Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
Diwali 2021 : దీపావళి నుంచి ఈ రాశుల జీవితాల్లో సంతోషం వెలిగిపోతుందట...!
ఈ దీపావళి ఈ రాశుల జీవితంలో రాబోయే ఏడాదిలో ఆనందాన్ని తెస్తుందట.
మరి కొద్ది గంటల్లో దీపావళి పండుగ రాబోతోంది. ఈ పండుగను చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా అందరూ ఇష్టపడతారు. అయితే దీపావళి పండుగ సమయంలో మదిలో కొన్ని ప్రశ్నలు కూడా వస్తుంటాయి.

వచ్చే ఏడాది ఆర్థిక పరంగా, కెరీర్ పరంగా ఎలా ఉంటుంది.. అంతా సానుకూలంగా ఉంటుందా? లేదా ప్రతికూల ఫలితాలు ఏమైనా వస్తాయా అనే ఆందోళన ఉంటుంది. అందుకే ఈ కాలంలో వచ్చే ఏడాదంతా తమకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని కోరుతూ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ తల్లిని పూజించడం ద్వారా సంవత్సరం పోడవునా తమ కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా.. ఈ దీపావళి ప్రారంభమైనప్పటి నుండి శ్రీ మహాలక్ష్మీ ఆశీస్సులు, అనుగ్రహం ఏడాది వరకు లభిస్తాయా? లేదా అనే విషయాలను తెలుసుకునేందుకు జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతుంది. ఈ సందర్భంగా రాబోయే ఏడాదిలో 12 రాశులలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి దీపావళి ప్రారంభమైనప్పుడు ఏడాది ప్రారంభంలో వృత్తి పరంగా మరియు వ్యాపార రంగంలో ఆశించిన విజయం లభిస్తుంది. చాలా కాలంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఉండే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపారులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపాటులో నిర్ణయం తీసుకోవడం వంటివి చేయకూడదు. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారికి దీపావళి తర్వాత ఏడాది పొడవునా వృత్తి, వ్యాపార రంగంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం శని దేవుడు మీ రాశి నుండి తొమ్మిదో స్థానంలో రవాణా చేయనున్నాడు. ఈ కారణంగా మీకు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు దక్కుతాయి. ఈ కాలంలో ఉద్యోగులు కోరుకున్న చోటుకు బదిలీ పొందొచ్చు. ఈ సంవత్సరమంతా మీలో సానుకూల శక్తి కనిపిస్తుంది. అయితే మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..
ఈ రాశి వారికి దీపావళి తర్వాత వచ్చే ఏడాదిలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ ఏడాదిలో తొలి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది. ఈ తర్వాత మీరు వృత్తి పరంగా మరియు వ్యాపార రంగాల్లో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు దీపావళి తర్వాత వచ్చే ఏడాది అంతా కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు. అయితే ప్రైవేట్ రంగంలో పని చేసే వారు ఈ కాలంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఏప్రిల్ మాసం వరకు వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది, ఈ తర్వాత మీ వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి.

సింహ రాశి..
ఈ రాశి వారు దీపావళి వేళ మహాలక్ష్మీకి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సంవత్సరం ప్రారంభంలో సానుకూల శక్తితో నిండి ఉంటారు. 2021 చివరి నెలల్లో వృత్తి మరియు వ్యాపార పరంగా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే 2022 సంవత్సరం ప్రారంభంలో మీరు కెరీర్ పరంగా ఉన్నత పదవులను పొందొచ్చు. మరోవైపు నిరుద్యోగులకు ఈ కాలంలో మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి.

కన్య రాశి..
ఈ రాశి వారికి దీపావళి తర్వాత మే మాసం వరకు వృత్తి, వ్యాపారాలలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యుల సహాయంతో మీ వ్యాపారాన్ని ప్రారంభించడంలో కూడా విజయం సాధించగలరు. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు మే నెల తర్వాత ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి కొంత దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు. అయితే మే తర్వాత, మీరు కెరీర్ రంగంలో జాగ్రత్తగా ముందడుగు వేయాలి.

తుల రాశి..
ఈ రాశి వారు ఈ సంవత్సరం మీరు చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలను పొందొచ్చు. అయితే ఈ రాశికి చెందిన చాలా మంది వ్యక్తులకు మార్చి-ఏప్రిల్ నెలలో పురోగతి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెరీర్ పరంగా వచ్చే ఏడాది అంతా బాగానే ఉన్నప్పటికీ, మీకు అదనపు బాధ్యతలు రావడం వల్ల పని భారం ఉండొచ్చు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు వచ్చే ఏడాదిలో కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీ సామర్థ్యం మేరకు మీరు పని చేస్తే.. మంచి ఫలితం పొందొచ్చు. కెరీర్ పరంగా మరియు వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఈ సంవత్సరమంతా మీరు చాలా చురుకుగా ఉండాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పనికి సంబంధించి ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. మీ కుటుంబ జీవితంలో సానుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారిలో కొందరు ఉద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది.

మకర రాశి..
ఈ రాశి వారు ఈ సంవత్సరం తమ శ్రమను రెట్టింపు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది మీరు ఎంత కష్టపడితే.. అంత మంచి ఫలితాలను పొందుతారు. మీ కెరీర్ మరియు వ్యాపారంలో మీరు విజయాన్ని పొందుతారు. మే నెల తర్వాత మీ వ్యాపారం మరింత వేగం పుంజుకుంటుంది. కెరీర్ పరంగా అద్భుత విజయాన్ని పొందొచ్చు.

కుంభ రాశి..
ఈ రాశి వారికి వచ్చే ఏడాదిలో కెరీర్ పరంగా మంచి ఫలితాలు రావొచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి మార్చి నుండి ఏప్రిల్ నెలలో మంచి కంపెనీ నుండి ఆఫర్లు రావొచ్చు. చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మంచి విజయాన్ని పొందొచ్చు.

మీన రాశి..
ఈ రాశి వారిలో ఉద్యోగులకు వచ్చే ఏడాదిలో కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. దీని వల్ల మీరు మంచి పురోగతి సాధిస్తారు. ఈ ఏడాది మీరు ఒక కొత్త కోర్సు చేయొచ్చు. ఈ కారణంగా మీరు మీ రంగంలో ప్రమోషన్ కూడా పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది.
దీపావళి పండుగ సమయంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దేవతకు ఈ పవిత్రమైన సమయంలో పూజలు చేయడం వల్ల ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్మకం.



Click it and Unblock the Notifications
