For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఎక్కువగా ఈ కలలు వస్తున్నాయా? అయితే అందులోని అర్థాలేంటో తెలుసుకోండి...

|

ప్రతి ఒక్కరికీ మంచి కలలు లేదా చెడు కలలు రావడం అనేది సర్వసాధారణం. అయితే మీకు తరచుగా వచ్చే కలలు మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు సూచనలు. అంతేకాదు మీ ప్రస్తుత జీవితంలో లేదా భవిష్యత్తులో జరిగే కొన్ని విషయాలు కూడా మీకు కలలోనే తెలిసిపోతాయి.

అయితే మీరు ఎప్పుడైనా చనిపోయినట్లు కలలు గన్నారా? మీకు ఇలాంటి కలలు ఎప్పుడైనా వచ్చాయా? వస్తే ఆ కలకు గల అర్థం ఏంటి? అసలు ఆ కల ఎందుకు వచ్చింది?

దీని గురించి మనం నిద్ర మేల్కొన్న తర్వాత చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే మనకు వచ్చే ప్రతి కల వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం కూడా సాధారణంగా ఎక్కువ మందికి వచ్చే కొన్ని కలల గురించి.. వాటి వెనుక రహస్యాల గురించి తెలుసుకుందాం...

ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా భావిస్తారు... ఆధ్యాత్మికంగా మాత్రం గొప్ప ఫలితమొస్తుందట.. ఎందుకు?

చనిపోయినట్లు కల..

చనిపోయినట్లు కల..

సాధారణంగా మనలో చాలా మందికి కొన్నిసార్లు మనం చనిపోయినట్లు కలలు వస్తుంటాయి. వాటిని పీడకలలుగా పెద్దలు చెబుతుంటారు. అయితే దీని వల్ల ఎలాంటి నష్టం లేకపోయినప్పటికీ, ఇది మీరు ఎదుర్కొనే ప్రమాదాల గురించి మీకు గుర్తు చేస్తుంది. అలాగే మీ ఫైనాన్స్ వంటి విషయాలలో కూడా చెడు ప్రభావం చూపుతుంది. అలాగే మీ జీవితంలో పాత విషయాలు పూర్తయిపోయి.. కొత్త విషయాలు ప్రారంభమవుతాయనే దానికి సంకేతంగా ఈ కల గురించి చెబుతుంటారు పెద్దలు.

ఒకేసారి ఎక్కువ కలలు..

ఒకేసారి ఎక్కువ కలలు..

ఒకేరోజు ఒకటి కంటే ఎక్కువ కలలు కంటూ ఉంటే, మీకు స్నేహితులు ద్రోహం చేయడాన్ని లేదా మీ సన్నిహితుల ద్రోహం చేయడాన్ని సూచిస్తుంది. మీ భాగస్వాముల యొక్క రహస్య ఉద్దేశ్యాలను చూపేందుకు ఇలాంటి కల ఒక హెచ్చరిక సంకేతంలా పని చేస్తుంది. అలాగే కలలో గర్భం యొక్క మృతేహం చూస్తే.. అది మీ జీవితంలో కీలకమైన ముగింపు రోజును సూచిస్తుంది. ఇది దీర్ఘకాలిక సంబంధం లేదా ఇతర ప్రధాన సంఘటన నుండి వేరు కావచ్చు.

నల్లని వస్త్రం..

నల్లని వస్త్రం..

మీరు కలలో చనిపోయినప్పుడు మీ మృతదేహంపై నల్లని వస్త్రం కప్పబడితే, అది మీ మొత్తం జీవితాన్ని మరియు దాని దిశను ప్రభావితం చేసే కొన్ని వైఫల్యాలను సూచిస్తుంది. మీ కుటుంబ సభ్యుడు లేదా జీవిత భాగస్వామి గురించి కలలు కనే వారు మీకు సంబంధించిన బాధ్యతలను నెరవేర్చడానికి ఇష్టపడం లేదనే వాస్తవాన్ని సూచిస్తుంది.

ఆందోళన చెందుతున్నారా?ఒత్తిడిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి 5 శక్తివంతమైన మూలికలు

గతాన్ని మరచిపోవడం..

గతాన్ని మరచిపోవడం..

మీరు కలలో మృతదేహం గురించి కల కంటూ ఉంటే, మీరు నిరాశ పడకుండా, ఒకవేళ నిరుత్సాహం ఎదురైనా, భయపడకుండా మళ్లీ ధైర్యంగా ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనడానికి సంకేతంగా చెప్పొచ్చు.

విజయాలు మెరుగవుతాయి..

విజయాలు మెరుగవుతాయి..

విద్యార్థులు మృతదేహాల గురించి కలల కంటుంటే, అది వారి అభ్యాస నాణ్యతను మెరుగుపరుస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు వారికి విద్యపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఏదైనా నేర్చుకోవడానికి చాలా కష్టపడతారు. రాబోయే సంవత్సరాల్లో మీ విజయాలు బాగా మెరుగుపడతాయి.

సమస్యలను ఎదుర్కోవడానికి..

సమస్యలను ఎదుర్కోవడానికి..

మీకు తరచుగా ఇలాంటి కలలు వస్తుంటే, మీ జీవితంలో ఏదైనా రహస్యం బట్టబయలు అవుతుందని, లేదా తప్పించుకోవడానికి కష్టంగా ఉన్న ఏదైనా సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారని అర్థం.

సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?

స్నేహితుడు చనిపోయినట్లు..

స్నేహితుడు చనిపోయినట్లు..

మీకు కలలో స్నేహితుడు చనిపోయినట్లు కలలు వస్తుంటే, మీ జీవితంలో శారీరక కష్టాలు ఎదురవుతాయి. అలాగే చిన్న కోరికలను నెరవేర్చుకుంటారు. ప్రస్తుతం చేసే పనులలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది.

కోరికలు నెరవేరవు...

కోరికలు నెరవేరవు...

మీకు కలలో మీరు చనిపోయినప్పుడు, మీ శరీరాన్ని కాల్చినట్లు కనిపిస్తే, అప్పుడు మీరు ఏవైనా కోరికలు కోరుకుంటే, అవి నెరవేరే పరిస్థితి ఉండదు. అలాగే అంత్యక్రియల గురించి కలలు వస్తే మీకు ఏదైనా మంచి జరుగుతున్నట్లు సంకేతంగా భావించొచ్చు.

శవ పేటిక నుండి..

శవ పేటిక నుండి..

కలలో చనిపోయినప్పుడు, మీ శవ పేటికలో నుండి మృతదేహం బయటికి వచ్చినట్లు మీరు కల కంటే, మీతో ఎక్కువ కాలం సంబంధం లేని స్నేహితుడు అకస్మాత్తుగా మిమ్మల్ని సందర్శించవచ్చు. ఇది మంచి ఫలితాలకు సంకేతం.

మృతదేహాన్ని దాచే కల..

మృతదేహాన్ని దాచే కల..

మీకు కలలో మీ మృతదేహాన్ని దాచేందుకు ప్రయత్నించిన కలలు వస్తే, మీరు గతాన్ని దాచడానికి లేదా మీ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలను సూచిస్తుంది. ఇది ఒక నిర్దిష్ట పరిస్థితి లేదా వ్యక్తుల కోసం మీ అభిరుచులను లేదా నమ్మకాలను క్లియర్ చేయాలనే మీ కోరికను కూడా ప్రతిబింబిస్తుంది.

మీ శవాన్ని పూడ్చితే..

మీ శవాన్ని పూడ్చితే..

మీకు కలలో మీ శవాన్ని పూడ్చినట్లు కనిపిస్తే, మీరు ఏవైనా అవాంఛనీయ వస్తువులను వదిలేయాలనే కోరికను సూచిస్తుంది.

నీటిలో తేలుతున్నట్టు..

నీటిలో తేలుతున్నట్టు..

మీకు కలలో చనిపోయి, మీ శవం నీటిలో తేలియాడుడూ కనిపిస్తే, మీ జీవితంలో కష్టమైన పరిస్థితులు ఏర్పడొచ్చు. అవి మీ జీవితానికి మరింత ఇబ్బందిని కలిగించవచ్చు. అదే స్వచ్ఛమైన నీటిలో శరీరాన్ని కలిగి ఉండటం అంటే మీరు అంతర్గత ప్రశాంతత యొక్క ఒక దశలో ఉన్నారని అర్థం. ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యుడిని కోల్పోయిన దుఃఖాన్ని మీరు అధిగమిస్తారనేందుకు ఇదొక సూచన.

English summary

Dreaming of dead bodies and their meaning

Dreaming of a dead body or a corpse is often connected to your happiness. Unfortunately this dream indicates possible difficult times ahead. Lets see the meaning of dreaming dead bodies.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more