For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..

కొన్ని విషయాలను ఎప్పటికీ రహస్యంగానే ఉంచాలని, వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని, ఇతరులతో పంచుకోవడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పాడు చాణక్యుడు. చాణక్యుడు ఎవరితోనూ పంచుకోవద్దన్న ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

చాణక్యుడు గొప్ప జ్ఞాని. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రాల్లో లోతైన జ్ఞాన ఉన్న వ్యక్తి. ఆయన రచించిన చాణక్య నీతిలో ఎన్నో విషయాల గురించి వివరంగా చెప్పారు. జీవితం గురించి, జీవితంలోని ఎన్నో అంశాల గురించి ఎన్నో వివరాలు చెప్పారు. జీవితం సాఫీగా, ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా సాగేందుకు ఎలాంటి పనులు చేయాలో చక్కగా చెప్పాడు.

Chanakya Niti: Never Share These Secrets With Anyone in Telugu

మనిషి సంతోషకరమైన జీవితానికి, కష్టాలను దూరం చేయడానికి కొన్ని విధానాలను రూపొందించాడు. వాటి గురించి చాణక్య నీతి పుస్తకంలో వివరించాడు. ఈ విధానాలను అవలంబించడం ద్వారా విజయ శిఖరాలను చేరుకోవచ్చు. కొన్ని విషయాలను ఎప్పటికీ రహస్యంగానే ఉంచాలని, వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని, ఇతరులతో పంచుకోవడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పాడు చాణక్యుడు. చాణక్యుడు ఎవరితోనూ పంచుకోవద్దన్న ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: ఈ 7 విషయాలు గుర్తుంచుకోకపోతే ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడుChanakya Niti: ఈ 7 విషయాలు గుర్తుంచుకోకపోతే ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడు

ఆర్థిక సమస్యలు:

ఆర్థిక సమస్యలు:

చాణక్యుడి ప్రకారం ఆర్థిక సమస్యలు చాలా చెడ్డవి. ఆర్థిక సమస్యలు తమతో పాటు ఇతర సమస్యలనూ తెచ్చిపెడతాయి. ప్రశాంతత పోగొడతాయి. కుటుంబసభ్యుల మధ్య, దంపతుల మధ్య కూడా కలహాలు తెచ్చిపెడతాయి. మిత్రులను, బంధువులను కూడా దూరం చేస్తాయి. ప్రజలు తమకు ఏదైనా సహాయం చేయగల వారి సహవాసాన్ని కోరుకుంటారు.

మీతో వారికి ఎలాంటి ఉపయోగం లేదనుకుంటే మీకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. విలువ ఇవ్వరు. మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంటే ఆ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి. వాటి గురించి ఇతరులకు తెలియడం వల్ల మీకు బయట అప్పు కూడా పుట్టదు. మాట సాయం కూడా చేయరు. ఆర్థికంగా లేనివారిని చాలా మంది నీచంగా చూస్తారని చాణక్యుడు చెప్పాడు.

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ ఆరుగురు బంధువు మిమ్మల్ని ఒంటరిగా అస్సలే వదలిపెట్టరుChanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ ఆరుగురు బంధువు మిమ్మల్ని ఒంటరిగా అస్సలే వదలిపెట్టరు

భార్య గురించి ఎవరికీ చెప్పొద్దు:

భార్య గురించి ఎవరికీ చెప్పొద్దు:

చాణక్యుడి ప్రకారం భార్య గురించి ఎవరికీ ఎలాంటి విషయం చెప్పకూడదు. ఒకరి భార్య ఒక వ్యక్తి యొక్క అత్యంత వ్యక్తిగత ఆస్తి అని చాణక్యుడు చెప్పాడు. భార్య గురించి ఇతరులకు చెప్పడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక వ్యక్తి అవతలి వ్యక్తి భార్య గురించి తెలుసుకున్న తర్వాత, ఆమె బలహీనతలను తెలుసుకున్న తర్వాత ఆమెతో అనైతిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించవచ్చు. లేదంటే ఆమె రహస్యాలను తన సన్నిహితులతో పంచుకోవచ్చు.

ఒక స్నేహితుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో ఎప్పుడూ అంచనా వేయలేం. స్నేహితుడిగా ఉన్నప్పుడు మీ భార్య గురించి అతని వద్ద ప్రస్తావిస్తే మీకు శత్రువుగా మారిన తర్వాత మిమ్మల్ని అవమానించొచ్చు, ఎగతాళి చేయవచ్చు. లేదంటే వాటితో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ కూడా చేయవచ్చు.

Chanakya Niti: తల్లిదండ్రులూ.. మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలే చేయొద్దుChanakya Niti: తల్లిదండ్రులూ.. మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలే చేయొద్దు

వ్యక్తిగత సమస్యలు:

వ్యక్తిగత సమస్యలు:

వ్యక్తిగత సమస్యలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎదుటివారికి మీ సమస్యలను చెప్పడం ద్వారా మీకు సహాయం చేయకపోవచ్చు. సాయం చేయాలనుకున్న వాళ్లు కూడా మీ సమస్యలు విని భయపడిపోతారు. అందుకే వ్యక్తిగత సమస్యలను ఎవరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు చెప్పాడు.

సమస్యల్లో కూరుకుపోయిన వ్యక్తికి స్నేహితులు కూడా దూరంగా ఉంటారు. బంధువులు దూరమవుతారు. మీకు సమస్య ఉన్నా, లేకపోయినా ఒకేలా ఉండాలి. మీ సమస్య పరిష్కరించుకోవడానికి మీరే కష్టపడాలని చాణక్యుడు చెప్పాడు.

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి స్త్రీలను అస్సలే పెళ్లి చేసుకోవద్దుChanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి స్త్రీలను అస్సలే పెళ్లి చేసుకోవద్దు

English summary

Chanakya Niti: Never Share These Secrets With Anyone in Telugu

read this to know Chanakya Niti: Never Share These Secrets With Anyone in Telugu
Story first published:Monday, January 23, 2023, 12:00 [IST]
Desktop Bottom Promotion