For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (01-02-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

2020లో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోండి...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనేక కష్టాలు ఎదురుకావచ్చు. తొందరపడి ఏదైనా తప్పు చేస్తే దాని ఫలితం భారీగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. వివాహ జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి మీ నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు, మీ ప్రియురాలి సహాయంతో, ఒక పెద్ద సమస్యను పరిష్కరించవచ్చు. పని విషయంలో బాగా ఉంటుంది. మీరు నిజాయితీతో పని చేస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా మరియు ధ్యానం చేయండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 6:55 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు మీ ఆనందాన్ని మీ కుటుంబంతో పంచుకుంటారు. ఈ రోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఈ రోజు మీ ప్రియమైన వారితో కలిసి గొప్ప అనుభూతి చెందుతారు. పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈరోజు ముఖ్యమైన పనులపై సరైన శ్రద్ధ చూపలేరు. అనేక రకాల ప్రతికూల ఆలోచనలు మీకు అడ్డంకిగా మారతాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ప్రశాంతమైన మనస్సుతో ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 6:35 నుండి రాత్రి 9:15 గంటల వరకు

2020లో కర్కాటక రాశి ఫలాలు : ఈ ఏడాది ఎలాంటి పరిస్థితుల్లో అయినా విజయం మీదే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అయితే మీరు ప్రతికూల విషయాల పట్ల ప్రభావితం కాకూడదు. ముఖ్యంగా పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ప్రేమ విషయంలో మంచి అనుభూతి చెందుతారు. ఈరోజు మీ భాగస్వామి యొక్క ప్రవర్తన మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికొస్తే, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. మీకు మనీ విషయంలో లక్కీ కలసి వస్తుంది. మీరు సాయంత్రం పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతారు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి వివాహ జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. చాలా కాలం తర్వాత మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. మీకు మీ తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అన్ని అనుకూలంగా ఉంటాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మేష రాశి జాతకం 2020 : ఆ విషయంలో అనేక మలుపులు ఉంటాయట...!

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పని విషయంలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సరైన ఆహారం తీసుకోవాలి. వైవాహిక జీవితంలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మీ మనసు ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

2020లో వృషభ రాశి ఫలితాలు : ఈ రెండు నెలల్లో మీకు అత్యంత అనుకూలంగా సమయం...!

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయానికి సంబంధించి మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని చేయవచ్చు. మీకు ఈరోజు మానసికంగా మంచి అనుభూతి కలుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి రాత్రి 11:25 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మీరు ఆనందించే మానసిక స్థితిలో ఉంటారు. మీరు మీ ఆలోచనను సానుకూలంగా ఉంచాలి. ఈరోజు మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరంగా పరిస్థితులు అనుకూలంగానే కనబడుతున్నాయి. పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు శ్రద్ధగా అధ్యయనం చేయగలరు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి ఉదయం 11 గంటల వరకు

English summary

Daily Horoscope February 01, 2020

Read your daily horoscope to know what lies ahead. For some zodiacs there will be opportunities, and for others there will be challenges. So let's see what lies in your fate today.
Story first published: Saturday, February 1, 2020, 6:00 [IST]