For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిద్ధ న్యాచురోపతితో కరోనాకు చెక్ పెట్టొచ్చు... అదెలాగో తెలుసుకోండి...

|

విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు కోటి మార్కును దాటిపోయాయి. ఇప్పటికీ ఏ ఒక్కరూ కరోనా విరుగుడుకు సరైన మందును కనిపెట్టలేకపోయారు.

PC Curtosy

మన దేశంలోని కొందరు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చే లేదా ముందు జాగ్రత్త నివారణ మందులనే అందుబాటులోకి తెచ్చారు తప్ప ఈ వ్యాధి పూర్తిగా నయమయ్యే మందును మాత్రం తీసుకురాలేకపోయారు.

ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయుర్వేదం.. హోమియోపతి, న్యాచురోపతి వంటి సహజ వైద్యం మరోసారి తెరపైకి వచ్చింది. రావడమే కాదు ఇంగ్లీష్ మందులకన్నా మన సహజసిద్ధమైన వైద్య పద్ధతులతో కరోనావైరస్ కు చెక్ పెట్టొచ్చని నిరూపించింది.

మన దేశంలోని సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడంలో కేరళ రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది. అక్కడ కరోనా మహమ్మారి విరుగుడుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది తమిళనాడు ప్రయోగాల గురించి.

ఎందుకంటే ఆ రాష్ట్రం ఇటీవలే కరోనా విషయంలో కొంత విజయం సాధించింది. సుమారు 30 మంది కరోనా లక్షణాలున్న వారికి చికిత్స అందించడంలో సక్సెస్ సాధించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కోవిడ్ -19: జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధకశక్తి పెరుగుదల..

రోగనిరోధకశక్తి పెరుగుదల..

కరోనా వైరస్ లక్షణాలకు చికిత్స చేయడమంటే, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే. ఏ కొత్త వైరస్ ను ఎదుర్కోవాలన్న మనకు ఇదే చక్కటి మార్గం.

సంప్రదాయ వైద్యం..

సంప్రదాయ వైద్యం..

ఇటీవలే తమిళనాడు ప్రభుత్వానికి వివిధ సంప్రదాయాల వైద్య విధానాలకు చెందిన ఎనిమిది ప్రతినిధులు ఆయుర్వేద, హోమియాపతి, యునాని, న్యాచురోపతి వంటి విధానాల్లో తాము ఏమేం చేయగలమో అనే విషయాలను వివరించారు.

జూన్ 10 నాటికి..

జూన్ 10 నాటికి..

ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కరోనా వైరస్ ను తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే తమిళనాడు ప్రభుత్వం ఇదంతా వీడియో రికార్డు చేయాలని చెప్పింది. ఏయే సెంటర్లలో ఏయే రోగులకు చికిత్స చేయాలో సూచించింది. జూన్ 10 నాటికి 3146 మంది రోగులకు న్యాచురోపతి సంప్రదాయ వైద్యాన్ని మొదలుపెట్టారు.

కరోనావైరస్ వాస్తవానికి ఆరోగ్యకరమైన వ్యక్తులలో మధుమేహాన్ని ప్రేరేపిస్తుంది: అధ్యయనం

కరోనా కేర్ సెంటర్లలో..

కరోనా కేర్ సెంటర్లలో..

తమిళనాడు రాజధాని చెన్నైలో Stanley.Omandurara Hospitals, Loyola.DG Vaishnav, Jawahar కళాశాలల్లోని కేర్ సెంటర్లలో ఈ సిద్ధ ప్రయోగాలు ప్రారంభించారు. ముందుగా 30 మందికి చికిత్సను అందించారు. వారందరూ కరోనా నుండి పూర్తిగా విముక్తి పొందడంతో వారిని డిశ్చార్జ్ చేశారు.

మరో 100 మందికి..

మరో 100 మందికి..

వీరితో పాటు మరో 100 మందికి చికిత్స దాదాపు పూర్తి కావచ్చినట్లు తమిళనాడు హెల్త్ సెక్రెటరీ జె.రాధాక్రిష్ణన్ తెలిపారు. వీరందరికీ ఎగ్జిట్ టెస్టులు చేసి, నెగిటివ్ వచ్చిన వెంటనే వీరందరినీ అతి త్వరలోనే డిశ్చార్జ్ చేయబోతున్నట్లు చెప్పారు.

ఆశాజనకంగా ఫలితాలు..

ఆశాజనకంగా ఫలితాలు..

State Development Policy Council(SPDC) ఉపాధ్యక్షుడు పొన్నయ్యన్ దీని గురించి మాట్లాడుతూ ‘‘ఇది చాలా ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే పలుచోట్ల కరోనా రోగులతో ప్రాణాయామం, యోగ చేయిస్తున్నాం. దీంతో పాటు ఉప్పుతో కలిపిన నులివెచ్చని నీటి పుక్కిలింత.. ఆవిరి పట్టడం వంటి చర్యలతో పూర్తిగా కరోనా నెగిటివ్ రావడం ఆశాజనకరంగా మరియు ప్రోత్సాహకరంగా ఉంది'' అని అన్నారు.

కరోనా వేళ ఈ పరిహారాలు చేస్తే కచ్చితంగా ప్రయోజనాలుంటాయట...!

ఇంకా తేలాల్సి ఉంది..

ఇంకా తేలాల్సి ఉంది..

అయితే ఈ సహజ సిద్ధమైన ఈ వైద్యం వల్లే కోలుకున్నారా? లేదా వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి పెరిగి కోలుకున్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఆనందించాల్సిన విషయమేమిటంటే.. ఈ చికిత్స తీసుకున్న వారిలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడలేదు.

ఇంకా పెంచుతాం..

ఇంకా పెంచుతాం..

కేరళ రాష్ట్రంలోని సంప్రదాయ వైద్యం మాదిరిగానే తమిళనాడులో కూడా న్యాచురల్ ట్రీట్ మెంట్ మంచి ఫలితాలను ఇస్తుండటంతో, ఈ చికిత్సను మరింత మందికి పెంచబోతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాపై యుద్ధంలో ఏది ఉత్తమ ఫలితంగా నిలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

English summary

Good Results by Sidha Naturopathy Method on Coronavirus

Here we talking about good resulsts by sidha naturopathy method on coronavirus. Read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more