`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (18-01-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు చాలా బాధ్యతలు ఉంటాయి. దీని వల్ల మీరు ఈరోజు బిజీగా గడపబోతున్నారు. దీని వల్ల మీరు కొంత ఒత్తిడిని కూడా అనుభవిస్తారు. మీ కోపం ఆఫీసులో మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మీ కోపాన్ని అనవసరంగా ఇతరులపై పడకుండా ఉండండి.

ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9:35 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే ఈరోజు ఒక పెద్ద ఆందోళన నుండి బయటపడొచ్చు. చాలా కాలంగా పెండింగులో ఉన్న కోర్టు కేసులో విజయం సాధించవచ్చు. ఇది మీకు పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది. పని విషయంలో తొందరపడకండి. మీ జీవిత భాగస్వామితో పరస్పర వివాదం ఉండొచ్చు. మీ మాటలను జాగ్రత్తగా వాడండి. ఆరోగ్యం విషయంలో మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి పిక్నిక్ కోసం బయటకు వెళ్లొచ్చు. ఈ రోజు పని పరంగా చాలా కష్టపడతారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఒక నిర్దిష్ట పనిని సకాలంలో పూర్తి చేయమని మీపై ఒత్తిడి ఉంటుంది. మీరు సీనియర్లతో సహోద్యోగుల పూర్తి మద్దతును కూడా పొందుతారు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలత రావాలంటే మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు అన్ని పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు.కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులందరికీ, తోబుట్టువులకు మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. మీరు మీ అన్ని పనులను పూర్తి ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఈ రోజు ఆనందించడానికి మీకు అవకాశం లభిస్తుంది. స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో సమయం గడపడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవాలి. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోండి. పెద్దలు ఏదైనా సలహా ఇస్తే వాటిని తప్పకుండా పాటించండి. ఈరోజు ఆఫీసులో కూడా మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ప్రేమ విషయంలో కూడా ప్రతికూలంగా ఉంటుంది. మీ సంబంధం గురించి కుటుంబం అసంతృప్తిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి బలంగానే ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. బంధువులతో మంచి సంబంధాలు ఉన్నందున, ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది. ఈ రోజు చాలా కాలం తరువాత, మీరిద్దరూ ఒకరితో ఒకరు తగినంత సమయం గడుపుతారు. పనిలో కూడా మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఆలోచనలు మనసులోకి రావచ్చు. ఈ రోజు మీరు మీ భావోద్వేగాలను నియంత్రించాలి. మితిమీరిన కోపం మీకే హానికరం. మీ ఉన్నతాధికారులతో లేదా సహోద్యోగులతో ఎలాంటి వాదనకు దిగకండి. ఎందుకంటే మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. మరోవైపు, వ్యాపారవేత్తలు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు విశ్రాంతిపై ఎక్కువ దృష్టి పెట్టండి, ఇది మీ ఆరోగ్యానికి మంచిది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ఇది మీకు భారంగా మరియు అలసటగా అనిపిస్తుంది. ఈ రోజు జీవిత భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తారు. ఈ సమయంలో మీరు పిల్లలపై కూడా శ్రద్ధ వహించాలి. ఆలోచించకుండా మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఉద్యోగం చేసేవారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు కూడా మంచి రోజు అవుతుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి ఈరోజు పనులన్నీ వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా కూడా అదృష్టవంతులు అవుతారు. మీ ఆలోచన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఏదైనా పెద్ద లావాదేవీకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో మీ పరస్పర ప్రేమ మరియు అభిమానం పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో శృంగారభరితంగా మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు అన్నింట్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. శృంగార జీవితం గురించి మాట్లాడితే, మీరు మీ భాగస్వామితో లాంగ్ డ్రైవ్‌ను ఆనందిస్తారు. మీరు ఒంటరిగా ఉంటే, మిమ్మల్ని రహస్యంగా ప్రేమించే వ్యక్తి ఉన్నారని ఈ రోజు మీకు తెలుస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు వారికి అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తులో ఈ సంబంధం విజయవంతమవుతుంది. ఈ రోజు ఆర్థికపరంగా శుభప్రదంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1.40 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా సమస్య ఉందంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాపార విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కోపంపై నియంత్రణ కలిగి ఉండాలి. అలా అయితేనే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీ గొడవలు కొంతవరకు తగ్గుతాయి. మీ దూకుడు వైఖరి మీ అన్ని సంబంధాలలో ప్రతికూలంగా మారుతుందని గుర్తుంచుకోండి. ఆఫీసులో వాతావరణం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ సంబంధం గురించి కుటుంబం అసంతృప్తిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

English summary

Daily Horoscope January 18, 2020

Read this your daily horoscope to know what this new day has brought for all the 12 zodiac signs. There will be opportunities as well as hardships ahead and therefore, read on to find out what the stars have in store for you.