For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అహల్య నిజంగా అమాయకురాలేనా? ఇంద్రుడే కావాలని ఆ పని చేశాడా?

|

వాల్మీకి రామాయణంలో అహల్య ప్రస్తావన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భర్త గౌతమ మహర్షి శాపంతో రాయిగా మారిన అహల్య, శ్రీరాముడి పాదస్పర్శతో తిరిగి స్త్రీ రూపం ధరించినట్లు అనేక కథనాలు ఉన్నాయి. అయితే అహల్య కథ మాత్రం చాలా భిన్నంగా అనిపిస్తుంది. బ్రహ్మదేవుని మానసపుత్రిక అయిన అహల్య అత్యంత అందమైన అందాల రాశి.

ఈమెను చూసిన దేవుళ్లలో చాలా మంది చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని అనుకునేవారట. అయితే ముల్లోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోవడానికి అర్హులని బ్రహ్మ ప్రకటిస్తాడు.

ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు తన శక్తులన్నీ ఉపయోగించి త్రిలోకాలను తిరిగి వచ్చి అహల్యను తనకు ఇచ్చి వివాహం జరిపించమని కోరతాడు. అయితే అదే సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడి కంటే ముందే గౌతముడు త్రిలోకాలను తిరిగి వచ్చాడని చెబుతాడు. దీంతో అహల్య తనకు భార్యగా దక్కలేదన్న దురుద్దేశంతో దేవేంద్రుడు గౌతముని రూపంలో వచ్చి తన కోరికను తీర్చుకున్నాడని చాలా మంది చెబుతారు. కానీ ఇది నిజం కాదని కొందరు చెబుతారు. ఇందులో ఏది నిజమో ఆ పరమాత్ముడికే తెలియాలి...

అందాల అప్సరస...

అందాల అప్సరస...

అహల్య ఓ అందాల రాశి.. సుగుణాల పోగు చేసుకున్న వనిత. ఈమె గౌతమ మహర్షికి సేవలు చేస్తూ, ఆశ్రమ విధులను నిర్వహించేందుకు చతుర్ముఖుడు ఏర్పాటు చేసిన వ్యక్తి. అహల్యను మహర్షి ఆశ్రమంలో నియమించినప్పుడు ఎవరికీ ఎలాంటి ఉద్దేశమూ లేదు. కానీ, ఆమె ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా, నిస్వార్థంగా, నిజాయితీగా సేవ చేయడంతో అహల్యే గౌతమునికి తగిన భార్య అనుకున్నాడు బ్రహ్మదేవుడు.

అహల్యను భార్యగా..

అహల్యను భార్యగా..

గౌతమ మహర్షి ధ్యానం చేసుకుంటుండగా ఓ రోజు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ‘‘గౌతమా! నేను నీకు ఎన్నో పరీక్షలు పెట్టాను. అన్నింటిలో నీవు విజయం సాధించావు. ప్రసవంలో ఉన్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే అది భూ ప్రదక్షిణతో సమానం. అనేక పుణ్యకార్యాలతో బాటు ఈ పని కూడా చేశావు. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నావు. అందుకే నీకు గొప్ప అనుకూలవతి అయిన అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నా.. ఆమెను స్వీకరించి నువ్వు ధన్యుడివి అయిపో‘‘ అంటూ ఆశీర్వదించడమే కాకుండా, స్వయంగా ఆ దేవుడే దగ్గరుండి గౌతమ, అహల్య వివాహం జరిపించాడు. వారిని వనదేవతలు కూడా దీవించాయి.

దేవేంద్రుడికి భయమేసింది..

దేవేంద్రుడికి భయమేసింది..

ఆ విషయం తెలుసుకున్న దేవేంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో అన్న భయం వేస్తుంది. దీంతో దేవతల సహాయం కోరతాడు. అందుకే వారు సరే అంటారు. దేవతలకు మేలు చేస్తున్నా అనే వంకతో అహల్య దగ్గరికి మారు వేషంతో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

అసలు ఉద్దేశ్యం వేరు..

అసలు ఉద్దేశ్యం వేరు..

ఇంద్రుడు అందరికీ గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేయడం అని చెప్పాడు కానీ, అతడి అసలు ఉద్దేశ్యం అహల్యను దక్కించుకోవడం. అందుకే కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరతాడు. ఆరోజు తెల్లవారకముందే, ఆ కోడి కూసింది.

బ్రహ్మముహుర్తం అని భావించి..

బ్రహ్మముహుర్తం అని భావించి..

అంతే గౌతమ మహర్షి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. అప్పుడే బ్రహ్మముహుర్తం అని భావించి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేందుకు.. పవిత్ర జలాన్ని నది నుండి తెచ్చేందుకు బయలుదేరాడు. అప్పటికి ఇంకా కారుమబ్బులు కమ్ముకునే ఉన్నాయి. ఎక్కడా వెలుతురు అనేదే లేదు.

వెనక్కి వచ్చాడు..

వెనక్కి వచ్చాడు..

కోడి కూసినా ఇంకా తెల్లవారలేదని అర్థం చేసుకున్న గౌతమ మహర్షి. మళ్లీ వెంటనే వెనక్కి తిరిగి వెళ్లాడు. అప్పటికే దేవేంద్రుడు తన రూపంలో అహల్యతో కనిపించాడు. ‘‘ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా.. తన వేషం వేసుకుని తన భార్యను లోబరచుకోదలచాడా? అని గౌతముడు ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో దేవేంద్రుడు భయంతో, అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు.

అహల్య తప్పు లేకున్నా..

అహల్య తప్పు లేకున్నా..

ఇక్కడ అహల్య తప్పు ఏమీ లేకున్నా, ఇంద్రుడితో పక్కన కనిపించడంతో గౌతముడు ఆగ్రహంతో.. క్షణికావేశంలో ఆమెను కూడా నిందించాడు. ‘‘నువ్వు వెంటనే రాయిగా మారిపో‘‘ అంటూ శపించాడు. కానీ వెంటనే తన దివ్యదృష్టితో అసలేం జరిగిందో తెలిసి పశ్చాత్తాపడ్డాడు. రాముడి పాదం తాకినప్పుడు‘‘రాతివి, నాతివి(రాయి స్త్రీగా మారడం) మారతావు‘‘ అని శాపవిమోచనం ప్రసాదించాడు.

ఆమెకు పురుష వ్యామోహం లేదు..

ఆమెకు పురుష వ్యామోహం లేదు..

అహల్య ఎంతో సాత్వికురాలు. ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సరసాలు, సల్లాపాలు ఆడినప్పుడు, భర్తే అనుకుని మురిసిపోయింది తప్ప, ఆమెకు ఇతర పురుషుల పట్ల కోరికలు, వ్యామోహనం అనేవి కలలో కూడా లేవు. అందుకే భర్త తొందరపాటుతో శాపం పెట్టినా ఆమె కోపగించుకోలేదు. ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారు అని అర్థం చేసుకుంది. అలా శాపగ్రస్తురాలై, శ్రీరాముడి రాక కోసం ఎదురుచూస్తూ కాలం గడిపింది. చివరికి రాముని పాదాలతో పునీతమై ‘‘రాతిని నాతివిగా మార్చారావు రామా‘‘ అంటూ రాముడి కాళ్లను నమస్కరించి అహల్య.

English summary

How can Indra be a God after what he had done with ahalya?

Here we talking how can indra be a god after what he had done with ahalya?. Read on
Story first published: Wednesday, March 11, 2020, 15:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more