For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత క్రికెట్లోకి రాకముందు పేదవారిగా ఉన్న క్రికెటర్లు ఎవరో తెలుసా..

|

ఏదైనా ఒక రంగంలో అభివృద్ధి చెందుతూ విజయాన్ని ఎవరైనా సులువుగా సాధిస్తారు. కానీ క్రీడా రంగంలో అలా కాదు. అనేక అడ్డంకులను అధిగమించాలి. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి. ముఖ్యంగా భారత క్రికెట్లో ఇది మరీ కష్టం. అలాంటి కష్టాలన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతగానో శ్రమించాలి. అలా శ్రమించిన వారినే విజయం వరిస్తుంది. ఇక విషయానికొస్తే భారత క్రికెట్ జట్టులోకి రాక ముందు పేదరికంతో ఇబ్బందులు పడ్డ కొందరు క్రికెటర్ల గురించి మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మహేంద్ర సింగ్ ధోనీ..

మహేంద్ర సింగ్ ధోనీ..

భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోనీ ఒక విజయవంతమైన సారథిగా చరిత్రలో నిలిచిపోనున్నాడు. ధోనీకి విజయం ఊరికే రాలేదు. దీని వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది. క్రికెట్లోకి రాక ముందు ధోనీ కష్టాలు అనుభవించాడు. తొలుత ఫుట్ బాల్ కీపర్ గా ఉన్న ధోనీ తన మాస్టర్ సలహా మేరకు క్రికెట్ వికెట్ కీపర్ గా మారాడు. జార్ఖండ్ వంటి చిన్న రాష్ట్రం తరపున వచ్చాడనో, లేదా ఇంకేదో కారణం వల్లనో ధోనీని మొదట్లో భారత క్రికెట్ జట్టుకు ఎంపిక చేయలేదు. అయినా అతను మొక్కవోని ధైర్యంతో తీవ్ర సాధన చేశాడు. అపుడే రైల్వే టికెట్ కలెక్టర్ గా అవకాశమొచ్చింది. అతనికి నెలకు కేవలం మూడు వేల రూపాయల వేతనం వచ్చేది. ఆ వచ్చిన కొద్దిపాటి జీతంలోనే చిన్న గదిని అద్దెకు తీసుకుని ఒక స్నేహితుడితో కలిసి జీవించాడు. అనంతరం భారత జట్టుకు ఎంపికయ్యాడు. అంతే ఇక అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు. కెప్టెన్ గా మారి తొలి ట20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్ ను భారత జట్టుకు అందించాడు. అప్పటినుండి ధోనీ ఆస్తులు కూడా అమాంతం పెరుగుతూ వెళ్లాయి. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ధనవంతుల్లో ధోనీ కూడా ఒకరు.

రోహిత్ శర్మ..

రోహిత్ శర్మ..

భారత జట్టు డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ చిన్నతనంలో చాలా పేదరికాన్ని అనుభవించాడు. అది ఎంతలా అంటే చిన్నప్పుడు వారి తల్లిదండ్రుల దగ్గర కుటుంబ పోషణకు సరిపడే డబ్బు కూడా లేకపోవడంతో రోహిత్ తన అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఇంట్లో పెరిగాడు. అతనికి క్రికెట్ పట్ల ఆసక్తిని గమనించిన అతని కోచ్ రోహిత్ కు ఆర్థికంగా సహాయం చేశాడు. అంతేకాదు రోహిత్ ను స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ చేర్పించాడు. తర్వాత రోహిత్ శర్మ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం విధ్వంసకర బ్యాట్స్ మెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. అంతేకాదు ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో కూడా అధిక పరుగులు సాధించాడు.

రవీంద్ర జడేజా..

రవీంద్ర జడేజా..

భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా మంచిపేరు సంపాదించుకున్నాడు రవీంద్ర జడేజా. జడేజా పేద కుటుంబం నుండి భారత క్రికెట్ జట్టులోకి అడుగు పెట్టాడు. అతని తండ్రి వాచ్ మెన్. తన కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్ జాబ్ కూడా చేశాడు. పని అయిపోయిన వెంటనే క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అలా జడేజా భారత క్రికెట్ జట్టులోకి వచ్చి స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. ఇటీవల వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో సైతం అర్ధసెంచరీ సాధించి అందరి మన్ననలు అందుకున్నాడు.

భువనేశ్వర్ కుమార్..

భువనేశ్వర్ కుమార్..

భారత జట్టు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ది కూడా చాలా పేద కుటుంబం. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జన్మించిన భువనేశ్వర్ కుమార్ కు చిన్నతనంలో సరైన షూ కొనుక్కునేందుకు కూడా డబ్బులు ఉండేవి కావు. అయినప్పటికీ అవేవీ లెక్క చేయకుండా కష్టపడ్డాడు. క్రికెట్ కోచింగ్ తీసుకున్నాడు. ఏకంగా భారత జట్టులో కీలక బౌలర్ గా ఎదిగాడు. డెత్ ఓవర్లలో, ప్రారంభంలోనే కాకుండా ఏ సమయంలోనైనా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసేవాడు. అందరూ స్పీడ్ ను నమ్ముకుంటే భువీ మాత్రం స్వింగ్ బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను ఇబ్బంది పెట్టేవాడు.

PC : Image curtosy

ఉమేష్ యాదవ్..

ఉమేష్ యాదవ్..

ఉత్తరప్రదేశ్ రాష్టం నుంచి వచ్చిన ఉమేష్ యాదవ్ తండ్రి బొగ్గు గనిలో కార్మికుడిగా పనిచేసేవాడు. ఉమేష్ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. తండ్రి జాబ్ ను ఉమేష్ కు ఇవ్వడంతో కొద్దిరోజులు కార్మికుడిగా పనిచేశాడు. అనంతరం టెన్నిస్ టోర్నమెంట్లు ఆడుతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఆ సమయంలోనే క్రికెట్ పట్ల ఆకర్షితుడై కోచింగ్ తీసుకున్నాడు. భారత జట్టు తరపున ఫాస్టెస్ట్ బౌలర్ గా రికార్డులు నెలకొల్పాడు.

PC : Image curtosy

మహమ్మద్ షమీ..

మహమ్మద్ షమీ..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండే వచ్చిన మరో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ. ఆయన తండ్రి ఒక రైతు. షమీకి క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించాడు. ఎలాగైనా తన కొడుకుకు క్రికెట్ కోచింగ్ ఇప్పించాలనుకున్నాడు. అతని దగ్గర కోచింగ్ కు సరిపడా డబ్బుల్లేకపోయిన అప్పులు చేసి మరీ షమీకి కోచింగ్ ఇప్పించాడు. షమీ కూడా తన తండ్రి ఆశలను ఎక్కడా వమ్ము చేయలేదు. ప్రతి చోటా విజయం సాధిస్తూనే వచ్చాడు. ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్ గా ఎదిగాడు.

PC : Image cortosy

పఠాన్ బ్రదర్స్..

పఠాన్ బ్రదర్స్..

ఒకప్పుడు ఇర్ఫాన్ పఠాన్ అంటే ఇండియా తురుపుముక్క. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన వీరుడు. తర్వాత యూసఫ్ పఠాన్ కూడా తానెంత విలువైన ఆటగాడో పలు మ్యాచుల్లో నిరూపించాడు. యూసఫ్ పఠాన్ ఐపిఎల్ ద్వారా బాగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం వీరు భారత జట్టుకు దూరమైనప్పటికీ వీరు ఇండియా టీమ్ లో ఉన్నప్పుడు మంచి సేవలను అందించారు. వీరు కూడా అత్యంత పేద కుటుంబం నుండి వచ్చారు. చిన్నప్పుడు వారి తండ్రితో కలిసి మసీదులకు వెళ్లి వాటిని శుభ్రం చేసేవారు. దాని ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబ పోషణ జరిపేవారు. అనంతరం క్రికెట్ కోచింగ్ తీసుకుని ప్రపంచంలోని గొప్ప క్రికెటర్లుగా పేరు గడించారు.

PC : Image courtosy

మనోజ్ తివారీ..

మనోజ్ తివారీ..

భారత జట్టు క్రికెట్ తరపున కొన్ని మ్యాచులే ఆడిన ఈ కోల్ కత్తా ఆటగాడు మనోజ్ తివారీ కూడా పేద కుటుంబం నుండే వచ్చాడు. తన కుటుంబ పోషణ కోసం రైల్వే స్టేషన్లలో కలిసి పనిచేశాడు. క్రికెట్ కోచింగ్ కు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. సరిగ్గా అలాంటి సమయంలో అతనికి వరుసకు అన్నలాంటి వారు ఒకరు అతని క్రికెట్ కోచింగ్ సహాయం చేశారు. తర్వాత కోచింగ్ తీసుకుని తొలుత రంజీ జట్టులో ఆడాడు. అనంతరం జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.

మునాఫ్ పటేల్..

మునాఫ్ పటేల్..

గుజరాత్ రాష్ట్రానికి చెందిన మునాఫ్ పటేల్ కూడా పేద కుటుంబం నుండే వచ్చాడు. అతని తండ్రి కూలీ పనులు చేస్తూ మునాఫ్ కు క్రికెట్ కోచింగ్ ఇప్పించాడు. అదే అతన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లింది. మునాఫ్ బౌలింగును చూసి చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యపోయేవారు. మునాఫ్ అచ్చం కంగారు జట్టులో సక్సెస్ ఫుల్ బౌలర్ మెక్ గ్రాత్ లా బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడారు.

English summary

Indian Cricketers Who Were Poor Before Becoming Rich

Former India captain MS Dhoni is set to become a successful captain. Dhoni did not win. There is a very large story behind it. Before entering cricket, Dhoni suffered. Dhoni first became a cricket wicketkeeper on his master's advice. Dhoni was not originally selected for the Indian cricket team because he came for a small state like Jharkhand or for some other reason. Yet he was an ardent practitioner of the courage of the plant.
Story first published: Wednesday, September 11, 2019, 15:07 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more