For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

N95 మాస్కులు కరోనాను ఏమాత్రం కట్టడి చేయలేవట...

|

ఇప్పటివరకు N95 మాస్క్ కరోనా వైరస్ నుండి కాపాడుతుందని అందరూ భావించారు. అయితే ఈ మాస్కు వాడకం గురించి ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.

వాల్వులు ఉన్న ఎన్95 మాస్కులను వాడొద్దని, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

ఈ మాస్కుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏ మాత్రం కాపాడలేవు. అంతేకాదు ఇవి వాడే వారి ఆరోగ్యానికి కూడా హానికరమని తేల్చింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సలహాను అందరూ అనుసరించాలని సూచించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్, ఆరోగ్య, వైద్య, విద్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో, ఎన్-95 మాస్క్ ప్రజలు మరియు ఆరోగ్య కార్యకర్తలు వాడొద్దని సూచించింది. ఇంట్లో తయారు చేసిన కాటన్ మాస్కులనే వాడాలని స్పష్టం చేసింది.

కరోనా వైరస్: వేగవంతమైన యాంటిజెన్ పరీక్ష అంటే ఏమిటి, అమితాబ్ మరియు అభిషేక్ బచ్చన్ కూడా ఈ పరీక్ష..

ఆ మాస్కులపై ఆసక్తి..

ఆ మాస్కులపై ఆసక్తి..

కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి చాలా మంది ఎన్95 మాస్కులను ధరించడానికి చాలా ఆసక్తి చూపారు. సాధారణ మాస్కు కంటే దీని ధర 10 రెట్లకు పైగా అధికంగా ఉన్నప్పటికీ దీనికే మొగ్గు చూపేవారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవు..

కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవు..

ఎన్95 మాస్కు కరోనా సోకకుండా కాపాడటంలో ఏ మాత్రం సురక్షితం కాదనే అంశం ఇటీవల చాలా చర్చనీయాంశమైంది. దీనికి ఉండే వాల్వ్ రంధ్రాలు కరోనా వైరస్ నుండి ఏ మాత్రం కాపాడలేవట. ఈ విషయాన్ని ఎవరో కాదు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన వైద్య నిపుణులే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కరోనా సోకే ప్రమాదం..

కరోనా సోకే ప్రమాదం..

ఎన్95 వాల్వులు ఉన్న మాస్కు కరోనా నుండి కాపాడలేకపోవడమే కాదు.. వాటి వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్'హెచ్చరించింది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్లు తినవచ్చా?

సాధారణ మాస్కులే బెటర్..

సాధారణ మాస్కులే బెటర్..

‘వాల్వ్ కలిగిన ఎన్95 మాస్కులతో ఎలాంటి ఉపయోగం లేదు. వ్యక్తి నోటి నుంచి బయటకు విడుదలయ్యే వైరస్ ను అవి ఆపలేవు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలకు ఇది అవరోధంగా మారుతుంది. సాధారణ మాస్కులే బెటర్. ముక్కు, నోరు పూర్తిగా మూసేసే మాస్కులను మాత్రమే వినియోగించాలి' అని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

పలు దేశాల్లో నిషేధం..

పలు దేశాల్లో నిషేధం..

రెస్పిరేటరీ వాల్వ్ మాస్కుల వాడకాన్ని ఇదివరకే కొన్ని దేశాలు కూడా నిషేధించాయి. ఇలాంటి మాస్కులను కేవలం పారిశ్రామిక ప్రదేశాలు, ఫ్యాక్టరీలలో పని చేసే సిబ్బంది మాత్రమే ఉపయోగిస్తారట. ఇందులో ఉండే రెస్పిరేటరీ వాల్వ్ లు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి.

పసుపును వేడి నీటితో కలిపి 7 రోజులు త్రాగితే .. శరీరానికి ఏమి జరుగుతుందో చూడండి ...

మాస్కులు ఎలా తయారు చేయాలంటే..

మాస్కులు ఎలా తయారు చేయాలంటే..

ఇంట్లో ఎలాంటి మాస్కులను ఎలా తయారు చేయాలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం ముఖం మరియు నోటికి బాగా సరిపోతాయని ముఖం మొత్తాన్ని కప్పి ఉంచాలని గుర్తుంచుకోండి.

మాస్కు ధరించే ముందు..

మాస్కు ధరించే ముందు..

మాస్కును ధరించే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. మంచినీటితో సబ్బుతో కడగాలి. అంతవరకూ ముసుగును ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మీ మాస్కును ఎవరితోనూ పంచుకోవద్దు. కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడు సొంత మాస్క్ ఉండటం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.

English summary

Covid-19: Centre Warns Against Use of n95 Masks With Valved Respirators

N95 masks inappropriately, particularly those with a valved respirator which are essentially meant to be used by designated health workers.
Story first published: Thursday, July 23, 2020, 14:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more