For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దయచేసి వినండి... రైలు ఎక్కేటప్పుడు కొత్త గైడ్ లైన్స్ పై ఓ లుక్కేయండి...

మీరు రైలు ప్రయాణం చేయాలనుకుంటే ఈ మార్గదర్శాల గురించి ఓ లుక్కేయాల్సిందే...

|

దయచేసి వినండి... జూన్ 1వ తేదీ నుండి చాలా రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి.. ఈ సందర్భంగా ప్రయాణికులకు ముఖ్య గమనిక. కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణాల విషయంలో అనేక మార్పులు, చేర్పులు చేసింది. వీటన్నింటిని ప్రయాణికులందరూ గమనించగలరు.

Dos, Donts guidelines for passengers when train services resume

కొత్తగా రైల్వేస్టేషన్లోకి అడుగుపెట్టే వ్యక్తులకు ఇవి కొత్తగా అనిపించే అవకాశం ఉంది. టికెట్ బుక్ చేసుకోవడం నుండి రైల్వేస్టేషన్ కు చేరుకోవడం, స్క్రీనింగ్, రైల్లో ఆహారం, ప్రయాణంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదో తెలియజేయడానికి రైల్వే శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

Dos, Donts guidelines for passengers when train services resume

ఈ సందర్భంగా మీరు గానీ, మీ బంధు మిత్రులు గానీ రైలు ప్రయాణానికి రెడీ అవుతుంటే ఈ గైడ్ లైన్స్ పై ఓ లుక్కేయాల్సిందే...

ప్యాసింజర్ ట్రైన్స్...

ప్యాసింజర్ ట్రైన్స్...

జూన్ 1వ తేదీ నుండి 200 ప్యాసింజర్ ట్రైన్స్ పార్రంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మే 21వ తేదీ నుండే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

అదనపు రైళ్లు..

అదనపు రైళ్లు..

ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక శ్రామిక రైళ్లకు ఇవి అదనపు రైళ్లు. ఏసీ, నాన్ ఏసీతో పాటు జనరల్ బోగీలకు కూడా ముందస్తు రిజర్వేషన్ ఉంటుంది.

సాధారణ ఛార్జీలే..

సాధారణ ఛార్జీలే..

ఛార్జీల విషయంలో సామాన్య ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైల్వే శాఖ జనరల్ కోచ్, రిజర్వ్ డ్, సెకండ్ సీటింగ్ (2ఎస్)లలో సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తోంది. అయితే అన్ రిజర్వ్ డ్ బోగీలు ఉండవు.

ఈ సర్వీసులు ఉండవు..

ఈ సర్వీసులు ఉండవు..

అయితే ఇతర పాసిజంర్ సర్వీసులు మెయిల్/ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ సర్వీసులన్నీ జూన్ 1 నుండి కూడా అందుబాటులో ఉండవు. ప్రస్తుతం నడుస్తున్న శ్రామిక ప్రత్యేక రైళ్లను రాష్ర్ట ప్రభుత్వాలే నిర్వహిస్తాయి.

నియమాలకు లోబడే..

నియమాలకు లోబడే..

టికెట్ బుకింగ్, కోటా, రాయితీ, టికెట్ క్యాన్సిల్, రీఫండ్, స్క్రీనింగ్, క్యాటరింగ్, తదితర అంశాలన్నీ నియమాలకు లోబడే ఉంటాయి. నియమ, నిబంధనల మేరకు ఆర్ ఏసీ, వెయిటింగ్ లిస్ట్ జాబితా జనరేట్ అవుతుంది.

టికెట్లు ఇక్కడ మాత్రమే..

టికెట్లు ఇక్కడ మాత్రమే..

మీరు బుక్ చేసుకునే టికెట్లను కేవలం ఐఆర్ సిటిసి వెబ్ సైట్, సిఎన్సిలు, టికెట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. స్థానిక అవసరాలను బట్టి టికెట్ కౌంంటర్లను దశల వారీగా తెరుస్తారు. ఇప్పటికే తెలంగాణలో 18 చోట్ల, ఆంధ్రప్రదేశ్ 43 స్టేషన్లలో రిజర్వేషన్లు కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. నెల రోజుల ముందు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది.

రైలెక్కడానికి వీరు అనర్హలు..

రైలెక్కడానికి వీరు అనర్హలు..

వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు రైలు ఎక్కడానికి వీలు లేదు. అలాగే పదేళ్లలోపు పిల్లలకు, వయసుపైబడిన వారికి కూడా రైళ్లలో ప్రయాణించేందుకు అర్హత లేదు. రిజర్వేషన్ కాని టికెట్లు కూడా ఎవరికీ కేటాయించరు. వాటికి స్టేషన్లలో కూడా ఎలాంటి టికెట్లు ఇవ్వరు. ఎందుకంటే రైలు బయలుదేరే నాలుగు గంటల ముందే చార్ట్ ను సిద్ధం చేస్తారు. ఇక తత్కాల్, తత్కాల్ ప్రీమియం టికెట్ల బుకింగ్ కూడా ఇప్పట్లో అందుబాటులో లేదు.

ఇవి పాటించాలి...

ఇవి పాటించాలి...

  • రైల్వే స్టేషన్లో ఎంటర్ & ఎగ్జిట్ అయ్యేందుకు వేర్వేరు ద్వారాలలోనే వెళ్లాలి.
  • రైల్వే స్టేషన్లో కచ్చితంగా భౌతిక దూరం, భద్రత, పరిశుభ్రతకు సంబంధించిన నియమాలను కచ్చితంగా పాటించాలి.
  • టికెట్ కన్ఫార్మ్ అయిన ప్రయాణికుడు, అతనితో వచ్చే డ్రైవర్ కు మాత్రమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గనిర్దేశాల మేరకు స్టేషను లోపలికి అనుమతి ఉంటుంది.
  • కరోనా లక్షణాలు లేకుంటేనే..

    కరోనా లక్షణాలు లేకుంటేనే..

    • రైలు ఎక్కే ప్రయాణికులందరికీ స్క్రీనింగ్ టెస్ట్ కచ్చితంగా చేస్తారు. కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే అనుమతిస్తారు.
    • ప్రయాణికులు కనీసం గంటన్నర ముందు రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి.
    • రైల్వేస్టేషన్లోకి ఎంటరయ్యే ముందు ప్రయాణం ముగిసేంత వరకు మాస్క్ ధరించాలి.
    • రైల్వే స్టేషన్లోనూ, ప్రయాణ సమయంలోనూ భౌతిక దూరం తప్పకుండా పాటించాలి.
    • ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..

      ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..

      • అధిక శరీర ఉష్ణోగ్రత/కరోనా లక్షణాలు ఉన్నట్టు స్క్రీనింగ్ టెస్టులో బయటపడితే అలాంటి ప్యాసింజర్స్ టికెట్ కన్ఫార్మ్ అయినా కూడా ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇలాంటి సమయంలో మాత్రం మీ టికెట్ సొమ్మను రీఫండ్ చేస్తారు.
      • కరోనా లక్షణాలు లేని ప్రయాణికులకు ఎంట్రీ/చెకింగ్/స్క్రీనింగ్ పాయింట్ వద్ద టీటీఈ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.
      • మీ టికెట్ సొమ్ము రీఫండ్ కోసం మీ డేట్ ఆఫ్ జర్నీ నుండి 10 రోజుల్లో టిడిఆర్ ఫైల్ చేయాలి. ఒరిజినల్ టీటీఈ సర్టిఫికెట్లను ఐఆర్ సిటిసికి పంపింతే పూర్తి డబ్బును ప్యాసింజర్ అకౌంట్ కు రీఫండ్ చేస్తారు.
      • వీటిని సొంతంగానే..

        వీటిని సొంతంగానే..

        • ప్రయాణికులే సొంతంగా దుప్పట్లు, బ్లాంకెట్ వంటివి తెచ్చుకోవాలి. అయితే వీలైనంత తక్కువ లగేజీతో ట్రావెల్ చేయడం బెటర్.
        • ప్రయాణికులు స్వయంగా తాము ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం, మరియు మంచినీళ్లను తెచ్చుకోవాలి.
        • అయితే రైల్వేస్టేషన్లలో కూడా హోటల్స్, దుకాణాలు తెరిచి ఉంటాయి.
        • ఫుడ్ ప్లాజాలు, రీఫ్రెష్ మెంట్ రూమ్స్ మొదలైన వాటి చోట్ల వండిన ఆహారం లభించే అవకాశం ఉంటుంది.

English summary

Do's, Don'ts guidelines for passengers when train services resume

Here we talking about do's, don'ts guidelines for passengers when train services resume. Read on
Desktop Bottom Promotion