For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (7-09-2019)

|

శనివారం వాయుపుత్ర, కపివీర అని కూడా పిలువబడే హనుమంతుడు కేసరి అనే వానరుడు మరియు అంజనా దేవి కుమారుడు మరియు రాముడికి పరమభక్తుడు హనుమంతుడు. శక్తి దేవుళ్ళలో హనుమంతుడిని కూడా ఒకరిగా పూజిస్తారు. హనుమంతుడు రామభక్తుడవ్వడం వల్ల రాముడికి ఎలాంటి హాని జరగకుండా సహాయకుడిగా బంటుగా ఉంటాడు. అందుకే హానుమంతుడిని రామబంటు అని పిలవడం కూడా జరగుతుంది. సీతా దేవి ఎక్కుడ ఉందో తెలుసుకు లంకలో ఉన్న సీతమ్మ గురించి రాముడికి చెబుతాడు. రావణుడితో పోరాడటానికి మరియు సీతను శ్రీలంకకు తీసుకురావడానికి హనుమంతుడు రాముడికి అనేక విధాలుగా సహాయం చేస్తాడు.

horoscope

ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుడిని ఆరాధించడం వల్ల ఇంట్లో కష్టాలు దూరం అవుతాయి, ఇంట్లోకి దుష్టశక్తుల చేరవు. పిల్లలు ఎక్కువగా భయపడటం, అనారోగ్య సమస్యలున్నా అంజనేయుడిని ప్రార్థించడం వల్ల దుష్టశక్తులు, గాలి వంటివి సోకకుండా లేదా భూత పిశాచాలు ఒంట్లోకి చేరకుండా కాపాడుతాడని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. వాహనాలు, ఇంటిపైన నరద్రుష్టి మరియు గాలులను అంజనేయ స్వామి దూరం చేస్తాడని నమ్మకంతో ప్రతి నిత్యం పూజలు చేయిస్తుంటార. ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఈ రోజు మీ రాశి భవిషవ్యం ఏవిధంగా ఉందో తెలుసుకుందాం..

మేషం

మేషం

మీ మొండి వైఖరి మిమ్మల్ని విజయవంతం చేస్తుంది. ఏదైనా వాస్తవం గురించి మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా పని విషయంలో. మీరు కష్టించి పనిచేసే గుణాన్ని సహించని సహచరులు మిమ్మల్ని విమర్శించవచ్చు. వారి మాట వినవద్దు. అవి మీ సౌకర్యం మరియు సమయం రెండింటినీ నాశనం చేస్తాయి. ఆర్థిక విషయాలు కొంత ఒత్తిడిని సృష్టించగలవు. పెద్దల సలహా పొందడం మీకు ఎంతో సహాయపడుతుంది. పిల్లలకు మీ సహాయం అవసరం కాబట్టి మీ సమయాన్ని కేటాయించండి. ప్రేమికుడితో ప్రత్యేక సమయం గడపండి. మీ జీవిత భాగస్వామి మీ గురించి ప్రత్యేక శ్రద్ద చూపుతారు మరియు మిమ్మల్ని విశ్వసిస్తారు. సాధ్యమైనంతవరకు ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి.

అదృష్ట రంగు: ఎరుపు

అదృష్ట సంఖ్య: 22

అదృష్ట సమయం: మధ్యాహ్నం 1:30 నుండి 9:30 వరకు.

వృషభం

వృషభం

ఈ రోజుకు మీకు లక్కీ డే. మీకు గుడ్ న్యూస్ లు తెలుస్తాయి. కాబట్టి ఈ రోజు మీకు చాలా అదృష్ట దినం. వ్యక్తిగత జీవితం నేడు మరింత సున్నితంగా ఉంది. మీ జీవిత భాగస్వామి మీ పనిని అభినందిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం మరియు భావాలను పంచుకోవడం సంబంధాలను బలోపేతం చేస్తుంది. మీ భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు రూపొందించండి. ఫైనాన్స్ పరంగా ఈ రోజు మీకు సాధారణ రోజు. పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైనరోజు. కుటుంబంలో బాధ్యతలు పెరిగాయి. మీరు వ్యక్తిగత మరియు వృత్తి జీవితం మధ్య కొంత సమతుల్యతను పాటించాలి. డ్రైవింగ్ లేదా ఎక్కువ దూరం ప్రయాణించడం మానుకోండి. మొత్తం మీద ఈ రోజు శుభదినం.

అదృష్ట రంగు: లేత గులాబీ

అదృష్ట సంఖ్య: 37

అదృష్ట సమయం: మధ్యాహ్నం నుండి సాయంత్రం 4:30 వరకు - రాత్రి 11:00.

మిథునం:

మిథునం:

మీ సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ పనిచేయకుండా కొంత విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకూడదు. కుటుంబంతో ఒక చిన్న యాత్ర చేయడానికి మంచి రోజు. ఆర్థికంగా ఉండటానికి మీకు లక్కీ డే లాభాలను పొందుతారు. మీరు ఒక చిన్న పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేసుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క చిన్న తప్పులను పట్టించుకోవద్దు. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. మీ తండ్రి నుండి ఉచిత సలహా పొందండి. మీ స్నేహితులు లేదా బంధువులు కొందరు మీతో విభేదించవచ్చు. ఆందోళనలను నివారించడానికి ప్రయత్నించండి. యోగా మరియు ధ్యానం ఒత్తిడి నుండి దూరంగా ఉండటానికి అనువైన మార్గాలు.

అదృష్ట రంగు: ఆరెంజ్

లక్కీ నంబర్: 14

అదృష్ట సమయం: మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం 12:00 నుండి 9:00 వరకు.

కర్కాటకం

కర్కాటకం

విద్యార్థులకు మంచి ఫలితాలు రావడం అసాధ్యం. ఇది వారిలో కొంతమందిని నిరాశకు గురిచేస్తుంది. మిమ్మల్ని మీరు బాధపెట్టడానికి బదులు మిమ్మల్ని మీరు ఉత్సాహపర్చుకోవడానికి ప్రయత్నించండి. పని పరంగా ఈ రోజు మీకు సాధారణ రోజు. ఈ కొత్త నెల కొన్ని మంచి విషయాలను తీసుకొస్తుంది. పనికి సంబంధించి ప్రయాణం చేయవచ్చు. సామాజిక సేవలో ఉన్నవారికి రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు, వర్క్ ప్రెజర్ ఉండదు. కుటుంబంతో విహారయాత్రకు వెళ్లడం కుటుంబం మరియు మీరు చాలా సంతోషకరమైన క్షణం ఆనందిస్తారు. మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. ఇంట్లో విషయాల గురించి సమస్యల గురించి మీరు మీ ప్రేమికుడితో చర్చలు జరుపుతారు. వ్యాపారస్తులకు, బిజినెస్ మ్యాన్లకు ఈ రోజు అనుకూలమైనది.

అదృష్ట యొక్క రంగు: వైలెట్

అదృష్ట సంఖ్య: 19

అదృష్టం సమయం: మధ్యాహ్నం నుండి 12:14 నుండి 7:50 వరకు.

సింహం

సింహం

అనవసరంగా మీ సమయాన్ని వృథా చేయకుండా ఉండండి. మీరు మీ కార్యాలయంలో మీరు చేసే పనిపట్ల మరింత శ్రద్దగా ఉండాలి మరియు మీరు చేసే పనిని మీ అధికరాలు పరిశీలింపబడుతుంది, మీరు చేసే పని వారికి నచ్చకపోవచ్చు, మీ పనిపట్ల కలత చెందవచ్చు. చేసే పనిలో అంసంపూర్ణంగా చేయకండి. కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి దీని వల్ల మీరు లాభాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో మీకు మంచి రోజు మరియు లాభాలను తెచ్చిపెట్టే రోజు. భవిష్యత్ కొరకు పెట్టుపెట్టడానికి మంచి రోజు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో ఇంట్లో సుఖంగా ఉండటం వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. సాయంత్రం సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇక్కడే కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆరోగ్యంలో తగినంత మెరుగుదల కనబడుతుంది.

అదృష్ట రంగు: పసుపు

అదృష్ట సంఖ్య: 20

అదృష్ట సమయం: సాయంత్రం 5:00 నుండి 10:00 వరకు.

కన్యా రాశి

కన్యా రాశి

అధిక వ్యయం భవిష్యత్తులో ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలపై మీరు తెలివిగా వ్యవహరిస్తారు. మీ అధికారులు మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ కు కట్టుబడి ఉంటారు. మీ అనుభవం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి వారి నుండి గైడెన్స్ తీసుకోండి. విదేశాలలో ఉండాలనుకునే వారికి మంచి సమయం. కుటుంబం పరంగా ఈ రోజు సాధారణ రోజు. మీ భాగస్వామి పిల్లలను భాగా చూసుకుంటుంది మరియు ఇంటిని అందంగా నిర్వహిస్తుంది. మీరు కొన్ని కమిట్మెంట్స్ ను తీర్చాలి. బిజినెస్ పరంగా బిజీగా ఉంటారు మరియు లాభాలను అందించే రోజు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులు వారి సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలి. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మారుమూల ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి.

అదృష్ట రంగు: తెలుపు

అదృష్ట సంఖ్య: 18

అదృష్ట సమయం: ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12 వరకు.

తుల

తుల

ఈ రోజు మీ కుటుంబంలో చాలా సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. చిన్నతగాదాలే చిలికి చిలికి పెద్దగా మలుపు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాలు మీ భాగస్వామికి భాదను కలిగిస్తాయి. ఈ రోజు మీకు ఒత్తిడితో కూడిన రోజు. పనిలేకుండా ఉండవచ్చు. పనిని వాయిదా వేయడం లేదా పెండింగ్‌లో ఉంచడం మానుకోండి. ఆర్థికంగా ఈ రోజు మీకు సాధారణ రోజు. జాయింట్ వెంచర్‌లో ఉన్నవారు పని చేయడానికి ఒక చిన్న ట్రిప్ తీసుకోవచ్చు. సాయంత్రం శుభవార్త మీ కుటుంబాన్ని ఆశ్చర్యపరుస్తుంది. పిల్లలు స్నేహితులతో అదనపు సమయం గడుపుతారు. మీ విలువైన వస్తువులపై నిఘా ఉంచండి.

అదృష్ట రంగు: నీలం రంగు

అదృష్ట సంఖ్య: 2

అదృష్ట సమయం: ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:00 వరకు.

వృశ్చికం

వృశ్చికం

ప్రేమలో పడిన వారికి ఈ రోజు లక్కీ డే. తల్లిదండ్రుల మద్దతు పొందడం మీ సంబంధాన్ని అధికారికంగా చేస్తుంది. మీ ప్రేమ మీతో ఎక్కువ కాలం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం సాధారణం. ఆఫీస్ రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉండండి. కొన్ని విషయాలు గందరగోళాన్ని సృష్టించగలవు కాబట్టి మీ పనిపై చాలా శ్రద్ధ వహించండి. ఈ రోజు కుటుంబంతో ఒక చిన్నప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. నృత్యకారులు ఉత్తమ ప్రదర్శన చేస్తారు. బిజినెస్ రంగంలోని వారికి భారీ లాభాలను ఆర్జిస్తారు. పనికి సంబంధించిన ప్రయాణం ప్రయోజనాలను ఇస్తుంది.

అదృష్ట రంగు: మెరూన్

లక్కీ నంబర్: 25

అదృష్ట సమయం: ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి

గతంలో తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు మిమ్మల్ని బాధపెడుతాయి. పనిచేసే కార్యాలయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ సహోద్యోగుల పట్ల ఎక్కువ జాగ్రత్త వహించడం అత్యవసరం. జీవిత భాగస్వామి కొన్ని కుటుంబ విషయాలపై అద్భుతమైన సలహాలు మరియు సహాయాన్ని అందిస్తుంది. బిజినెస్ పరంగా మరింత శ్రద్ధ వహించాలి. ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఫైనాన్స్ పరంగా ఈ రోజు మీకు సాధారణ రోజు. వృద్ధులు సంతోషంగా ఉంటారు. ఈ రోజు కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ దగ్గరి బందువల నుండి శుభవార్తాలతో సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. మీ వద్ద తీసుకున్న డబ్బు దగ్గ బందువులు లేదా స్నేహితుల ద్వారా ఈ రోజు తిరిగి మీకు ఇవ్వబడుతుంది. మీరు సాయంత్రం రొమాంటిక్ డిన్నర్ ను స్వీకరించే అవకాశం ఉంది. రొమాంటిక్ డిన్నర్ తర్వాత మంచి విశ్రాంతి పొందుతారు.

లక్కీ కలర్: బ్రౌన్

లక్కీ నంబర్: 6

లక్కీ టైమ్: మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 వరకు.

మకర రాశి

మకర రాశి

ఈ రోజు విద్యార్థులకు ఉత్తమ రోజు. విద్యాపరంగా చదువులో లక్ష్యాలను సాధించడం వల్ల తల్లిదండ్రులను మరింత గర్వించేలా చేస్తుంది. ఈ రోజు పనిలో మీరు చాలా బిజీగా గడుపుతారు. కార్యాలయంలోని అధికారులు తమ పట్ల దూకుడుగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం పరంగా ఈ రోజు మీకు సాధారణ రోజు. సంబంధాలను చాలా తేలికగా తీసుకోకండి. వాటి వల్ల కొంత కాలం తర్వాత సమస్యలను స్రుష్టించవచ్చు. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. రోజంతా మంచి మానసిక స్థితి కలిగి ఉండటానికి యోగా మరియు ధ్యానం కోసం వెళ్ళడం మంచిది.

అదృష్ట రంగు: ఆకుపచ్చ

అదృష్ట సంఖ్య: 15

అదృష్ట సమయం: మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 5:20 వరకు.

 కుంభం

కుంభం

ఈ రోజు మీరు ఎనర్జిటిక్ గా ఫీలవుతారు. అదృష్టం అనుకూలంగా ఉంది. మిగతా పనులు ఎంతో ఉత్సాహంగా జరుగుతాయి. పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి -జీవితం మధ్య సమతుల్యతను కనుగొనడం చాలా అవసరం. మీ జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంలో జోక్యం చేసుకుంటారు. మీకు నచ్చకపోవచ్చు. క్రొత్త విషయాలపై ఆలోచించడం మరియు ప్రణాళిక చేయడం జరుగుతుంది. కుటుంబానికి సంబంధించి కొంత దృడమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీరు మీ తల్లిదండ్రుల సలహాలను పరిశీలిస్తారు. ఈ రోజు పారిశ్రామికవేత్తలకు లాభ దినం. ఈ రోజు పెట్టుబడి పెట్టడానికి అనువైన రోజు. సాయంత్రంలోపు ఆరోగ్యానికి కొంత భంగం ఉండవచ్చు.

అదృష్ట రంగు: ఆవపిండి రంగు

అదృష్ట సంఖ్య: 42

అదృష్ట సమయం: మధ్యాహ్నం 1:05 నుండి సాయంత్రం 5:00 వరకు.

మీనం

మీనం

ఉన్నతాధికారుల నుండి గుర్తింపు పొందుతారు. ఈ రోజు పని పరంగా మీకు అదృష్ట దినం. మీరు పని రంగంలో కొత్త ఆలోచనలను వ్యక్తం చేస్తారు. అదే మీ యజమానులను సంతోషపరుస్తుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీరు మంచి పొదుపు ప్రణాళికను కనుగొంటారు. ఈ రోజు ఫైనాన్స్ పరంగా లాభదాయకమైన రోజు. పరస్పర అంగీకారంతో పనిచేయడం కుటుంబానికి ప్రయోజనకరమైన రోజు. తోబుట్టువుల వైరం తల్లిదండ్రులను విసుగు తెప్పిస్తుంది. విద్యార్ధులపై దృష్టి పెట్టడం విద్యార్థులకు కష్టంగా ఉంటుంది. చదివే అలవాటును ఏర్పరచుకోండి. ఇది మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది.

అదృష్ట రంగు: లేత పసుపు / క్రీమ్

అదృష్ట సంఖ్య: 7

అదృష్ట సమయం: సాయంత్రం 5:00 నుండి 9:00 వరకు.

English summary

Daily Horoscope September 6, 2019 In Telugu

Horoscope is an astrological chart or diagram representing the positions of the Sun, Moon, planets, astrological aspects and sensitive angles at the time of an event, such as the moment of a person's birth. The word horoscope is derived from Greek words "wpa" and scopos meaning "time" and "observer".
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more