For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fathers' Day 2022 : ఫాదర్స్ డే విషెస్, కోట్స్, మెసెజ్ లను షేర్ చేసుకోండి...

|

మనల్ని కడుపులో మోసేది తల్లి అయితే... పిల్లల్ని జీవితాంతం గుండెలపై పెట్టుకుని చూసుకునేవాడు నాన్న. అయితే మన సమాజంలో తల్లికి ఉన్నంత గుర్తింపు తండ్రికి ఉండదన్నది బహిరంగ రహస్యమే..

అయితే తల్లులందరికీ ఓ ప్రత్యేకమైన రోజు ఎలా ఉందో.. తండ్రులందరినీ గుర్తించేందుకు వారి కోసం కూడా ఓ స్పెషల్ అనేది ఉంది. అదే జూన్ 21. ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడో ఆదివారం నాడు ఫాదర్స్ డేను జరుపుకుంటారు.

కుటుంబంలో, సమాజంలో తండ్రికంటూ ప్రత్యేకస్థానం ఉందని గుర్తించేందుకు ఈరోజును నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ 21వ తేదీ మరో ప్రత్యేకత ఏంటంటే.. అదే రోజు తొలి సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది.

సూర్యభగవానుడిని కూడా మన సమాజంలో తండ్రి మాదిరిగానే భావిస్తారు. సూర్యుడు తన కిరణాలతో లోకమంతటికీ వెలుగును ఎలా పంచుతాడో... మన జీవితాల్లో మన తండ్రులు కూడా అలాంటి వెలుగులే పంచేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీరు మీ నాన్నకు ప్రత్యేకమైన విషెస్ చెప్పండి.. మీ నాన్న సర్ ప్రైజ్ చేయండి.. అందుకే మీకోసం కొన్ని మెసెజ్ లు, కోట్స్, విషెస్ జాబితాను తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని మీ ప్రియమైన తండ్రికి షేర్ చేయండి... అలాగే మీ బంధుమిత్రులకు, ప్రియమైన వారికి షేర్ చేసి వారిని కూడా ఫాదర్స్ ను విష్ చేయమని చెప్పండి...

ఫస్ట్ హీరో..

ఫస్ట్ హీరో..

‘‘ఈ విశ్వంలో కూతురు మరియు కుమారుడి యొక్క మొట్టమొదటి హీరో ఎవరైనా ఉన్నారంటే అది వారి నాన్న మాత్రమే''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

ప్రాణాన్ని పణంగా పెట్టి

ప్రాణాన్ని పణంగా పెట్టి

‘‘నాన్న ఊపిరి ఉన్నంత వరకు.. మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి

రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి జీవితాన్ని ధారపోసి మనకు జీవితాన్ని ఇస్తాడు''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

చాలా గొప్పగా

చాలా గొప్పగా

‘‘మన ముందు కఠినంగా ఉండే నాన్న..

బయట వారితో.. ముఖ్యంగా బంధువులతో

మన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు..''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

 ప్రత్యక్ష దైవమే నాన్న..

ప్రత్యక్ష దైవమే నాన్న..

‘‘మనం తినే తిండి.. కట్టుకునే బట్ట..

చదివే చదువు.. తనవల్లే వచ్చాయని ఒక్కరోజు కూడా

భావించని ప్రత్యక్ష దైవమే నాన్న''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

లోపాలను సరిచేస్తూ..

లోపాలను సరిచేస్తూ..

‘‘మనలో ఆనందాన్ని నింపి..

అల్లారుముద్దుగా పెంచి..

మనలోని లోపాలను సరిచేస్తూ..

మన భవితకు పునాదులు వేస్తూ..

మన గమ్యానికి దారి చూపేది నాన్న''

హ్యాపీ ఫాదర్స్ డే

దారితప్పకూడదన్న ఉద్దేశమే..

దారితప్పకూడదన్న ఉద్దేశమే..

‘‘అమ్మ దగ్గర ఉన్నంత ఫ్రీగా.. నాన్నతో ఉండలేము.

నాన్నంటే భయపడుతూ ఉంటాం.

ఏదైనా మాట్లాడినా 4 రకాలుగా ఆలోచిస్తాం..

అయితే మనం దారితప్పకూడదన్న ఉద్దేశమే నాన్నది‘‘

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

ఏ తండ్రికైనా సంతోషం

ఏ తండ్రికైనా సంతోషం

‘‘ జీవితంలో మనల్ని ముందుకు నడిపించి..

తాను మాత్రం వెనుక నుండి చేయూతనివ్వడమే..

ఏ తండ్రికైనా సంతోషం''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

కేవలం ఒక్క నాన్న..

కేవలం ఒక్క నాన్న..

‘‘బయటి ప్రపంచాన్ని పరిచయం చేసేది...

నలుగురితో ఎలా మెలగాలో నేర్పేది..

కేవలం ఒక్క నాన్న మాత్రమే''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

ఎప్పటికీ తూలి పడకుండా..

ఎప్పటికీ తూలి పడకుండా..

‘‘తప్పటడుగులు వేయకుండా..

ఎప్పటికీ తడబడకుండా..

మనం ఎన్నటికీ తూలి పడకుండా..

వెంటే ఉండేవాడు నాన్న''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

ఓడినప్పుడు మన భుజాన్ని తట్టి..

ఓడినప్పుడు మన భుజాన్ని తట్టి..

‘‘మనం గెలిచినప్పుడు అందరికీ చెప్పి..

మనం ఓడినప్పుడు మన భుజాన్ని తట్టి..

మళ్లీ గెలుస్తావులే అని ధైర్యం చెప్పేవాడే నాన్న''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

పెరిగి పెద్దయ్యే వరకు..

పెరిగి పెద్దయ్యే వరకు..

‘‘మనం పుట్టిన నాటి నుండి

పెరిగి పెద్దయ్యే వరకు మనల్ని తన

భుజాలపై మోస్తూ ఈ లోకాన్ని మొట్టమొదటగా చూపించేది ఒక్క నాన్నే''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

నీకు అండగా ఉండేవాడే నాన్న..

నీకు అండగా ఉండేవాడే నాన్న..

‘‘ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా..

ప్రపంచాన్ని సైతం ఎదిరించైనా..

నీకు అండగా ఉండేవాడే నాన్న''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

నాన్న ప్రేమను..

నాన్న ప్రేమను..

‘‘అమ్మ ప్రేమను కళ్లతో చూడగలం..

కానీ ఒక్క నాన్న ప్రేమను మాత్రమే..

కన్నీళ్లతోనే తెలుసుకోగలం''

హ్యాపీ ఫాదర్స్ డే..

మంచిని మెచ్చుకుంటూ..

మంచిని మెచ్చుకుంటూ..

‘‘నాన్నంటే మరచిపోలేని జ్ణాపకం..

ఎందుకంటే మన తప్పులను సరిచేస్తూ..

మనం చేసిన మంచి పనులను ఎప్పుడు మెచ్చుకుంటూ..

ప్రతి క్షణం మన ఎదుగుదలనే ఆకాంక్షిస్తాడు''

ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

నా తొలి నేస్తం..

నా తొలి నేస్తం..

‘‘ నా తొలి నేస్తం నాన్న..

నాకు తొలి అడుగు నేర్పింది నాన్న..

మన గెలుపును తనలో చూసుకునేవాడు నాన్న..

మన కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్చేవాడు నాన్న''

అలాంటి నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

English summary

Happy Father's Day 2022 Quotes, Wishes, Lines, Thoughts, Messages, Images, Greetings, Whatsapp Status in Telugu

Here we talking about father's day wishes, images, quotes, and Whatsapp status messages. Read on.
Desktop Bottom Promotion