For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మంచి అలవాట్లే మిమ్మల్ని సూపర్ పవర్ గా మారుస్తాయని తెలుసా...!

మీ రోజు వారీ అలవాట్లు మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి.

|

ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరూ రెగ్యులర్ హ్యాబిట్స్ ను ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మంచి విషయాలను మంచి అలవాట్లుగా మార్చుకోవడం.

Daily Habits That Can Actually Change Your Life

డైలీ హ్యాబిట్స్ అంటే పెద్ద కష్టమేమీ కాదని చాలా మంది గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, టైమ్ కి ఫుడ్ తినడం.. జ్యూస్ తాగడం, ఫ్రూట్స్ తీసుకోవడంతో పాటు కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడం వంటివి అలవాటుగా మార్చుకుంటారు.

Daily Habits That Can Actually Change Your Life

అయితే ఇలాంటి డైలీ హ్యాబిట్స్ గురించి మనకు ప్రతిరోజూ మన పేరేంట్స్, పెద్దలు, స్కూల్లో టీచర్లు, కాలేజీల్లో లెక్చరర్లు, వైద్య నిపుణులు, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోచెస్... అందరూ గుడ్ హ్యాబిట్స్ గురించి ఏవేవో విషయాలను చెబుతూ ఉంటారు. అయితే అలాంటివి నిజంగానే ఫాలో అవ్వాలా? అలాంటి అలవాట్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే అలాంటి గుడ్ హ్యాబిట్సే మీ లైఫ్ ని సక్సెస్ ఫుల్ గా మారుస్తాయని తెలుసా... అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి...

రోజు చేసేవే..

రోజు చేసేవే..

అలవాటు గురించి మనం ప్రత్యేకంగా వివరణలు, నిర్వచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రతిరోజూ దేనీ గురించి ఎక్కువగా ఆలోచించకుండా చేసే దాన్నే అలవాటు అంటారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అలవాట్లు ఉంటాయి.

మీ అలవాట్లు మార్చుకోవడం..

మీ అలవాట్లు మార్చుకోవడం..

సమయానికి నిద్రపోవడం.. సమయానికి నిద్ర లేవడం.. ఉదయాన్నే బెడ్ పై లేచిన వెంటనే ఒక క్రమ పద్ధతిలో బ్రష్ చేసుకోవడం, ఒక టైమ్ లో స్నేహితులతో మాట్లాడటం వంటివి అలవాట్లు మన జీవితంలో ఎంతలా కలిసిపోయాయంటే అవే మనం అనిపించేంత. అయితే మీరు మంచిగా మారాలనుకుంటే, మీరు ముందు చేయాల్సిన పని మీ అలవాట్లేంటో తెలుసుకోవాలి.

కొంచెం కష్టం..

కొంచెం కష్టం..

అలవాట్లలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వాటిని మార్చుకోవచ్చు. అయితే ఎవరికైనా సరే ఒక్కసారిగా తమ అలవాట్లను మార్చుకోవాలంటే, కొంచెంగా కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా చెడు అలవాట్లని మార్చుకోవడం అంటే ఇంకా కష్టమవుతుంది.

అసాధ్యం కాదు..

అసాధ్యం కాదు..

అయితే అవేమీ అసాధ్యమైనవి కావని మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మీరు ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్లను పెంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ గోరు వెచ్చని నీటితో, లేదా గోరు వెచ్చని నీటిలో తేనే, నిమ్మరసం తీసుకుని తాగడం మొదలు పెడితే, అలా ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు మారుతుంది.

మీ టార్గెట్స్ కు దగ్గరగా..

మీ టార్గెట్స్ కు దగ్గరగా..

ఉదాహరణకు మీరు మంచి క్రికెటర్ అవుదామనుకుంటే.. అందుకోసం మీరు నేరుగా క్రికెట్లో పాల్గొనడం కాదు.. ముందుగా మీరు ఫిట్ నెస్ సాధించాలి. ఆ తర్వాత సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం తగిన శిక్షణ తీసుకోవాలి. ఇక మీరు మీ టార్గెట్ రీచ్ కావాలంటే చేయాల్సిన మొట్టమొదటి పని అందుకు కావాల్సిన అలవాటుని చేసుకోవడం.

ఇవి జీవితాంతం..

ఇవి జీవితాంతం..

ఎవరికైనా అలవాట్లు అనేవి జీవితాంతం ఉంటాయి. మీరెలా మారతారనేది మీ అలవాట్లే డిసైడ్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఇతరులను ఆనందంగా పలకరిస్తే, మీరు సంతోషాన్ని పంచే వ్యక్తి అవుతారు. మీకు ప్రతిరోజూ భోజనంలో సలాడ్ తినే అలవాటుంటే మీరు హెల్దీయెస్ట్ వ్యక్తిగా ఉంటారు.

టైమ్ పాస్ చేయడం..

టైమ్ పాస్ చేయడం..

మనలో చాలా మందికి ఈ చెడ్డ అలవాటు ఉంటుంది. అదేంటంటే.. మనం ప్రతిరోజూ ఎంతో టైమ్ వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ, గుడ్ హ్యాబిట్స్ ని పెంపొందించుకోవడం వల్ల ఈ టైమ్ వేస్ట్ అనేది కచ్చితంగా తగ్గుతుంది. మన పనులు కూడా వేగంగా అయిపోతుంది.

బేసిక్స్..

బేసిక్స్..

మీకు ఏదైనా టార్గెట్ ఉన్నప్పుడు, దాన్ని రీచ్ అవ్వడానికి మీకు కోఆపరేట్ చేసేది మీ టార్గెట్ కాదు. దాన్ని సాధించడానికి మీరు ఫాలో అవుతున్న హ్యాబిట్స్ బేసిక్ అనేది మనం గుర్తుంచుకోవాలి.

ఇలాంటి పద్ధతులతో..

ఇలాంటి పద్ధతులతో..

మీరు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి చిన్న చిన్న వాటిని మార్చుకుంటే కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ‘నేను ఈరోజు నుండీ వ్యాయామం చేస్తాను' అనుకునే బదులు.. నేను ఈరోజు ఆఫీసు నుండి ఇంటికొచ్చాక ఎక్సర్ సైజ్ డ్రెస్ లోకి మారి, ఒక అరగంటసేపు సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేయకుండా, అరగంట ఎక్కువ సమయం నడుస్తాను' అనుకోవడం వల్ల అలవాట్లు తొందరగా ఫార్మ్ అవుతాయని అంటున్నారు.

వెనక్కి లాగితే..

వెనక్కి లాగితే..

మనం ఏదైనా కొత్త అలవాటు చేసుకుందామని, ప్రయత్నించే సమయంలో మనకు చాలా విషయాలు వెనక్కి లాగుతూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుందామని నిర్ణయించుకున్నప్పుడు, ఇంట్లో ఉన్న ఇతర ఆహారం లేదా బయటి నుండి వచ్చే వాసన మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. అలాంటి వాటిని అధిగమిస్తేనే మీ టార్గెట్ రీచ్ అవ్వడం తేలిక అవుతుంది.

English summary

Daily Habits That Can Actually Change Your Life

Here are the daily habits that can actually change your life. Take a look
Desktop Bottom Promotion