For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Lunar Year 2021 :చైనీస్ న్యూ ఇయర్ లో చిత్రమైన విషయాలేంటో తెలుసా...

చైనా కొత్త సంవత్సరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ అంటే జనవరి 1వ తేదీ నుండి ప్రారంభమవుతుందని మనందరికీ తెలుసు. మన దేశంలో హిందూ క్యాలెండర్ ప్రకారం, ఉగాది సమయంలో అంటే మార్చి మాసంలో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

Happy Lunar Year 2021: All you need to know about Chinese New Year

అలా కొన్ని దేశాల్లో వారి ఆచారాలను, సంప్రదాయాలను బట్టి కొత్త సంవత్సరం మాసం, తేదీ మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలను ఫిబ్రవరి మాసంలో జరుపుకుంటారు.

Happy Lunar Year 2021: All you need to know about Chinese New Year

ఆసియాలోనే పెద్ద దేశంగా పేరుగాంచిన చైనాలో ఫిబ్రవరిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. కరోనా నేపథ్యంలో చైనీయులు సామాజిక దూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా చైనీయుల కొత్త సంవత్సరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

Vasant Panchami 2021 :చదువుల తల్లి అనుగ్రహం పొందాలంటే... సరస్వతీ దేవిని ఇలా పూజించండి..Vasant Panchami 2021 :చదువుల తల్లి అనుగ్రహం పొందాలంటే... సరస్వతీ దేవిని ఇలా పూజించండి..

చైనా న్యూ ఇయర్..

చైనా న్యూ ఇయర్..

చైనా దేశంలో చంద్రమానం ప్రకారం, ఫిబ్రవరి 12వ తేదీ నుండి న్యూ ఇయర్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆ దేశంలోని ప్రజలందరూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా వేడుకలను జరుపుకుంటారు. ఈ పండుగ తమ కుటుంబం యొక్క సమైక్యతను సూచిస్తుంది. ఈరోజున చైనాలో ప్రతి ఒక్కరికీ సెలవు ఉంటుంది.

లునార్ న్యూ ఇయర్ అంటే ఏమిటి?

లునార్ న్యూ ఇయర్ అంటే ఏమిటి?

చైనాలో చంద్ర మాన సంవత్సరం అంటే లూని సోలార్ క్యాలెండర్ల యొక్క మొదటి అమావాస్యను సూచిస్తుంది. ఇది అనేక తూర్పు ఆసియా దేశాలకు సాంప్రదాయకంగా ఉంది. ఇవి సూర్యుడు మరియు చంద్రులను బట్టి నిర్ణయించబడతాయి. ఈ చంద్ర నూతన సంవత్సరాన్ని వసంత ఉత్సవం అని కూడా పిలుస్తారు. 1949 సంవత్సరంలో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మావో జెడాంగ్ అధికారం చేపట్టిన తర్వాత ఈ పేరు ప్రజాదరణ పొందింది. ఈ సెలవురోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే.. లక్ ను ఆకర్షించడం మరియు తీసుకెళ్లడం.. దురద్రుష్టాన్ని దూరంగా ఉంచడం..

ఎప్పుడు జరుపుకుంటారు..

ఎప్పుడు జరుపుకుంటారు..

‘ఒక సౌర సంవత్సరం సూర్యుడిని కక్ష్యలోకి తీసుకునే సమయం 365 రోజులు పడుతుంది. అయితే చంద్ర సంవత్సరం లేదా చంద్రుని యొక్క 12 రాశిచక్రాలు సుమారు 354 రోజులు'. కాబట్టి అక్కడ ప్రతి ఏడాది నూతన సంవత్సరం వేర్వేరు రోజుల్లో వస్తుంది' అని న్యూయార్క్ టైమ్స్ వివరించింది. చైనాలో నూతన సంవత్సర వేడుకలను సుమారు రెండు వారాల పాటు జరుపుకుంటారు. ఇది ‘పునఃకలయిక కిందు'అని పిలుచుకునే కుటుంబ విందుతో ప్రారంభమవుతుంది.

జ్యోతిష్కుడు చెప్పినదానిపై మీరు ఏమి విశ్వసించగలరు? ఏమి నమ్మకూడదు? జ్యోతిషశాస్త్రం ఏమి చెబుతుందో చూడండి?జ్యోతిష్కుడు చెప్పినదానిపై మీరు ఏమి విశ్వసించగలరు? ఏమి నమ్మకూడదు? జ్యోతిషశాస్త్రం ఏమి చెబుతుందో చూడండి?

ఎక్కడెక్కడ జరుపుకుంటారు..

ఎక్కడెక్కడ జరుపుకుంటారు..

ఈ చంద్ర నూతన సంవత్సర వేడుకలను చైనాతో పాటు దక్షిణ కొరియా, సింగపూర్, వియత్నాం మరియు టిబెట్ సహా పలు ఆసియా దేశాలలో జరుపుకుంటారు. టిబెట్ లో చంద్ర నూతన సంవత్సరం(Lunar New Year)ను లోసార్ అని పిలుస్తారు. వియత్నాంలో దీన్ని టోట్ అని పిలుస్తారు.

ఈ అక్షరంతో..

ఈ అక్షరంతో..

చైనీస్ లో 'fu' అనే అక్షరం లక్కీని సూచిస్తుంది. డైమండ్ షేప్ లో ఒక చదరపు ఎర్రని కాగితంపై పెయింట్ చేసిన కాలిగ్రాఫి పాత్ర చంద్ర సంవత్సరంలో తలకిందులుగా వేలాడదీయబడుతుంది.

ఎలా జరుపుకుంటారు..

ఎలా జరుపుకుంటారు..

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో స్ప్రింగ్ ఫెస్టివల్ 15 రోజుల సెలవు దొరుకుతుంది. ఆసియా దేశాలలో చంద్ర నూతన సంవత్సర సంప్రదాయాలు, ప్రసిద్ధ ‘డ్రాగన్ డ్యాన్స్' ‘లయన్ డ్యాన్స్' మరియు డబ్బు పంపిణీ జరుగుతుంది. ఇదే సమయంలో‘నియాన్'అనే పురాతన రాక్షసుడిని దూరం చేయడానికి ఫైర్ క్రాకర్లు మరియు బాణసంచా ప్రదర్శనలు కూడా చాలా సాధారణంగా జరుగుతాయి.

English summary

Happy Lunar Year 2021: All you need to know about Chinese New Year

Here we are talking about the Happy Lunar Year 2021 : All you need to know about Chinese new year. Read on
Story first published:Saturday, February 13, 2021, 15:56 [IST]
Desktop Bottom Promotion