Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 5 అంశాలు ప్రాణాలు తీస్తాయి, వాటితో జాగ్రత్త అవసరం
కొన్ని విషయాలు మరణాన్ని తీసుకువస్తాయని చాణక్యుడు చెప్పాడు. వాటితో జాగ్రత్తగా ఉండాలని లేదంటే మరణం సంభవించవచ్చని సూచించాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు గొప్ప జ్ఞాని. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రాల్లో లోతైన జ్ఞాన ఉన్న వ్యక్తి. ఆయన రచించిన చాణక్య నీతిలో ఎన్నో విషయాల గురించి వివరంగా చెప్పారు. జీవితం గురించి, జీవితంలోని ఎన్నో అంశాల గురించి ఎన్నో వివరాలు చెప్పారు. జీవితం సాఫీగా, ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా సాగేందుకు ఎలాంటి పనులు చేయాలో చక్కగా చెప్పాడు.

మనిషి సంతోషకరమైన జీవితానికి, కష్టాలను దూరం చేయడానికి కొన్ని విధానాలను రూపొందించాడు. వాటి గురించి చాణక్య నీతి పుస్తకంలో వివరించాడు. ఈ విధానాలను అవలంబించడం ద్వారా విజయ శిఖరాలను చేరుకోవచ్చు. కొన్ని విషయాలు మరణాన్ని తీసుకువస్తాయని చాణక్యుడు చెప్పాడు. వాటితో జాగ్రత్తగా ఉండాలని లేదంటే మరణం సంభవించవచ్చని సూచించాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అగ్ని
ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ మంటకు దూరంగా ఉండాలి. అగ్నితో ఆటలు ఆడకూడదు. అగ్నితో ఆడుకోవడం ప్రాణాల మీదకు తీసుకువస్తుంది. నిప్పు ఏదైనా వ్యక్తిని లేదా వస్తువును క్షణాల్లో బూడిద చేయగలదు.

2. నీరు
నీరు జీవితానికి చాలా ముఖ్యమైనది. నీరు లేకుండా జీవితం సాగదు. కానీ కొన్ని సార్లు నీరు ప్రాణాంతకంగా మారుతుంది. ఈత కొట్టడం తెలియకపోతే నది, చెరువు, కాల్వల్లోకి దిగకూడదు. అలాంటి ప్రదేశాల్లో నీరు మన ప్రాణాలు తీస్తుంది.

3. పాము
ఆచార్య చాణక్యుడి ప్రకారం పాముతో చెలగాటం ఆడకూడదు. దాని విషం ప్రాణాలు తీయగలదు. పాలు పోసి పెంచినా కూడా పాము తన బుద్ధి మార్చుకోదు. అది కాటు వేస్తే విషం ఎక్కుతుంది. దానికి తర, తమ భేదాలు తెలియవని చాణక్యుడు చెప్పాడు.

4. తెలివితక్కువ వ్యక్తి
అగ్ని, నీరు, పాము ఎంత భయంకరమైనవో మూర్ఖుడు కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనవారు. వారితో సహవాసం చాలా ప్రమాదం. వారి తెలివితక్కువతనానికి మనం చాలా ఇబ్బందులు పడతాం. ఒక్కోసారి వారు చేసే పొరపాట్లు ప్రాణాల మీదకు తీసుకువస్తుంది.

5. రాజ కుటుంబం
ఆచార్య చాణక్యుడి ప్రకారం రాజ కుటుంబానికి చాలా అధికారాలు ఉంటాయి. వారితో సాధారణ వ్యక్తి ఎలాంటి గొడవ పెట్టుకోకపోవడం ఉత్తమం. వారి వద్ద ఉండే అధికారం, డబ్బు, పలుకుబడి మనకు ఇబ్బంది తెచ్చిపెట్టవచ్చు. వారితో కలహం ప్రాణాల మీదకూ తీసుకురావొచ్చు.



Click it and Unblock the Notifications