For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Corona Vaccine:ఇంట్లోనే ఉంటూ whatsappతో కోవిద్ వ్యాక్సిన్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోండిలా...

ఇంట్లోనే కూర్చొని వాట్సాప్ ద్వారా మీ ఇంటికి దగ్గర్లోని కరోనా వ్యాక్సిన్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోడానికి ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.

|

ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలో సగం కేసులు కేవలం మన దేశంలోని పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా ప్రకటించింది.

COVID-19 Vaccination Now Locate Nearest Vaccination Center via Whatsapp Follow These Simple Steps in Telugu

ఈ నేపథ్యంలోనే చాలా రాష్ట్రాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పాక్షిక లాక్ డౌన్ విధించారు. దీని వల్ల కరోనా కట్టడి అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు. ఇప్పటికే చాలా మందికి తొలి విడత, రెండో విడతలో టీకాలను అందజేశారు. తాజాగా మూడో విడతను కూడా ప్రారంభించారు. ఇందులో 18-45 సంవత్సరాల మధ్య వారు కూడా ముందుగా రిజిస్ట్రర్ చేసుకుని, టీకాలు వేయించుకోవచ్చు. దీంతో ఈ టీకాకు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రజలందరూ ఈ వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్నారు.

అయితే చాలా మందికి కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడున్నాయి.. ఏయే సమయంలో అవి పని చేస్తున్నాయి.. ఏ సమయంలో సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు..

COVID-19 Vaccination Now Locate Nearest Vaccination Center via Whatsapp Follow These Simple Steps in Telugu

తాము ఎప్పుడు వెళితే తమకు టీకా అందుతుందనే విషయాలపై స్పష్టత లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం, వాట్సాప్ తో కలిసి కరోనా వ్యాక్సిన్ ప్రజలకు మరింత సులభంగా అందేలా ఓ ప్రణాళిక రచించాయి. దీని ప్రకారం, మీరు మీ ఇంట్లో ఉండే వాట్సాప్ ద్వారా కరోనా వ్యాక్సిన్ సెంటర్ ఎక్కడుంది.. ఏ సమయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారు.. అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అందుకోసం కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

కోవిడ్ -19: మీరు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి; ఎందుకంటే...కోవిడ్ -19: మీరు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి; ఎందుకంటే...

హెల్ప్ డెస్క్

హెల్ప్ డెస్క్

MyGovIndia హెల్ప్ డెస్క్ సహాయంతో మీరు వాట్సాప్ లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను భారతదేశంలో ఏయే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడున్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కరోనా వైరస్ పై వాట్సాప్ చాట్ బోట్ సేవను ప్రభుత్వం గత ఏడాది మార్చి మాసంలో ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది వాట్సాప్ వినియోగదారులందరికీ పూర్తిగా ఉచితం. ఇందులో వాట్సాప్ యూజర్లు కరోనాకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. ఈ సేవ ఇంగ్లీష్, హిందీ భాషలో అందుబాటులో ఉంది.

ఈ నెంబర్ కు..

ఈ నెంబర్ కు..

వాట్సాప్ లో కరోనా వ్యాక్సిన్ సెంటర్ ను కనుక్కోడానికి మీరు చేయాల్సిందల్లా చాట్ లో ‘నమస్తే' అని టైప్ చేసి 9013151515 నెంబర్ కు వాట్సాప్ చేయాలి. దాని నుండి మీకు ఆటోమేటిక్ గా రిప్లై వస్తుంది. అందులో కోవిద్ వ్యాక్సిన్ సెంటర్ తో పాటు కరోనా లేటేస్ట్ అప్ డేట్స్ ఇతర సమాచారం కనిపిస్తుంది. అప్పుడు మీరు మీకు కావాల్సిన నెంబర్ ను ఎంటర్ చేయాలి. మీరు కోవిద్ వ్యాక్సిన్ సెంటర్ ను తెలుసుకునేందుకు 1 నెంబర్ ను ఎంటర్ చేయాలి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు కరోనాను తరిమికొట్టడానికి ఈ ఒక పానీయం సరిపోతుంది ...!రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు కరోనాను తరిమికొట్టడానికి ఈ ఒక పానీయం సరిపోతుంది ...!

పిన్ కోడ్ ఎంటర్..

పిన్ కోడ్ ఎంటర్..

ఆ తర్వాత మీ ప్రాంతం యొక్క పిన్ కోడ్ ను ఎంటర్ చేయాలి. అక్కడ మీ నగరం, పట్టణం, జిల్లా, మండలంలో ఎన్ని కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయి. అవి ఎప్పటి నుండి అందుబాటులో ఉంటాయి. ఏయే వయసులో ఉండే వారికి అందుబాటులో ఉంటుంది. ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. అనే వివరాలు కనిపిస్తాయి.

రిజిస్ట్రేషన్..

రిజిస్ట్రేషన్..

దాంతో పాటు మీకు ఓ లింక్ కూడా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు మీరు కోవిన్ వెబ్ సైట్లో లేదా ఆరోగ్య సేతు యాప్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి.

English summary

COVID-19 Vaccination Now Locate Nearest Vaccination Center via Whatsapp Follow These Simple Steps in Telugu

The ‘MyGov Corona Helpdesk’ chatbot on WhatsApp will now help users to find a vaccination center.
Story first published:Thursday, May 6, 2021, 16:34 [IST]
Desktop Bottom Promotion