For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cyclone Nivar : ని‘వర్రీ’ టైములో ఏమి చేయాలి.. ఏమి చేయకూడదో చూడండి...!

నివర్ తుఫాను వస్తున్న సమయంలో చేయాల్సిన మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బెంగాల్ బేలో నివర్ తుఫాను ఈరోజు(25వ తేదీ) రాత్రి కరైకల్ మరియు మామల్లపురం మధ్య తీరం దాటుతుంది. ఈ సమయంలో నివర్ తుఫాను గంటకు సుమారు 130 నుండి 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని, గరిష్ట వేగం గంటకు 155 కిలోమీటర్ల మేరకు ఉంటుంది.

Cyclone Nivar: Here are the dos and donts to stay safe before, during and after landfall

ఈ సమయంలో ప్రజలకు ఏ మాత్రం నష్టం జరగకుండా ప్రభుత్వం అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రకృతి వైపరీత్యాలు తరచుగా ప్రజల ఇళ్లకు మరియు ఆస్తికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఇలాంటి సమయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ముఖ్యం. ఈ సమయంలో తగినంత సురక్షితమైన నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.

Cyclone Nivar: Here are the dos and donts to stay safe before, during and after landfall

అలాగే నిత్యవసరాలను కూడా వీలైనంత మేరకు దగ్గర ఉంచుకోవాలి. అలాగే పుకార్లను నమ్మకూడదు. అధికారిక ప్రకటనలనే నమ్మాలి. ఇతరులను అప్రమత్తం చేయాలి. ఇలాంటి వివరాలతో పాటు ప్రజలందరూ సురక్షితంగా ఉండేందుకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ డిఎంఎ) కొన్ని మార్గదర్శకాలను ట్విటర్లో విడుదల చేసింది. ముఖ్యంగా తుఫానుకు ముందు ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే వివరాలను ట్వీట్ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

తుఫానుకు ముందు..

తుఫానుకు ముందు..

  • తుఫాను లేదా ఏదైనా విపత్తుల సమయంలో పుకార్లను అస్సలు నమ్మకండి. ప్రశాంతంగా ఉండండి.. భయపడకుండా ధైర్యంగా ఉండండి.
  • కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్ ను ఫుల్ ఛార్జింగులో ఉంచుకోండి.
  • రేడియోను ఎక్కువగా వినండి. టివిలో న్యూస్ చూస్తూ ఉండండి. వాతావరణ విశేషాల కోసం కొన్ని వార్తాపత్రికలను చూడండి.
  • మీ విలువైన పత్రాలు మరియు విలువైన వస్తువులను నీరు రాకుండా ఉండే ప్రదేశంలో ఉంచండి.
  • అవసరమైన వస్తువులతో అత్యవసర సామాగ్రిని సిద్ధం చేసుకోండి.
  • జంతువుల భద్రతను గుర్తుంచుకోండి.
  • ఇంటి లోపల..

    ఇంటి లోపల..

    • ఎలక్ట్రికల్ మరియు గ్యాస్ సరఫరాను ఆపేయండి.
    • మీ తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.
    • మీ ఇల్లు సురక్షితం కాదని భావిస్తే, తుఫాను రావడానికి ముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి.
    • ఉడికించిన లేదా క్లోరినేటెడ్ నీటినే తాగాలి.
    • అధికారిక హెచ్చరికలను మాత్రమే ఫాలో అవ్వండి.
    • బహిరంగ ప్రదేశాల్లో..

      బహిరంగ ప్రదేశాల్లో..

      • మీరు తుఫాను సమయంలో దెబ్బతిన్న భవనాలలోకి ప్రవేశించకండి.
      • విరిగిన విద్యుత్ స్తంబాల దగ్గరకు వెళ్లకండి.
      • తెగిపడిన విద్యుత్ తీగలను పట్టుకోకండి.
      • పదునైన వస్తువులకు దూరంగా ఉండండి.
      • వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి.
      • సురక్షితం అనిపిస్తేనే..

        సురక్షితం అనిపిస్తేనే..

        • మీరు ఆశ్రయం పొందిన చోట నుండి.. ఇంటికి వెళ్లడానికి సురక్షితమని భావించినప్పుడు అడుగు ముందుకేయండి.
        • ముందుగానే అంటువ్యాధుల నివారణ టీకాలు వేయించుకోండి.
        • వేలాడుతున్న తీగలకు దూరంగా ఉండండి.
        • తుఫాను సమయంలో డ్రైవింగులో ఉంటే జాగ్రత్తగా ఉండండి.
        • మీరు ఉండే ప్రదేశంలో శిథిలాలను క్లియర్ చేయండి.

English summary

Cyclone Nivar: Here are the do's and don'ts to stay safe before, during and after landfall

Cyclone Nivar: Here are the dos and donts to stay safe before, during and after landfall. Know more.
Story first published:Wednesday, November 25, 2020, 17:51 [IST]
Desktop Bottom Promotion