For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రేపిస్టులైన నలుగురిని ఎన్ కౌంటర్లో లేపేయడంపై పోలీసులను ప్రశంసిస్తూ ట్విట్టర్లో ట్వీట్ల మోత...

ఎన్ కౌంటర్ విషయం తెలుసుకున్న నెటిజన్లు, ప్రజలు తమ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఏ మాత్రం సిగ్గు పడలేదు.

|

హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా మహిళల రక్షణపై మళ్లీ అభద్రతా నెలకొన్నట్టు అనిపించింది. నిర్భయ ఘటనను మరోసారి గుర్తుకు చేస్తూ అందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. పోలీసులను, రాజకీయ నాయకులను, కోర్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Police Encounter

ఇన్ని రోజులు కేసుకు సంబంధించి నిందితులను విచారించిన పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున అదే సీన్ రీ కన్ స్ట్రక్షన్ పేరిట ఆ నలుగురిని, 'దిషా'ను ఎక్కడ అయితే రేప్ చేశారో అక్కడే ఆ స్పాట్ లోనే ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై యావత్ భారతదేశం ముక్తకంఠంతో పోలీసులకు అభినందనలు తెలియజేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రతిఒక్కరూ తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలు, అన్ని పార్టీల నాయకులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు సైతం జరుపుకుంటున్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో మీరే చూడండి...

32 వేల అత్యాచార కేసులు...

మన దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సి ఆర్ బి) ప్రకారం ప్రతిరోజూ 100 లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్క 2017లోనే 32 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి. అయితే మహిళలు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించి తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో చాలా చోట్ల ఇంకా ఫిర్యాదులు చేయలేదు.

నవంబర్ 28వ తేదీన..

గత నెల 28వ తేదీన వెటర్నరీ డాక్టర్ తన ఇంటి నుండి షాద్ నగర్ టోల్ ప్లాజా వద్ద బైక్ పార్కు చేసి డ్యూటీ నిమిత్తం వెళ్లినప్పుడు అక్కడే కాపుగాచిన ఆ నలుగురు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమెను చంపేశారు. అయితే పోలీసులు ఆ నేరస్తులను 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ప్రజలు వారిని ఆలస్యం చేయకుండా ఉరి తీయాలని ఆందోళనలు చేశారు.

రీ సీన్ కన్ స్ట్రక్షన్ పేరిట ఎన్ కౌంటర్...

ఎన్ కౌంటర్ విషయం తెలుసుకున్న నెటిజన్లు, ప్రజలు తమ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఏ మాత్రం సిగ్గు పడలేదు. తాము నిరాశ, కోపం, ద్వేషం వంటివి చూపామని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులను అభినందించారు.

సినీ తారల ట్వీట్లు..

టాలీవుడ్ సినిమా తారలు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, సమంత, అల్లుఅర్జున్ తో పాటు ఎందరో ప్రముఖులు ఈ కేసులో ‘దిషా‘కు న్యాయం జరిగిందన్నారు. పోలీసులకు తమ అభినందనలు తెలిపారు.

రియల్ లైఫ్ సింహా

ఓ నెటిజన్ ట్విట్టర్లో రియల్ లైఫ్ సింహాలంటే పోలీసులే అని ప్రశంసించాడు. ప్రసిద్ధ బాలీవుడ్ మూవీ క్యారెక్టర్ తర్వాత వారిని ‘రియల్ లైఫ్ సింహా‘ అని స్పష్టం చేశాడు.

గతంలో వరంగల్ లోనూ ఎన్ కౌంటర్..

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఓ నీచుడు స్వప్నిక అనే మహిళపై యాసిడ్ పోసిన కేసులోనూ అప్పుడు ఎస్ పిగా పని చేస్తున్న సజ్జనార్ ఇదే విధంగా ఎన్ కౌంటర్ చేశారు.

English summary

Hyderabad Rapists Shot Dead In Police Encounter: Twitterati React

After the inhuman rape incident that took place last week in Hyderabad, people started asking for a speedy trial and justice for the rape victim. Now people are delighted after knowing that the victims are shot dead.
Desktop Bottom Promotion