For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chanakya Niti: తల్లిదండ్రులూ.. మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలే చేయొద్దు

తల్లిదండ్రులు చేసే పనులు, మాట్లాడే మాటలు పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తాయి. పిల్లలతో ఎలా ప్రవర్తిస్తే వారు అలాగే పెరుగుతారు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు కొన్ని పనులు అస్సలే చేయవద్దని చాణక్యుడు చెప్పారు. అవేంటో ఇప్పుడ

|

చాణక్యుడు గొప్ప జ్ఞాని. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రాల్లో లోతైన జ్ఞాన ఉన్న వ్యక్తి. ఆయన రచించిన చాణక్య నీతిలో ఎన్నో విషయాల గురించి వివరంగా చెప్పారు. జీవితం గురించి, జీవితంలోని ఎన్నో అంశాల గురించి ఎన్నో వివరాలు చెప్పారు. జీవితం సాఫీగా, ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా సాగేందుకు ఎలాంటి పనులు చేయాలో చక్కగా చెప్పాడు.

Chanakya Niti: Parents should never discuss these things in front of children in Telugu

చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన వివిధ విషయాల గురించి చెప్పారు. ఆయన తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉంటే పిల్లలపై సానుకూల ప్రభావం పడుతుందో చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు కొన్ని పనులు చేయకూడదని చాణక్యుడు చెప్పారు. తల్లిదండ్రులు చేసే పనులు, మాట్లాడే మాటలు పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తాయి. పిల్లలతో ఎలా ప్రవర్తిస్తే వారు అలాగే పెరుగుతారు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు కొన్ని పనులు అస్సలే చేయవద్దని చాణక్యుడు చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి స్త్రీలను అస్సలే పెళ్లి చేసుకోవద్దుChanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి స్త్రీలను అస్సలే పెళ్లి చేసుకోవద్దు

ఆలోచించకుండా మాట్లాడకూడదు:

ఆలోచించకుండా మాట్లాడకూడదు:

ప్రతి వ్యక్తి తమ పిల్లల ముందు చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాలని చాణక్యుడు సూచించారు. పిల్లలు ఎంతో సున్నిత స్వభావులు ఎలాంటి వాటికైనా త్వరగా స్పందిస్తారు. మంచికైనా, చెడుకైనా వారి స్పందన ఒకేలా ఉంటుంది. చెడు విషయాల వల్ల వారి భవిష్యత్తు పాడవుతుంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఆలోచనతో మాట్లాడాలి. ఏ పని చేసే ముందైనా దాని వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించుకోవాలని చాణక్యుడు సూచించారు.

Chanakya Niti: ఈ గుణాలున్న వారు జీవితంలో అంతులేని సంపద పొందుతారుChanakya Niti: ఈ గుణాలున్న వారు జీవితంలో అంతులేని సంపద పొందుతారు

అవమానకరరీతిలో మాట్లాడొద్దు:

అవమానకరరీతిలో మాట్లాడొద్దు:

తల్లిదండ్రులు పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి. పిల్లల ముందు అవమానకరమైన పదాలు వాడకూడదు. ఎదుటివారిని తిట్టకూడదు. పిల్లలు మనం చెప్పేదాని కంటే మనం చేసే దాని నుండే ఎక్కువగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చేసే పనిని అచ్చంగా అలాగే చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు సూచించారు.

ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు అవమానకరరీతిరో మాట్లాడకూడదు. గౌరవం లేకుండా వ్యవహరించకూడదు. పిల్లల ముందు అసభ్యకరంగా ప్రవర్తించకూడదు. అది నేరుగా పిల్లల మనస్సుపై ప్రభావం చూపుతుంది.

Chanakya Niti: ఈ చిట్కాలు పాటిస్తే దంపతుల మధ్య గొడవలుండవు, బంధం బలోపేతం అవుతుందిChanakya Niti: ఈ చిట్కాలు పాటిస్తే దంపతుల మధ్య గొడవలుండవు, బంధం బలోపేతం అవుతుంది

అబద్ధాలు చెప్పకూడదు:

అబద్ధాలు చెప్పకూడదు:

తల్లిదండ్రులు పిల్లల ముందు అబద్ధాలు చెప్పకూడదని చాణక్యుడు సూచించారు. వారి ముందు అబద్ధాలు చెప్పినా, పిల్లలను అబద్ధాల్లో ప్రమేయం చేసినా వారికి తల్లిదండ్రులపై గౌరవం లేకుండా చేస్తుంది. అలాగే వారు కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. ఇది మొదట్లో సరదాగా అనిపించినా పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక సమస్యలను తెచ్చిపెడుతుందని తల్లిదండ్రులు గుర్తించాలని చాణక్యుడు వివరించారు. అందుకే వారి ముందు అబద్ధాలు చెప్పొద్దని, అబద్ధాలు చెప్పమని ఎవరినీ ప్రోత్సహించవద్దని చెప్పారు.

చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలున్న పురుషులంటే స్త్రీలకు ఎంతో ఇష్టం, అవేంటంటే..చాణక్య నీతి ప్రకారం ఈ లక్షణాలున్న పురుషులంటే స్త్రీలకు ఎంతో ఇష్టం, అవేంటంటే..

గొడవలు, లోపాల గురించి ప్రస్తావన వద్దు:

గొడవలు, లోపాల గురించి ప్రస్తావన వద్దు:

పిల్లల ముందు తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రేమించుకోవాలి. ప్రేమగా మాట్లాడాలి. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. వారి ముందు గొడవలు పడకూడదు. ఆ గొడవల వేళ ఒకరి లోపాల గురించి మరొకరు ప్రస్తావించకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం పోతుందని చాణక్యుడు చెప్పారు. వీటన్నింటి కారణంగా పిల్లలు తరచుగా అవమానించడాన్ని చెడుగా చూడలేరు. అది కమ్యూనికేషన్ లో ఓ భాగం అనుకుంటారు.

Chanakya Niti: యవ్వనంలో చేసే ఈ చిన్న తప్పులు భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయిChanakya Niti: యవ్వనంలో చేసే ఈ చిన్న తప్పులు భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి

English summary

Chanakya Niti: Parents should never discuss these things in front of children in Telugu

read this to know Chanakya Niti: Parents should never discuss these things in front of children in Telugu
Desktop Bottom Promotion