For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు

గరుడ పురాణం ప్రకారం ఒకరి జీవితంలోని దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

గరుడ పురాణం 18 మహాపురాణాల్లో ఒకటి. ఇది విశ్వోద్భవం, వంశవృక్షం, పురాణాలు, ఆలయ నిర్మాణం,తీర్థయాత్ర సహా ఇతర ఎన్నో విషయాల గురించి చెప్పే పురాణం. ఇది మహావిష్ణువు, గరుత్మంతుడిపై ఆధారపడి ఉంటుంది. జీవితం గురించి, మరణం గురించి అనేక గొప్ప సత్యాలను బోధిస్తుంది. గరుడ పురాణంలో నరకంలో వేసే శిక్షల గురించి ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ ఇంకా ఎన్నో విషయాల గురించి గరుడ పురాణంలో వివరించారు.

How to turn misfortune into fortune according to Garuda Purana in Telugu

వేద వ్యాసుడు గరుడ పురాణాన్ని రచించాడు. మనిషి చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది. మనిషి చేసిన పాపాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయనే పలు రకాల ప్రశ్నలను గరుత్మంతుడు మహావిష్ణువు అడగ్గా ఆయన సమాధానాలు చెప్పాడు. గరుత్మంతుడికి చెప్పడం వల్లే దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది.

గరుడ పురాణం ప్రకారం ఒకరి జీవితంలోని దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయిGaruda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్ని అందిస్తాయి

మన విధిని మనమే రాసుకోవడం:

మన విధిని మనమే రాసుకోవడం:

మనమందరం జీవితంలో ఏదో సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. కొందరు డబ్బు సంపాదించాలని, వ్యాపారం చేయాలని, రాజకీయంలో గెలుపొందాలని, క్రీడలో పతకం సాధించాలని కష్టపడుతుంటాం. అయితే అందులో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని ఏమీ లేదు. ఒక వ్యక్తి యొక్క విధి అతనికి చాలా సార్లు అనుకూలంగా ఉండకపోవడమే దీనికి కారణం. అటువంటి పరిస్థితుల్లో కర్మ చేయడం ద్వారా విధిని మార్చుకోవాలి.

మీరు జీవితంలో విజయం సాధించాలంటే, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే ముందుగా పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి. పరిశుభ్రతగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివాసం ఏర్పరచుకుంటుందని గరుడ పురాణంలో ఉంది.

పరిశుభ్రత అంటే ప్రదేశానికి, శరీరానికి సంబంధించినది. శరీరం, ఉండే ప్రాంతం శుభ్రంగా ఉంటే లక్ష్మీ దేవి ఆనందిస్తుంది. లక్ష్మీ దేవి కటాక్షం కోసం సిద్ధమవుతున్నప్పుడు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత పూజ ప్రారంభించాలి. ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళ ఇంటిని శుభ్రం చేసుకుంటే లక్ష్మీ దేవి ఆనందిస్తుంది.

ఈ హనుమాన్ మంత్రం శనిదోషాన్ని తొలగిస్తుంది, ఎంతో శక్తివంతమైనదిఈ హనుమాన్ మంత్రం శనిదోషాన్ని తొలగిస్తుంది, ఎంతో శక్తివంతమైనది

దానధర్మాలు, సత్కార్యాలు:

దానధర్మాలు, సత్కార్యాలు:

దానధర్మాలు, సత్కార్యాలు చేయడం వల్ల మన విధిని మనం మార్చుకోవచ్చు. మంచి కర్మలు అంటే ఇతరులకు అందులోనూ ముఖ్యంగా అవసరం ఉన్నవారికి సాయం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించడం వంటి దయతో కూడిన చర్యలు చేస్తుండాలి.

Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..

అబద్ధాలు చెప్పొద్దు, దొంగలించొద్దు:

అబద్ధాలు చెప్పొద్దు, దొంగలించొద్దు:

అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం పురాణాల ప్రకారం పాపకార్యాలు. ఎలాంటి పరిస్థితిలోనూ ఇతరులతో అబద్ధాలు చెప్పకూడదు. వేరొకరి వస్తువులను దొంగలించకూడదు. జీవితంలో నీతితో, నిజాయితీతో ఉండాలి. ఇతరుల పట్ల దయ చూపాలి. పెద్ద వారిని గౌరవించాలి. చిన్న వారిని ప్రేమించాలి. ఇతరులకు హాని కలిగించే చర్యలు చేయకూడదు. నిజాలు మాత్రమే చెప్పాలి.

వీటిని పాటించడం వల్ల దురదృష్ట జీవితాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చని గరుడ పురాణం చెబుతోంది. భక్తి, దానం, సత్కార్యం, మంచి కర్మ, అబద్ధాలు చెప్పకపోవడం, దొంగలించకపోవడం, ఇతరుల పట్ల దయతో ఉండటం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి వల్ల మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

English summary

How to turn misfortune into fortune according to Garuda Purana in Telugu

read this to know How to turn misfortune into fortune according to Garuda Purana in Telugu
Story first published:Saturday, January 28, 2023, 16:33 [IST]
Desktop Bottom Promotion