For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Father's Day 2021: ఫాదర్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది? తొలిసారి ఎక్కడ జరుపుకున్నారు?

|

మనందరికీ తల్లి నవమాసాలు తన కడుపులో మోస్తే.. తండ్రి ఆ జన్మకి మూల కారణం. మనం ఈ భూమి మీదకు వచ్చామంటే.. అది తల్లిదండ్రుల వల్లనే. అయితే మనలో అనేక మంది తల్లినే ఎక్కువగా ప్రేమిస్తారు.

కానీ తల్లితో సమానమైన ప్రేమను తండ్రి కూడా అందిస్తానడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే నాన్న తనలో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ను అంత సులభంగా బయటపెట్టుకోలేక.. బయటికి చాలా గంభీరంగా కనిపిస్తూ.. అవేవి తన ఫేసులో కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉంటాడని చాలా మంది భావన.

అయితే తల్లి ప్రేమ భావోద్వేగాలతో ముడిపడి ఉంటే.. తండ్రి ప్రేమ మాత్రం బాధ్యతతో కూడుకుని ఉంటుంది. అయితే మదర్స్ డే జరుపుకున్నంతంగా.. ఫాదర్స్ డేను మాత్రం జరుపుకోరు. మన సినిమాల్లో సైతం తల్లి సెంటిమెంట్ ని ఆధారం చేసుకునే ఎక్కువగా చూపిస్తుంటారు. తండ్రి గురించి కేవలం ఒకట్రెండు సినిమాలే కనిపిస్తుంటాయి.

ఏదేమైనా మన జీవితాల్లో ఓ విలక్షణమైన పాత్రను పోషించే.. గొప్ప వ్యక్తి తండ్రి అనేది కాదనలేని సత్యం. ఈ సందర్భంగా ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Father's Day 2021 : ఫాదర్స్ డే జరుపుకోడానికి ప్రధాన కారణాలేంటో తెలుసా...Father's Day 2021 : ఫాదర్స్ డే జరుపుకోడానికి ప్రధాన కారణాలేంటో తెలుసా...

జూన్ 21న ఫాదర్స్ డే..

జూన్ 21న ఫాదర్స్ డే..

ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈ ఫాదర్స్ డే వేడుకలను మొట్టమొదటిసారిగా అమెరికాలో జరుపుకున్నారు. 1910 జూన్ మూడో ఆదివారం నాడు వాషింగ్టన్ వైఎంసీఏలోని స్పోకేన్ లో సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేశారు. అప్పుడు జూన్ 19న ఫాదర్స్ డే వచ్చింది. అప్పటికే ప్రతి ఏటా మదర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనోరా స్మార్ట్ డాడ్ తండ్రులకు కూడా ఓ రోజు ఉండాలని భావించారు.

తండ్రి బాధ్యతల్ని..

తండ్రి బాధ్యతల్ని..

సోనోరా తండ్రి పేరు విల్లియం జాక్సన్ స్మార్ట్. తను ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చారు. వారిని చిన్ననాటి నుండే కష్టపడి పెంచి పెద్ద చేశారు. అప్పుడు తండ్రి కష్టాలను, బాధ్యతలను దగ్గర నుండి పరిశీలించిన సోనోరా ఫాదర్స్ డే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చర్చి పాస్టర్ తో చర్చించారు. తన తండ్రి అయిన పుట్టినరోజు అయిన జూన్ 5వ తేదీన ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలనుకున్నారు. కానీ చర్చి వేళలు కలిసి రాకపోవడంతో ఫాదర్స్ డే మూడో ఆదివారానికి వాయిదా పడింది.

ఇతర దేశాల్లో..

ఇతర దేశాల్లో..

ఆ తర్వాత ప్రతి ఏడాది జూన్ మాసంలో మూడో ఆదివారం రోజున అమెరికాలో ఫాదర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇదే వేడుకలు ఇతర దేశాల్లోనూ జరిగాయి. నెమ్మదిగా ఇదే రోజును మన దేశంలో కూడా కొన్ని సంవత్సరాలు జరుపుకుంటున్నారు.

Fathers' Day 2021 : ఫాదర్స్ డే విషెస్, కోట్స్, మెసెజ్ లను షేర్ చేసుకోండి...Fathers' Day 2021 : ఫాదర్స్ డే విషెస్, కోట్స్, మెసెజ్ లను షేర్ చేసుకోండి...

భారతదేశంలోనూ..

భారతదేశంలోనూ..

ఆ తర్వాత మన దేశంలో కూడా కొంతమంది ప్రముఖులు కూడా ఫాదర్స్ డేను సెలబ్రెట్ చేసుకోవడం ప్రారంభించారు. గత ఏడాది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందాన కూడా తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఫొటోలను, మెమోరీస్ ను షేర్ చేసుకుంది.

మన చుట్టూనే..

మన చుట్టూనే..

ప్రముఖ నటులు నాన్న గురించి మాట్లాడుతూ.. తమ తండ్రి ఎక్కిడికి వెళ్లలేదు. మనతోనే మన చుట్టూనే ఉన్నారని చెబుతుంటారు. ఈ జీవితాన్ని మనకి ఇచ్చిన నాన్నకి తిరిగి ఏమి ఇవ్వగలం.. అందుకనే ఆయనని ఎప్పటికీ ఒక ‘మంచి జ్ణాపకంగా' గుర్తుపెట్టుకుందాం అని చెబుతారు.

English summary

Father's Day 2021 Date, Significance and why we celebrate in Telugu

Here we are talking about the Father's Day 2021 Date, Significance and why we celebrate in Telugu. Read on
Story first published: Monday, June 14, 2021, 10:02 [IST]