరీలో వీటన్నింటిని మించిన ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. వివాహానికి కేవలం నాలుగంటే నాలుగే రోజుల ముందు ఓ వధువు సాహాసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో తెలిస్తే అందరూ అవాక్కవుతారు. ఆమె వివాహానికి ముందు ఓ ఖరీదైన డిమాండ్ ను అతిథుల ముందు ప్రతిపాదించింది. ఆమె డిమాండ్ వింటే భారతీయులు వివాహాల గురించి మరచిపోవాల్సిందే.

సాధారణంగా మన దేశంలో పెళ్లిళ్లలో వివాహం జరిగే సమయంలో బహుమతులు, నగదును అందజేస్తుంటారు. ఇందులో ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేశంలో ఇది ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆచారం. దీనిని నాటి నుండి నేటి వరకు చాలా మంది ఫాలో అవుతున్నారు. కానీ కెనడాకు చెందిన సుసాన్ తన పెళ్లికి ముందు అతిథులందరి నుండి నగదు డిమాండ్ చేసింది. అది కూడా వందో, రెండోందలో కాదు ఏకంగా లక్ష రూపాయలను డిమాండ్ చేసింది. ఇందుకు ఆ అతిథులు ఆశ్చర్యపోయారు. ఆమె నిర్ణయం సరైంది కాదన్నారు. అందుకు వారు నిరాకరించారు. తాము అంత నగదు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇందుకు మనస్తాపం చెందిన ఆ మహిళ కేవలం ఇదొక కారణంతో వివాహం చేసుకోనని చెప్పేసింది.

అంతేకాదు తన వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ఏకంగా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. "ప్రియమైన మిత్రులారా, నేను పెళ్లి రద్దును ప్రకటించినందుకు చాలా బాధగా ఉంది. నాలుగు రోజుల ముందే రద్దు చేసినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. దురదృష్టవశాత్తు, [కాబోయే భర్త] మరియు నేను ఇటీవల మరియు కోలుకోలేని కొన్ని సమస్యల కారణంగా విడిపోయాను. మా సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. భవిష్యత్ చర్యలతో ముందుకు సాగకూడదు" అని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

అంతే కాదు ఆ పోస్టులో మరిన్ని ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది. తనకు కాబోయే భర్తతో పాటు, తమ పెళ్లి కోసం కొంత సొమ్మును ఆదా చేయగలిగామని చెప్పింది. ముందుగా కొంతసొమ్మును పెళ్లి కోసం అనుకున్నామని, తర్వాత దాన్ని నాలుగింతలు పెంచాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఈ కారణంగా వారు తమ స్నేహితుల నుండి సహాయం కోరినట్లు తెలిపింది. వారిలో కేవలం 8 మంది మాత్రమే డబ్బుతో RSVP'd చేసినప్పుడు, ఆమెకు కోపం వచ్చింది. తన కల అయిన వివాహానికి సంబంధించి తనకు సహాయం చేయకపోవడంపై ఆమె తన స్నేహితులను, కుటుంబసభ్యులను నిందించింది. దీంతో వారంతా ఆమెతో తాము ఎలాంటి సంబంధాలు పెట్టుకోమని చెప్పారు. అంతే కాదు సుసాన్ పెళ్లి విషయంలో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం అర్థవంతం కాదని, ఆమె పట్టుబట్టిన డిమాండ్లు సరైనవి కాదని వారు తెలిపారు.

సో పెళ్లిళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ సుదీర్ఘంగా ఆలోచించి మీ జీవిత భాగస్వామిని ఎంచుకోండి. లేదంటే ఇలాంటి ఇబ్బందులు మీకు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more about: insync wedding
English summary

Bride Calls Off Wedding After Guests Refuse To Pay 1 Lakh Each As Wedding Gift

Usually in our country weddings are given gifts and cash at the time of the wedding. No one should be surprised at this. Because it has been a custom in our country ever since. Many people have been following it since. But Susan of Canada demanded cash from all the guests before her wedding. It also demanded Rs 1 lakh, not a second. The guests were thrilled. They refused. They decided to give them as much cash.The guests were thrilled. Her decision was not fair. They refused. They decided to give them as much cash. The woman was offended by this and told her not to marry for the same reason.
Story first published:Friday, August 9, 2019, 17:39 [IST]
Desktop Bottom Promotion