For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Green Comet 2023: ఆకాశంలో అద్భుతం, 50 వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న తోకచుక్క

ఓ అరుదైన ఘట్టం ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరగనుంది. సుమారు 50 వేల సంవత్సరాల తర్వాత ఒ ఆకుపచ్చ తోకచుక్క కనిపించనుంది.

|

ఖగోళం అద్భుతాలకు నిలయం. ఎన్నో వింతలు, ఆలోచనలకు కూడా అందని విషయాలు, ఎన్నో రహస్యాలకు నిలయం మన విశ్వం. ఈ విశాల విశ్వంలో మనిషి ఆలోచనలకు కూడా అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఖగోళంలో వావ్ అనిపించే ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ అరుదైన ఘట్టం ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరగనుంది. సుమారు 50 వేల సంవత్సరాల తర్వాత ఒ ఆకుపచ్చ తోకచుక్క కనిపించనుంది. 50 వేల ఏళ్ల క్రితం నియండర్తల్ పీరియడ్ లో(రాతియుగం కంటే ముందు సమయంలో) ఈ తోక చుక్క కనిపించినట్లు సమాచారం.

Green Comet 2023: Rare star to make first appearance after 50,000 years; Know date, time and where to watch Live in India in Telugu

ఖగోళంలో కనువిందు చేయబోయే ఆ నక్షత్రం పేరు గ్రీన్ కోమెట్ తోక చుక్క. అయితే ఈ తోక చుక్కన చూసే అదృష్టం మనకు లభించడం విశేషం. ఉత్తర దిక్కున ధ్రువ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్య ఇది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రీన్ కొమెట్ ను గతేడాది మార్చిలో సైంటిస్టులు కనుక్కొన్నారు. శాస్త్రవేత్తలు ఈ తోక చుక్కకు C/2022 E3(ZTF) గా పేరు పెట్టారు.

భూమికి ఎంత దగ్గరగా రానుంది:

భూమికి ఎంత దగ్గరగా రానుంది:

50 వేల ఏళ్ల తర్వాత కనిపించి ఈ ఆకుపచ్చ తోక చుక్క భూమికి చేరువలోకి రానుంది. అలా భూమిపై నివసించే వారికి కనిపించనుంది. అయితే భూమికి ఇది 42 మిలియన్ కిలోమీటర్ల దూరంలో అలా వెళ్లిపోతుందని అమెరికా అంతరిక్షణ పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.

ఈ తోక చుక్కను మనం చూడొచ్చా:

ఈ తోక చుక్కను మనం చూడొచ్చా:

ఆ గ్రీన్ కొమెట్ తోక చుక్కను నేరుగా కంటితో చూడటం అసాధ్యం. కాంతి వెలుగులో ఇది మసకగా కనిపిస్తుంది. పూర్తి చీకట్లో బైనాక్యులర్ ద్వారా మాత్రమే దీనిని వీక్షించవచ్చు. ఈ తోక చుక్క బుధవారం రాత్రి 9.30 గంటల తర్వాత ఆకాశంలో కనిపిస్తుంది. ఈ తోకచుక్కను ఇప్పుడు చూడలేకపోతే జీవితంలో మళ్లీ చూడటం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మళ్లీ ఎన్నో మిలియన్ల సంవత్సరాల తర్వాత మాత్రమే భూమికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తోక చుక్కను బృహస్పతి కక్ష్యలో ఉండగా గతేడాది మార్చిలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుండి అది వెలుగు విరజిమ్ముతూనే ఉంది.

ఆకుపచ్చ తోకచుక్క ఎంత పెద్దదంటే..

ఆకుపచ్చ తోకచుక్క ఎంత పెద్దదంటే..

ఈ గ్రీన్ కొమెట్ తోక చుక్క ఒక కిలోమీటర్ పరిమాణంలో ఉంటుందని ప్యారిస్ అబ్జర్వేటరీ ఆస్ట్రో ఫిజిస్ట్ తెలిపారు. ఈ తోకచుక్క ప్రకాశిస్తూ పొడవైన తోకతో కనువిందు చేయనంది.

తోక చుక్కలు నక్షత్రాలా?

తోక చుక్కలు నక్షత్రాలా?

తోక చుక్కలు నక్షత్రాలు కావు. మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు తోక చుక్కలు కూడా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతారు. ఇవి దుమ్ము, ధూళి, రాళ్లు, మంచుతో కూడుకుని ఉంటాయి. గ్రహాలు, గ్రహ శకలాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లుగానే ఈ తోక చుక్కలు కూడా తిరుగుతుంటాయి. ఇవి సూర్యుడికి సమీపంగా వచ్చినప్పుడు మరించ ప్రకాశవంతంగా మారతాయి. అలా బూడిదగా మారిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని తోక చుక్కల తోకలు లక్షలాది మైళ్ల దూరం వరకు కూడా ఉంటాయి.

English summary

Green Comet 2023: Rare star to make first appearance after 50,000 years; Know date, time and where to watch Live in India in Telugu

read this to know Green Comet 2023: Rare star to make first appearance after 50,000 years; Know date, time and where to watch Live in India in Telugu
Story first published:Thursday, February 2, 2023, 12:58 [IST]
Desktop Bottom Promotion