For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భయంకరమైన వ్యాధులతో పోరాడి విజయం సాధించిన సెలబ్రిటీస్ గురించి మీకు తెలుసా...

|

వారంతా వెండి తెరపైనా, క్రీడా మైదానంలో అభిమానులను నిత్యం అలరిస్తూ ఉంటారు. అయితే అందుకోసం వారు తెర వెనుక పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారి సమస్యలు బయటకు కనబడనీయకుండా స్క్రీన్ పై తమ హావాభావాలతో అభిమానులను అనునిత్యం ఆకట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తుంటారు.

అయితే వారు అలాంటి సమస్యలను అధిగమించడం అనేది అంత సులభం కాదని వారికి తెలుసు. అయితే వారు అలాంటప్పుడే చాలా ధైర్యంగా ఉంటారు. పట్టుదలతో శ్రమించి తమ ఒత్తిడిని జయిస్తారు. అలా భయంకరమైన రోగాల బారి నుండి బయటపడిన భారతీయ ప్రముఖులెవరో.. అందరికీ ఆదర్శంగా ఎలా నిలిచారో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

యువరాజ్ సింగ్ : స్టేజ్ 1 క్యాన్సర్..

యువరాజ్ సింగ్ : స్టేజ్ 1 క్యాన్సర్..

2007 ట20 వరల్డ్ కప్ లో, 2011 ఐసిసి వన్డే ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ అద్భుతంగా ఆడిన తీరు అందరికీ ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉంటుంది. ముఖ్యంగా బ్రాడ్ బౌలింగులో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదేసిన మన యువరాజ్ తన సత్తా ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ దురదృష్టవశాత్తు క్యాన్సర్ బారిన పడ్డాడు. రక్తంతో కూడిన వాంతులు, వికారం మరియు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొన్నాడు. అంతే కాదు అతని ఎడమ ఊపిరితిత్తులలో స్టేజ్ 1 క్యాన్సర్ కణతి ఉన్నట్లు కూడా నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స కోసం అమెరికాకు వెళ్లాడు. అతి క్లిష్టమైన కీమోథెరపీ చేయించుకుని 2012లో మన దేశానికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ట20 ప్రపంచకప్ లోనూ పునరాగమనం చేశాడు. అలా ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారి నుండి విజయం సాధించి అందరికీ ప్రేరణగా నిలిచాడు.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ పెద్ద దిక్కు అమితాబ్ బచ్చన్ కూడా 1982లో సినిమాకు సంబంధించిన షూటింగులో చాలా రక్తాన్ని కోల్పోయాడు. అప్పుడు ప్లీహము చీలిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. అప్పుడే వైద్యులు అతను చనిపోయాడు అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కొన్ని నెలల తర్వాత దాని నుండి పూర్తిగా కోలుకున్నాడు. అంతేకాదు ఆ మరుసటి సంవత్సరమే తన సినిమా షూటింగును కూడా ప్రారంభించాడు. ఇదొక్కటే కాదు 1984లో మళ్లీ అతనికి మస్తెనియా గ్రావిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది కూడా ఈ బాలీవుడ్ మెగాస్టార్ ని శారీరకంగా మరియు మానసికంగా చాలా బలహీనపరిచింది. అయితే తను నిరాశపడకుండా మెగాస్టార్ లాగే ఈ ఒత్తిడిని అధిగమించాడు.

రంగీలా భామ మనీషా కోయిరాలా..

రంగీలా భామ మనీషా కోయిరాలా..

మీ అందరికీ రంగీల భామ గుర్తుంది కదా. అదేనండి తెలుగులో అర్జున్ తో కలిసి ఒకే ఒక్కడు సినిమాలో నటించింది. ఆ అందాల భామకు అండాశయానికి సంబంధించిన క్యాన్సర్ ఉందని తేలింది. ఈ హీరోయిన్ 2012లో దీనికి సంబంధించిన క్యాన్సర్ చేయించుకుంది. దీని కోసం చాలా కాలం పోరాడి, ఒత్తిడిని జయించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది.

హృతిక్ రోషన్..

హృతిక్ రోషన్..

తెలుగులో క్రిష్ గా బాగా ఫేమస్ అయిన హీరో హృతిక్ రోషన్. ఈ హీరోకి ఏకంగా మెదడుకు సంబంధించిన వ్యాధి వచ్చింది. 2013 జులై నెలలో ఈ వ్యాధికి చికిత్స చేయించుకున్నారు. విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తవ్వడంతో ‘‘నేను అద్భుతంగా ఉన్నాను. నా మెదడులోని రంధ్రంతో కూడా నా ఆత్మ చెక్కు చెదరకుండా ఉంది‘‘ అని హృతిక్ రోషన్ క్రిష్ -3 షూటింగ్ సమయంలో అన్నారు. ఇది అతని ఆత్మవిశ్వాసం ఎంత బలమైనదో తెలియజేస్తుంది.

సల్మాన్ ఖాన్..

సల్మాన్ ఖాన్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖం మరియు దవడ వంటి తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. ఈ సూపర్ స్టార్ 2011లో తనకు ట్రిజెమినల్ న్యూరల్జియా ఉనట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితిని తట్టుకోవడం చాలా కష్టం. ఈ నొప్పి కారణంగా అతను అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. కానీ అతని దినచర్యలో మార్పులతో ఇప్పటికీ అసలు సిసలు బాడీగార్డు, కండలవీరుడుగా లైఫ్ ను సాఫీగా ఎంజాయ్ చేస్తున్నాడు.

రజనీ కాంత్..

రజనీ కాంత్..

సూపర్ స్టార్ రజనీకాంత్ 2011లో 61 ఏళ్ల వయసులో తీవ్రమైన వ్యాధితో ఐసియులో చేరాడు. అతను తీవ్రమైన అలసటలో బాధపడ్డాడు. అంతేకాదు చికిత్స కోసం అప్పుడు సింగపూర్ కూడా వెళ్లాడు. అయితే అతను కూడా అచ్చం సినిమాల్లో చూపించిన మాదిరిగానే తన సమస్య నుండి బయటపడ్డాడు.

బాలీవుడ్ బాద్ షా..

బాలీవుడ్ బాద్ షా..

బాలీవుడ్ బాద్ షా, డాన్ అని షారుఖ్ ఖాన్ ను అందరూ పిలుస్తుంటారు. అంతే కాదు ఈ కింగ్ ఖాన్ ను కింగ్ ఆఫ్ సర్జరీస్ అని కూడా పిలుస్తారు. ఈ హీరో పక్కటెముకలు, చీలమండ, మోకాలు, మెడ, కన్ను మరియు భుజంతో సహా 25 సంవత్సరాలలో 8 ఆపరేషన్లు చేయించుకున్నాడు. బహుశా ఇన్ని సర్జరీలు ఇంతవరకు ఏ సెలబ్రిటీ కూడా చేయించుకోలేదు.

సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్ ఫిబ్రవరి 2007లో ఛాతీ నొప్పులతో బాధపడుతూ లీలావతి ఆసుప్రతిలో చేరారు. ఇది చిన్న గుండెపోటు అని డాక్టర్లు కూడా నిర్ధారించారు. అయితే బాలీవుడ్ ఖాన్ అతి తక్కువ సమయంలోనే తిరిగి యధాతథ స్థితికి చేరుకున్నాడు. అయితే అతనికి గుండె నొప్పి అనేది వంశపారంపర్యంగా ఉంది.

ముంతాజ్..

ముంతాజ్..

ప్రముఖ హీరోయిన్ ముంతాజ్ ఎంత అందంగా ఉండేదో అప్పటి తరానికి బాగా తెలుసు. ఈ బాలీవుడ్ అందాల భామ కూడా 54 సంవత్సరాల వయసులో రొమ్ము క్యాన్సర్ తో బాధపడింది. ఆమె ఈ వ్యాధి నుండి బయటపడేందుకు 6 కిమోథెరపీలు మరియు 35 రేడియేషన్ల తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంది. ‘‘నాతో మరణం కూడా పోరాడాల్సి ఉంటుంది. నేను అంత తేలికగా లొంగను‘‘ అని ఆపరేషన్ తర్వాత చెప్పింది. ఇందుకోసం ఆమె చాలా పట్టుదలగా ఉండేది.

అనురాగ్ బసు..

అనురాగ్ బసు..

హిందీ బిజినెస్ మ్యాన్ దర్శకుడు అనురాగ్ బసు క్యాన్సర్ వంటి భయంకరమైన రోగంతో బాధపడ్డాడు. 2004లో ఇతనికి ఈ వ్యాధి తీవ్రమై ఇతను బతికే అవకాశాలు సగమే ఉన్నాయని కూడా తేల్చారు. అయితే అలాంటి తీవ్రమైన వ్యాధితో బాధపడే ఆయన తిరిగి సైనికుడిలా సిద్ధమయ్యాడు. తర్వాత మంచి సినిమాలను తీశారు.

లిసా రే..

లిసా రే..

ప్రముఖ నటుడు మరియు మోడల్ లిసా రే మైలోమా అనే వ్యాధితో బాధపడుతుండేవాడు. మైలోమా అంటే ఎముక మజ్జలోని ప్లాస్మా కణాలకు సంబంధించిన క్యాన్సర్. ఇది చాలా అరుదైన వ్యాధి. ఇది వేలలో కొందరికి వస్తుంది. అయితే ఈ నటికి ఈ వ్యాధి నుంచి ఎలాంటి ఆందోళన చెందలేదు. అయితే ఈ వ్యాధి ఈమె కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఎందుకంటే ఈమె చాలా ధైర్యంగా దీన్ని ఎదుర్కొంది.

English summary

Indian Celebrities who battled serious illness and came out on top

Here are the indian celebrities who battled serious illness and came out on top. Take a look
Story first published: Monday, February 3, 2020, 13:10 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more