For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో! కరోనా వైరస్ పచ్చని కాపురాలను కూడా కూల్చేస్తోందట...

|

ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా జపం చేస్తోంది. ఎందుకంటే ఇట్స్ కరోనా టైమ్. చైనా నుండి వచ్చిన ఈ మహమ్మారి ప్రపంచంలోని అనేక దేశాలను గడగడలాడిస్తోంది. దీని బారి నుండి తప్పించుకునేందుకు ఇప్పటికే చాలా దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. చాలా వరకు దేశాలు షట్ డౌన్, లాక్ డౌన్ చేసేశాయి.

మన దేశంలో కరోనా భూతాన్ని రెండో దశ నుండే తరిమి కొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. అందులో భాగంగానే విదేశాలకు వీసాలను రద్దు చేశారు. దాదాపు రెండు వారాల పాటు రద్దీగా ఉండే ప్రాంతాలన్నింటినీ కచ్చితంగా మూసివేయాలని కఠినమై నిబంధనలను సైతం విధించారు.

అయినప్పటికీ మన దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ఆనందించాల్సిన విషయం ఏమిటంటే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మన హైదరాబాద్ లో, కేరళ రాష్ట్రంలో కొందరు కరోనా వైరస్ నుండి విజయవంతంగా కోలుకున్నారు.

అలాగే చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడిప్పుడే అక్కడ కూడా కంట్రోల్ లోకి వస్తుంది. అయితే ఇంతలోనే చైనీయులకు మరో సమస్య వచ్చి పడింది. ఈ కరోనా దెబ్బకు చాలా వరకు జంటలు విడాకులు తీసుకుని విడిపోతున్నాయంట. అదేంటి కరోనాకు పెళ్లి చేసుకున్న జంటలకు లింకేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీని చూసేయండి మరి...

కరోనా కలవరం..

కరోనా కలవరం..

నిన్న, మొన్నటిదాకా చైనా ప్రజలు తమ జీవితాలను చాలా బిజీగా గడిపేవారు. ఉదయం నిద్ర లేవగానే ఆలుమగలిద్దరూ కలిసి వారి పనులలోకి వెళ్లిపోయేవారు. వారి కలిసి ఉండటానికి అతి తక్కువ సమయమే దొరికేది. అయినా కూడా తక్కువ సమయంలోనే వారు అన్యోన్యంగా కలిసి జీవించేవారు.

కుటుంబాల్లో చీలిక..

కుటుంబాల్లో చీలిక..

అతి తక్కువ సమయం కలిసి ఉంటూనే ప్రేమ బంధాన్ని బలంగా మార్చుకున్న చైనీయులకు కరోనా వైరస్ రూపంలో పెద్ద ముప్పు వచ్చి పడింది. ఈ మహమ్మారి వల్ల సెలవులు వచ్చి కలిసుండే అవకాశం దక్కినప్పటికీ, వారు తీవ్రంగా బాధపడుతున్నారు. ఎందుకంటే దీని దెబ్బకు వారంత వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏకంగా కుటుంబాల్లో చీలికలు తెచ్చుకుంటున్నారు.

కోవిద్ ప్రభావం..

కోవిద్ ప్రభావం..

చైనాలో కోవిద్-19 ప్రభావం వల్ల కొన్ని వారాల పాటు ఇంట్లోనే ఉండిపోయిన జంటలు... ప్రస్తుతం తమ కాపురాలను కూల్చుకుంటున్నాయట. అందుకు నిదర్శనమే ఫిబ్రవరి 24 నుండి ఇప్పటివరకు అక్కడి రిజిస్టర్ల ఆఫీసుల్లో కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న విడాకులు. ఒక్కో కార్యాలయంలో వందలాది దరఖాస్తులు వచ్చి పడుతున్నాయట.

అసహనం పెరిగిపోయి..

అసహనం పెరిగిపోయి..

ఏ పనీ, పాట లేకుండా భార్యాభర్తలు నిమిషాలు, గంటలు, రోజుల తరబడి ఒకరి ఫేస్ ను ఒకరు చూస్తూ కూర్చోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయని ఫ్యామిలీ కౌన్సెలర్లు చెబుతున్నారు. అలానే ఒకే ఇంట్లో ఉండిపోవడం వల్ల వారిలో అసహనం పెరిగిపోయి, గొడవలు మొదలవుతాయని, అదే ప్రస్తుత పరిస్థితికి కారణమని వారు అంటున్నారు.

పెళ్లైన కొత్తలో..

పెళ్లైన కొత్తలో..

చైనాలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారిని ఈ కరోనా వైరస్ తెగ కలవరపెడుతోందట. వాళ్ల కొత్త కాపురంలో చిచ్చు రాజేస్తోందట. ఈ కరోనా దెబ్బకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఏదో ఒక సందర్భంలో ఘర్షణ పడుతున్నారంట. దాని ఫలితమే విడాకులకు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు.

బంధాలకు బై బై..

బంధాలకు బై బై..

కరోనా వైరస్ నేపథ్యంలో చాలా మంది జంటలు తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే చాలా మంది అపాయింట్ మెంట్లను సైతం తీసుకున్నట్లు డజహౌ కు చెందిన మ్యారేజ్ రిజిస్ట్రర్ మేనేజర్ లూ షిజున్ స్పష్టం చేశాడు.

English summary

Corona related divorce virus drives up divorce rates in china

Here we talking about corona related divorce virus drives up divorce rates in china. Read on
Story first published: Thursday, March 19, 2020, 9:09 [IST]