For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

September 2022 Vrat And Festivals : సెప్టెంబర్ నెలలో జరుపుకోబోతున్న పండుగలు మరియు వ్రతాలు..

2022సెప్టెంబర్ నెలలో జరుపుకోబోతున్న పండుగలు మరియు వ్రతాలు..

|

September festivals 2022: ప్రస్తుతం సెప్టెంబర్ నెల ప్రారంభం అయింది. సెప్టెంబర్ ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో తొమ్మిదవ నెల. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో (Festivals in September 2022) చాలా పెద్ద పండుగలు, వ్రతాలు రానున్నాయి. ప్రస్తుతం భాద్రపద మాసం సెప్టెంబర్ 10తో ముగియనుంది. దీని తర్వాత సెప్టెంబర్ 11 నుంచి అశ్వినీ మాసం ప్రారంభం కానుంది.

Festivals and Vrats in the month of September 2022 in telugu

సెప్టెంబర్ నెలలో మొదటి వ్రతం ఋషిపంచమి అవుతుంది. సెప్టెంబర్ 1న ఋషిపంచమి జరుపుకోనున్నారు. గణేశ పండుగ, అనంత చతుర్థి మరియు పితృపక్ష నవరాత్రి వంటి పెద్ద పండుగలు మరియు ఉపవాసాలు ఈ మాసంలో వస్తాయి. సెప్టెంబర్ 2022లో జరిగే ప్రధాన పండుగలు మరియు ఉపవాసాల పూర్తి జాబితా ఇక్కడ ఉంది.

పండుగలు మరియు వ్రతాలు

పండుగలు మరియు వ్రతాలు

01 సెప్టెంబర్ (గురువారం) - ఋషి పంచమి, లలితా షష్టి

02 సెప్టెంబర్ (శుక్రవారం) - సూర్య షష్టి మరియు సంతాన సప్తమి

04 సెప్టెంబర్ (ఆదివారం) - శ్రీ రాధాష్టమి, స్వామి హరిదాస్ జయంతి

06 సెప్టెంబర్ (మంగళవారం) - పరివర్తిని ఏకాదశి

07 సెప్టెంబర్ (బుధవారం) - 1వ ఓనం (ఉత్రాదం)

08 సెప్టెంబర్ (గురువారం) - తిరువోణం

08 సెప్టెంబర్ (గురువారం) - ప్రదోష వ్రతం (శుక్లపక్షం)

09 సెప్టెంబర్ (శుక్రవారం) - మూడవ ఓనం (అవిట్టం)

09 సెప్టెంబర్ (శుక్రవారం) - అనంత చతుర్దశి, గణేశ నిమంజనం

పండుగలు మరియు వ్రతాలు

పండుగలు మరియు వ్రతాలు

10 సెప్టెంబర్ (శనివారం) - పితృ పక్షం ప్రారంభం, శ్రాద్ధం ప్రారంభం, భాద్రపద పూర్ణిమ వ్రతం

10 సెప్టెంబర్ (శనివారం) - శ్రీ నారాయణ గురు జయంతి

13 సెప్టెంబర్ (మంగళవారం)- సంకష్ట చతుర్థి

17 సెప్టెంబర్ (శనివారం) - కన్య సంక్రాంతి, మహాలక్ష్మి వ్రతం సంపూర్ణం, రోహిణి వ్రతం, అశోకాష్టమి

21 సెప్టెంబర్ (బుధవారం) - ఇంద్ర ఏకాదశి

21 సెప్టెంబర్ (బుధవారం) - శ్రీ నారాయణ గురు సమాధి

23 సెప్టెంబర్ (శుక్రవారం) - ప్రదోష వ్రతం (కృష్ణ పక్షం)

24 సెప్టెంబర్ (శనివారం)- మాసిక శివరాత్రి

25 సెప్టెంబర్ (ఆదివారం) - సర్వ పితృ అమావాస్య(అశ్విని అమావాస్య)

25 సెప్టెంబర్ (ఆదివారం) - సర్వ పితృ అమావాసి, శ్రాద్ధ ముగింపు

26 సెప్టెంబర్ (సోమవారం) - శారదీయ నవరాత్రులు ప్రారంభం

 పరివర్తిని ఏకాదశి

పరివర్తిని ఏకాదశి

పరివర్తినీ ఏకాదశి వ్రతాన్ని భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు పాటిస్తారు. ఈ ఏడాది ఈ ఏకాదశి సెప్టెంబర్ 6వ తేదీన జరుపుకోనుంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు.

శారదీయ నవరాత్రులు

శారదీయ నవరాత్రులు

ప్రతి సంవత్సరం శారదీయ నవరాత్రులు అశ్విని మాసంలో శుక్ల పక్షం ప్రతిపాదంతో ప్రారంభమవుతాయి. ఈ సమయంలో, దుర్గా దేవిని 9 రోజులు పూజిస్తారు. ఈ కాలంలో దుర్గాదేవిని పూజించి, ఉపవాసం ఉన్నవారికి విశేషమైన అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది రూపాలను పూజిస్తారు.

పితృ పక్షం 2022

పితృ పక్షం 2022

ప్రతి సంవత్సరం పితృ పక్షం భాద్రపద మాసం పౌర్ణమి రోజున ప్రారంభమై అశ్వినీ మాసం అమావాస్య వరకు ఉంటుంది. ఈ ఏడాది పితృ పక్షం 10 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమై 25 సెప్టెంబర్ 2022న ముగుస్తుంది. పిత్ర దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇదే చాలా మంచి రోజు.

గణేశ నిమంజనం

గణేశ నిమంజనం

గణేశ చతుర్థి పండుగ యొక్క చివరి రోజు అనంత చతుర్దశి అని కూడా పిలువబడే గణేశ నిమంజనం. ఈ విశిష్టమైన రోజున సముద్రం, చెరువులు, నదులు తదితర నీటి వనరులలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.దీంతో విగ్రహాల నిమజ్జనంతో పాటు భక్తుల ఇళ్లలోని ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం.

ఓనం

ఓనం

ఓనం కేరళలో ముఖ్యంగా మలయాళీలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది వివిధ ఆచారాలు మరియు కార్యక్రమాలతో 10 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి ఓనం 2022లో సెప్టెంబర్ 7న జరుపుకుంటారు. సెప్టెంబర్ 10న ఓనం వేడుకలు ముగియనున్నాయి. సెప్టెంబర్ 8న తిరువోణం. మూడవ ఓనం సెప్టెంబర్ 9న మరియు నాల్గవ ఓనం సెప్టెంబర్ 10న.

English summary

Festivals and Vrats in the month of September 2022 in telugu

September 2022 Festivals and Vrats List in Telugu: Let us know about the list of fasts and festivals falling in September month. Take a look.
Desktop Bottom Promotion