For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Independence Day 2020 : ఈ పంద్రాగస్టున ఈ పనులు చేస్తే జీవితాంతం గుర్తుంటాయి...!

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయులు ఎక్కువగా ఏ పనులు చేస్తారో తెలుసుకుందాం.

|

ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి పొందిన మన దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఎందరో గొప్ప నాయకుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సిద్ధమయ్యారు.

Independence Day : What Most Indians Do Exactly on this day

కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సంవత్సరం ఘనంగా సంబరాలు జరుపుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి సమయంలోనే మీరు ప్రతిరోజూ లాగే ఈ రోజు కూడా గడిచిపోతుందని ఫీలవుతుంటే.. ఈ ఇండిపెండెన్స్ డే సమయంలో ఏదైనా కొత్తగా చేయొచ్చు.

Independence Day : What Most Indians Do Exactly on this day

అయితే సడెన్ గా అంటే ఎవ్వరికైనా ఐడియా రావాలంటే కష్టమే. అందుకే మీరు చేయాల్సిన కొన్ని పనుల గురించి కొన్ని చిట్కాలను మేం చెప్పబోతున్నాం. మీరు ఈ పనులు చేస్తే కచ్చితంగా జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు.

Independence Day : What Most Indians Do Exactly on this day

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీరు ఏయే పనులు చేస్తే మీకు ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా మారేందుకు ఏయే పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

Independence Day 2020 : పంద్రాగస్టున ఫ్యామిలీతో సరదాగా ఈ పనులు చేయండి...Independence Day 2020 : పంద్రాగస్టున ఫ్యామిలీతో సరదాగా ఈ పనులు చేయండి...

వాట్సాప్, ఫేస్ బుక్ లో మీ డిపిలను మార్చండి..

వాట్సాప్, ఫేస్ బుక్ లో మీ డిపిలను మార్చండి..

ఆగస్టు 15వ తేదీ అంటే మన దేశంలో చాలా మందికి దేశభక్తి ఉప్పొంగుతుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దేశభక్తిని విభిన్నంగా చాటేందుకు ప్రయత్నిస్తారు. మీరు కూడా మీ వాట్సాప్, ఫేస్ బుక్ తో సహా ఇతర అకౌంట్ల డిపిలకు జాతీయ జెండా చిత్రాన్ని జత చేయండి.

సందేశాలను పంపండి..

సందేశాలను పంపండి..

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది బయటకు వెళ్లే పరిస్థితులు కనబడటం లేదు కాబట్టి, మీరు సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు, బంధువులకు దేశభక్తి సూక్తులు, గొప్ప నాయకుల ప్రేరణ కలిగించే మాటలతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి.

దేశ భక్తి సినిమాలు చూడండి..

దేశ భక్తి సినిమాలు చూడండి..

మనలో చాలా మంది ప్రతిరోజూ ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లను చూస్తుంటాం. అయితే ఈరోజున మీ టివిలో ప్రసారం చేసే దేశభక్తి సినిమాలను చూడండి. వీటిని మాత్రం అస్సలు బోర్ ఫీలవ్వకండి.

Independence Day 2020 : పంద్రాగస్టు విషెస్ చెప్పేయండిలా...Independence Day 2020 : పంద్రాగస్టు విషెస్ చెప్పేయండిలా...

చిన్ననాటి స్కూలుకు వెళ్లండి..

చిన్ననాటి స్కూలుకు వెళ్లండి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ లాక్ డౌన్ ప్రారంభం అయ్యింది కాబట్టి, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ.. శానిటైజర్ ఉపయోగించి మీ చిన్ననాటి స్కూలుకు వెళ్లండి. ఎందుకంటే ఎవ్వరికైనా స్కూల్ మెమొరీస్ జీవితాంతం గుర్తుండిపోతాయి. ఎన్ని సంవత్సరాలు అయినా, పాత స్నేహితులు, స్కూలులో జరిగిన వివిధ సంఘటనలను గుర్తుంచుకుంటారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం జరిగినప్పుడల్లా మీకు మీ చిన్ననాటి స్కూల్ కచ్చితంగా గుర్తుకొస్తుంది. అయితే ఎవరికైతే మీ సొంత పాఠశాలకు వెళ్లడం కుదరతో మీ ఇంటి దగ్గర్లోనే ఎక్కడైతే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయో అక్కడ జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రయత్నించండి. ఇది జీవితాంత మీకు తప్పకుండా గుర్తుండిపోతుంది.

పతంగులు ఎగరేయండి..

పతంగులు ఎగరేయండి..

మన దేశంలో సాధారణంగా పొంగల్ (సంక్రాంతి) సమయంలో పతంగులను దేశవ్యాప్తంగా ఎగరేస్తారు. అయితే వీధుల్లో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకునే సమయంలో కూడా మీరు గాలిపటాలను ఎగరేయొచ్చు. ఈరోజు మీరు, మీ పిల్లల చేత గాలిపటాలు ఎగరేయండి. దీంతో వాళ్లు మరింత ఆనందిస్తారు.

Independence Day 2020: స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకోండిIndependence Day 2020: స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకోండి

కథలు చదవండి..

కథలు చదవండి..

ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున భగత్ సింగ్, రాజ్ గురు, చంద్ర శేఖర్ ఆజాద్, సుఖ్ దేవ్ వంటి స్వేచ్ఛా విప్లవకారుల జీవితాలు, పోరాటాల గురించి చదవండి. అంతేకాదు మీ పిల్లలకు వారి గురించి వివరించండి.

English summary

Independence Day : What Most Indians Do Exactly on this day

There are some people who are good samaritan and have immense love for their motherland. On 15th August, this year, in 2020, India will celebrate its 74th Independence Day.
Story first published:Friday, August 14, 2020, 17:46 [IST]
Desktop Bottom Promotion