For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దిన ఫలాలు: ఆది వారం మీ రాశిఫలాలు (08-09-2019)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాల మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీవికారినామ సంవత్సరం, భాద్రపదమాసం, దశమి ఆదివారం రోజున ఏఏ రాశుల వారికి ఏవిషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏ రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏ రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope September 8, 2019 In Telugu

ఏ రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రానించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టవచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు ఆదివారం దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేషం:

మేషం:

ఇది ఆర్థిక పరంగా అనుకూలమైన రోజు మరియు మీ భాగస్వామి మద్దతుతో భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తారు. మీరు పనిచేసే చోట మీరు ప్రదర్శించే తెలివి తేటల వల్ల మీ సీనియర్ల నుండి ప్రశంసలు పొందుతారు. దాంతో మీరు బాగా పాపులర్ అవుతారు. దాన్ని మీరు గర్వంగా భావించకుండా ఉండటం మంచిది . మీ ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల పరిస్థితులు తారుమారు అవొచ్చు. బిజినెస్ పరంగా మీ భాగస్వామి సలహాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో మీకు అదృష్టం కలిసొస్తుంది. వ్యక్తిగతం జీవితం అనుకూలంగా ఉంటుంది. మీరు అడ్డంకులను అధిగమిస్తారు. జీవితంలో ప్రధానమైన మరియు అనుకూలమైన మార్పులు చూస్తారు. మీ జీవితంలో సానుకూల మార్పులు, ఇది మీ దృక్పథాన్ని మారుస్తుంది. సంబంధ విషయాల్లో తల్లిదండ్రులు వద్ద నుండి మీకు అనుమతి రావచ్చు. ప్రయాణాలు మరియు ఎక్కువ దూరం డ్రైవింగ్ చేయకపోవడం మంచిది. ఆరోగ్య పరంగా మెరుగుదల కనబడుతుంది.

లక్కీ కలర్: వైలెట్

అదృష్ట సంఖ్య: 20

అదృష్ట సమయం: ఉదయం 4:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు

వృషభం:

వృషభం:

ఈ రోజు పనిలో అనుకూలమైన రోజు . మీరు కష్టపడి పనిచేసే స్వభావంతో మీ బాస్ ను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందవచ్చు. ఆర్థిక పరంగా అభివృద్ధి కనబడుతుంది. మీకు రావాల్సిన బకాయిలు పొందుతారు. కుటుంబంలో కొన్ని విషయాల పట్ల చర్చిస్తారు, ఇంట్లో పిల్లలు , కుటుంబం సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. పిల్లలు మీతో గడపడం వల్ల ఆనందిస్తారు. మీకు సన్నిహితుడిగా లేదా బందువులుగా ఉన్న మీ భాగస్వామితో పెండింగ్ సమస్యను పరిష్కరించబడుతాయి . ఎటుంటి ఒత్తిడి లేకుండా గడుపుతారు. మీకు అవసరంమైనప్పుడు మీ సన్నిహితులతో విందులో పాల్గొనం వల్ల కొంచెం ఉపశమం కలుగుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల కాస్త ఇన్ఫెక్షన్ కు గురికావచ్చు.

లక్కీ కలర్: స్కై బ్లూ

అదృష్ట సంఖ్య: 11

అదృష్ట సమయం: ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు

మిథునం:

మిథునం:

మొత్తం మీద ఈ రోజు మీకు చాలా అనుకూలమైనది మరియు మీరు ప్రధాన సమస్యల నుండి బయటపడుతారు . జంటలకు ఈ రోజు ఒక రొమాంటిక్ దినం. కొత్తగా పెళ్లైన జంటలు సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తారు. ఇతరుల్లో లోపాలను వెదకడం మానేయండి, వారు కూడా మిమ్మల్ని విమర్షించే అవకాశం ఉంటుంది. మీ జీవితంపై ఏకాగ్రతను పెట్టండి . ఇతరుల విషయల్లో జోక్యం చేసుకోకండి. పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో. ఆర్థిక విషయాల్లో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా నీటి ద్వార వచ్చే వ్యాధుల గురించి జాగ్రత్తలు తీసుకోండి. తోబుట్టువులతో సంబంధాలు బలపరుచుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలుంటాయి. ఆరోగ్యం పరంగా అనుకూలమైన రోజు.

లక్కీ కలర్: క్రీమ్

అదృష్ట సంఖ్య: 1

అదృష్ట సమయం: ఉదయం 8:40 నుండి సాయంత్రం 4:00 వరకు

కర్కాటకం:

కర్కాటకం:

కుటుంబం కలిసి గడపడానికి ఈ రోజు చాలా ఆనందకరమైన రోజు. ఈ సందర్భంగా చిన్న ట్రిప్ ను ప్లాన్ చేసుకోవడం మంచిది. కుటుంబంలో జంటలు లేదా భాగస్వాములు వెకేషన్స్ కు ప్లాన్ చేసుకోవడం ద్వారా ఆనందంగా గడుపుతారు.ఆరోగ్య పరంగా మెరుగుదల కనబడటం వల్ల మీరు చాలా శక్తిమంతులుగా భావిస్తారు మరియు పాజిటివ్ గా కనబడుతారు. పనిలో కొంత గందరగోళం, ఆందోళనల కారణంగా లక్ష్యాలను చేరుకోలేకపోతారు. కార్పొరేట్ లో పనిచేసే వారికి ఈ రోజు కాస్త గమ్మత్తైన రోజుగా భావిస్తారు . ప్రభుత్వ రంగ ఉద్యోగులకు అనుకూలమైన రోజు. విద్యార్థులు చదువుల్లో కొత్తదనాన్ని నేర్చుకుంటారు. ఫోర్ వీలర్, టూ వీలర్ డ్రైవింగ్ చేయకండి. చట్టపరమై ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి గండు కాలం. ఆర్థిక పరంగా ఇది సాధారణ రోజు అవుతుంది.

లక్కీ కలర్: లేత పసుపు

అదృష్ట సంఖ్య: 34

అదృష్ట సమయం: రాత్రి 7:00 నుండి 11:00 వరకు

సింహం:

సింహం:

ఈ రోజు మొత్తం నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయి మరియు మీరు కోరుకునే వారిలో చాలా మందిని మీరు కలుస్తారు. ఇది పనులు సజావుగా సాగుతాయి. మీరు బిజీగా గడిపేట్లు చేసే పనిని మీరు పొందగలుగుతారు. అందుకు మీ బాస్ మద్దతు పూర్తిగా ఉంటుంది. వివాహం కోసం ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. వ్యక్తులలో లోపాలను కనుగొనడం మానుకోండి- ముఖ్యంగా మీ భాగస్వామి. మీ సందేహం ప్రవ్రుత్తిని మీ చుట్టుపక్కల వారు అంగీకరించరు. ఆర్థికపరంగా అంత అనుకూలమైన రోజు కాదు. మరియు ఈ రోజు కొన్ని విషయాల్లో చాలా ఓపిగ్గా ఉండటం మంచిది. నలుగురిలో మాట్లాడేటప్పు ఒకటికి రెండు సార్లో ఆలోచించండి. గొడవలకు బదులుగా తెలివిగా సమస్యలను అధిగమించండి. ఆరోగ్యంలో నెమ్మదిగా మెరుగుదల ఉంటుంది. ఇది మిమ్మల్ని ప్రేరిపిస్తుంది. మీ కోసం కొంత సమయం ఇవ్వండి. మీ దిన చర్యను వ్యాయామం లేదా నడకతో ప్రారంభించండి.

లక్కీ కలర్: లేత నీలం

అదృష్ట సంఖ్య: 6

అదృష్ట సమయం: మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 6:50 వరకు

కన్యా:

కన్యా:

మీలో కొందరు ఆరోగ్య సమస్యల కారణంగా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటారు. ఎవరైతే పొత్తి కడుపు మరియు గుండె సమస్యలతో బాధపడుతంటారో వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినడం మానుకోండి. ఆర్థిక పరంగా ఈ రోజు సాధారణంగా ఉంటుంది, అయితే సాయంత్రం మీకు వచ్చే శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. స్టాక్ మార్కెట్ మీకు మంచి ఫలితాలనిస్తుంది. మీ జీవిత భాగస్వామి వద్ద రహస్యాలను ఉంచడం మానుకోండి . ఆమె/అతను మీకు సరైన మార్గాన్ని నిర్ధించవచ్చు. పనిచేసే చోట మీ పనితీరు వల్ల ప్రశంసించబడుతారు. అది మిమ్మల్ని మరింత ప్రేరేపిస్తుంది. మీ స్నేహితులు లేదా బందువులు కొన్ని సిల్లి విషయాల పట్ల కోపం తెచ్చుకోవచ్చు. మీరు మీ సోషియల్ సర్కిల్ ను పెంచుకుంటారు. ఒక రకంగా వ్యాపార పరంగా పరిచయాలు పెంచుకోవచ్చు. ఒక పరిచయం ద్వారా మీరు ప్రభావితమవుతారు. మీ కోపం వల్ల కుటుంబంలో కొంత అవరోదాలు కలగవచ్చు . ఒత్తిడి నుండి బయటపడాలంటే పుస్తక పఠనం మంచిది.

లక్కీ కలర్: లేత ఎరుపు

అదృష్ట సంఖ్య: 11

అదృష్ట సమయం: రాత్రి 7:00 నుండి 11:00 వరకు

తులా:

తులా:

మరిన్ని సమస్యలను నివారించడానికి మీ ఆర్థిక పరిస్థితులను మ్యానేజ్ చేయడానికి ప్రయత్నించండి. క్రమంగా

ఆర్థిక పరంగా మెరుగుదల కనిపించడంతో కాస్త విశ్రాంతి పొందుతారు. కుటుంబంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లల మీద దృష్టి పెట్టండి. పిల్లలు వారి అభివృద్ధి ముఖ్యం. ప్రతి విషయంలో లాజిక్ ప్లే చేయవద్దు. ప్రతి క్షణం ఆనందించడానికి విశ్రాంతిా మరియు ప్రశాంతంగా ఉండండి. వ్యక్తుల ముందు మీ ప్రవర్తను మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు దూకుడు స్వభావం వల్ల బదిలీ కాబడుతారు. కార్పొరేట్ లో పనిచేసే వారికి ఈ రోజు బిజీగా గడుస్తుంది.

లక్కీ కలర్: ఇండిగో

అదృష్ట సంఖ్య: 7

అదృష్ట సమయం: మధ్యాహ్నం 3:50 నుండి రాత్రి 10:00 వరకు

వృశ్చికం:

వృశ్చికం:

ఏదో పెద్ద విషయం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది మరియు ఆ విషయాలు ఇతరులతో చర్చించకుండా తప్పించుకుంటారు. ఈ రోజు మీ భాగస్వామితో పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నించండి

రోజు ఆనందంగా గడుపుతారు. మీరు ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. మీ కుటుంబం నుండి సహకారం అందిస్తారు మరియు అర్థం చేసుకుంటారు. చదువుల్లో మీ పిల్లలు చాలా బాగా రానిస్తారు. మీ వ్యాపార వ్యవహారాల్లో నష్టపోయిన కారణంగా మీరు మార్పులు చేసుకుంటారు. చిన్న విషయాల పట్ల ఎక్కువగా కోపం తెచ్చుకుంటారు, అయితే అందులో నుండి బయటకు రావడం మంచిది.జీవితంలో సమతుల్యతను పాటించడం మంచిది. ఆర్థికపరంగా అనుకూలమైన రోజు, అయితే కొన్ని విషయాలపట్ల ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మంచి ఫలితాల కోసం మీ దినచర్యను మెడిటేషన్ మరియ యోగాతో ప్రారంభించండి.

లక్కీ కలర్: గ్రీన్

అదృష్ట సంఖ్య: 20

అదృష్ట సమయం: ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు

ధనుస్సు:

ధనుస్సు:

ఈరాశి వారికి ఈ రోజు పనిలో అనుకూలమైన రోజు అవుతుంది- మీ కృషికి తగిన బహుమతి ఇవ్వబడుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు లక్ష్యాన్నిసాధించడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది. సంతోషంగా ఉండటానికి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడం మంచిది. మీరు పనిచేసే చోట లేదా ప్రయాణంలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. కొత్తగా పెళ్లైన జంటలకు ఈ రోజు చాలా స్పెషల్ గా ఉంటుంది. మీ తల్లిదండ్రులు విలువైన బహుమతిని ఇవ్వొచ్చు. కుటుంబంలో ప్రశాంతంగా మరియు బిజిగా గడుపుతారు . చట్టపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం లభిస్తుంది. బిజినెస్ లో భారీగా లాభం పొందుతారు. ఆరోగ్యం చాలా కాలం తర్వాత స్థిరంగా ఉంటుంది మరియు

మీరు మీ ప్రియమైనవారితో సాయంత్రం ఆనందిస్తారు.

లక్కీ కలర్: బ్రౌన్

అదృష్ట సంఖ్య: 42

అదృష్ట సమయం: ఉదయం 5:55 నుండి మధ్యాహ్నం 1:20 వరకు

మకరం:

మకరం:

పనిచేయడానికి ఆరోగ్యపరంగా మెరుగపడటం ప్రధానకారం. మీరు సుదీర్ఘ విరామం తర్వాత సంతోషంగా తిరిగి చేరుతారు.

మీ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తారు. మీ పిల్లలు ఖరీదైన వస్తువులను డిమాండ్ చేస్తారు.

వ్యాపారవేత్తలు తమ అంచనాలను చేరుకోవాలని భావిస్తారు మరియు ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. సంగీత ప్రియులు మంచి ప్రదర్శన మరియు కచేరీ ఇస్తారు. ఆర్థిక సంక్షోభం నుండి బటయపడటం వల్ల ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. మీరు దగ్గరి బంధువు / స్నేహితుడికి కూడా సహాయం చేస్తారు. ద్రవ్య నిబంధనలు మరియు మునుపటి అప్పులతో బయటపడతారు. సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి మరియు మంచి నిద్ర పొందండి. మీ ఆర్థిక పరిస్థితులను తగినంతగా పర్యవేక్షించడం మంచిది.

లక్కీ కలర్: వైట్

అదృష్ట సంఖ్య: 15

అదృష్ట సమయం: ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:00 వరకు

కుంభం:

కుంభం:

మీరు మీ లక్ష్యాన్ని సాధించినందున రోజంతా సంతృప్తికరంగా ఉంటుంది. సహోద్యోగులు పనిలో సపోర్టివ్ గా ఉంటారు మరియు ఇతర విషయాల్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. పనిని సమయానికి పూర్తి చేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి గురి అవుతారు. కాబట్టి ఎప్పటికప్పుడు పనిని పూర్తి చేయండి. మీరు ఆర్థిక పరిస్థి నుండి ఉపశమనం పొందుతారు.

తల్లి ఆరోగ్యం పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ఇది లాభదాయకమైన రోజు అవుతుంది

వ్యాపారవేత్తల కోసం మీరు అద్భుతమైన ఒప్పందాన్ని పొందవచ్చు. కుటుంబంలో ఒక పెద్ద అపార్థం నుండి ఉపశమనం పొందుతారు . పిల్లల్ని రిల్సాక్డ్ గా మార్చుతారు. మీ సమీప బంధువు / స్నేహితుడు సాయంత్రానికల్లా కలవచ్చు. మీలో ఒకరు నిద్రలేమి సమస్యతో బాధపడుతారు. మీ దిన చర్యను వ్యాయామంతో ప్లాన్ చేయండి మరియు శ్రమను నివారించడండి . మీ ప్రియమైనవారి నుండి స్వీట్ సర్ ప్రైజ్ మిమ్మల్ని రోజంతో ఆనందంగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుత ఈ వాతావరణం అలసటకు గురిచేస్తుంది అది మంచిది కాదు, మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచండి. అందుకు మీరు తగినంత నీరు త్రాగండి.

లక్కీ కలర్: మస్టర్డ్ కలర్

అదృష్ట సంఖ్య: 13

అదృష్ట సమయం: సాయంత్రం 5:50 నుండి రాత్రి 8:00 వరకు

మీనం:

మీనం:

ఆర్థిక పరంగా అనుకూలమైన రోజు మీ పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి అందడం వల్ల రోజంతా ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో అనుకూలంగా ఉండటానికి ఎక్కువ పెట్టుబడి పెడతారు. కార్పొరేట్ రంగంలో పనిచేసే వారు పని మీద ప్రయాణాలు చేస్తారు, ఇది కాస్త ఆనంద కలిగిస్తుంది . ఇది ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రోజంతా బిజీగా గడపాల్సి వస్తుంది. మీ తోబుట్టువులు స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు, మీరు సహనంగా ఉండటం మంచిది.

మీ పిల్లల విషయంలో ఇబ్బందులు పరిష్కరించవల్సి వస్తుంది, ఎందుకంటే వారు డిమాండ్ చేస్తారు మరియు

మొండి పట్టుదలగలవారు. నిర్ణయాలు తీసుకునే ముందు మీరు మీ పెద్దలను సంప్రదిస్తారు, అది మీకు అదృష్టం తెస్తుంది. మీరు పనిలో పెండింగ్ పనిని పూర్తి చేయవచ్చు. గుండె సమస్యతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్: మెజెంటా

అదృష్ట సంఖ్య: 3

అదృష్ట సమయం: ఉదయం 9:10 నుండి మధ్యాహ్నం 12 వరకు

English summary

Daily Horoscope September 8, 2019 In Telugu

Horoscope is an astrological chart or diagram representing the positions of the Sun, Moon, planets, astrological aspects and sensitive angles at the time of an event, such as the moment of a person's birth. The word horoscope is derived from Greek words "wpa" and scopos meaning "time" and "observer".
Story first published: Sunday, September 8, 2019, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more