For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన దేశంలో పిల్లల్ని ఎందుకు గౌరవంగా చూడలేకపోతున్నాం: ప్రశ్నించిన ఢిల్లీ టీనేజర్

|

మన దేశంలో ఇటీవల చిన్నారులు లేవనెత్తుతున్న పలు ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. చిన్నారులే కాదు టీనేజర్లు కూడా తమ రక్షణకు ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. చిన్నారులను, టీనేజర్లను మన భారతదేశ భవిష్యత్తుగా ఎందుకు చూడలేకపోతున్నారు. ఇప్పటికీ మన దేశంలో పిల్లలను రెండో తరగతి సభ్యులుగా చాలా మంది పరిగణిస్తున్నారని 13 ఏళ్ల నవోదిత గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆ టీనేజర్ ఏమేమి ప్రశ్నలు వేసిందో, ఎలాంటి పరిష్కారాలు కావాలని కోరిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

" నవోదిత గోయల్ అనే నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలిలో జన్మించాను. మన దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్నాను. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఈ భారతదేశంలో చిన్నపిల్లలను, టీనేజర్లను ఎందుకు చిన్నచూపు చూస్తారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఏదైనా దుకాణాల్లో చూసినా లేదా రెస్టారెంట్లో చూసినా చిన్నపిల్లలకు కనీస గౌరవం ఇవ్వరు. పైగా మమ్మల్ని వారికి ఇష్టమొచ్చినట్టలు పిలుస్తుంటారు. ఉదాహరణకు ఏదైనా గమ్యస్థానం వెళ్లేందుకు టికెట్ కౌంటర్లో నిలుచుంటే చాలా మంది పెద్దలు చిన్నారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు.

నేను విదేశాలలో ఇప్పటివరకు చాలా గమ్యస్థానాలకు వెళ్లొచ్చాను. అలా ఒకసారి 2016లో నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ ఎ)కు వెళ్లగా వారు చిన్నపిల్లలను ఎంత గౌరవంగా చూస్తారో నాకు తెలిసింది. మన దేశంతో పోల్చుకుంటే అక్కడ పిల్లలు కూడా ఎంత భిన్నంగా వ్యవహరిస్తారో కూడా నేను గమనించాను. ఆ దేశంలో అందరికీ ప్రాముఖ్యత ఇస్తారు. మన దేశంలో అందరికీ అన్ని ఎందుకు సాధ్యం కావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి ఉపాధ్యాయులు, సెక్యూరిటీ గార్డులు, దుకాణ విక్రేతలు ఇంకా చాలా మంది పెద్దలు నన్ను గౌరవించడంతో నాకు చాలా సంతోషం వేసింది.

పిల్లలు, టీనేజర్లు చాలా మంది పెద్దలు తప్పుడు ధోరణి కలిగి ఉంటారు. పెద్దలు చెప్పిన ఏదైనా చేయకపోతే వారి గురించి చెడు ప్రచారం చేస్తారు. అనవసరంగా కొత్త సమస్యలను సృష్టిస్తారు. ఎందుకంటే మేము ఎవరికి ఫిర్యాదు చేయం కదా అని వారి ధైర్యం. అంతేకాదు కొంతమంది చిరు వ్యాపారస్తులు అయితే చిన్నారులను చాలా వరకు మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు. తప్పు బిల్లు ఇచ్చి వారిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు. వారి తల్లిదండ్రులు వచ్చి చిరువ్యాపారిని ప్రశ్నిస్తే ఆ తప్పును కూడా చిన్నారులపై వేసి చేతులు దులుపుకుంటారు. మళ్లీ చిన్నపిల్లలను దుకాణాలకు పంపవద్దని ఉచిత సలహా కూడా ఇస్తారు తప్ప వారిని భారతదేశ భవిష్యత్తుగా మాత్రం అస్సలు చూడరు.

కాబట్టి మన భారతదేశంలో పిల్లలకు కూడా వారి కావాల్సిన హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు దేశానికి నాయకత్వం వహించే వారిగా మేము తప్పకుండా నిలుస్తాము. మన భారత రాజ్యాంగం మనకు లింగం, మతం, జాతి లేదా కులప్రాతిపదికన వివక్ష చూపవద్దని సూచిస్తుంది. కాని వయస్సు గురించి ఎవ్వరు ప్రస్తావించలేదు? దాని పరిస్థితి ఏమిటి?

ఇదేం పెద్ద విషయం కాదని చాలా మంది పెద్దలు అనుకుంటారు. కానీ చిన్నారులపై వివక్ష చూపడం భారతదేశ భవిష్యత్తుకు ఇది చాలా హానికి కలిగిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ సమస్య పరిష్కారానికి మన దేశంలో ఇప్పటికైనా చొరవ చూపుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని 13 ఏళ్ల నవోదిత గోయల్ ప్రకటించింది.

English summary

Delhi Teeneger Question: Why can't we treat children in our country with dignity

I was born in Bareilly, Uttar Pradesh. I am growing in Delhi, the capital of our country. I still do not understand why you see small children and teenagers in this united India. Young children are not given the least respect by looking in any shop or restaurant. We call them favorites.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more