For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Baby Berth:తల్లీబిడ్డల కోసం ఆ రైళ్లలో ప్రత్యేక సీట్లు...

మదర్స్ డే సందర్భంగా భారతీయ రైల్వే ‘బేబీ బెర్త్’లను తీసుకొచ్చింది.

|

Indian Railways Introduces Baby Berth in Selected Trains :భారతీయ రైల్వే తల్లీ బిడ్డలు, బాలింతల కోసం అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఇటీవలే మదర్స్ డే సందర్భంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Indian Railways Introduces Baby Berth

రైలులో ప్రయాణించే సమయంలో చంటిబిడ్డలున్న తల్లులకు సీట్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తల్లిబిడ్డల కోసం 'బేబీ బెర్త్'పేరిట ప్రత్యేక సీట్లను రూపొందించింది. రైలు జర్నీ చేసే సమయంలో చంటి పిల్లల తల్లులు పడుతున్న ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ఇలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే 'బేబీ బెర్త్'లను అందుబాటులోకి తెచ్చింది.

Indian Railways Introduces Baby Berth

ఉత్తర భారత రైల్వే డివిజన్ అధికారులు చంటి పిల్లలు ఉండే తల్లుల కోసం ఈ బేబీబెర్త్ లను అందుబాటులోకి తెచ్చారు. ఆ డివిజన్ కు చెందిన ఇంజనీర్లతో కలిసి లోయర్ బెర్త్ లో కొన్ని అదనపు మార్పులు చేసి బేబీ బెర్త్ సీట్లను రూపొందించారు. ఈ ప్రత్యేకమైన సౌకర్యాన్ని మొట్టమొదటి సారిగా లక్నో మెయిల్ రైలులో అందుబాటులోకి తెచ్చారు.

ఈ రైలులో మంచి స్పందన వస్తే ఈ సౌకర్యాన్ని (బేబీ బెర్త్)ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించేలా ప్లాన్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

మదర్స్ డే సందర్భంగా లక్నో మెయిల్ లోని కోచ్ నెంబర్ B4లో 12 మరియు 60 నెంబర్ సీట్లలో బేబీ బెర్త్ ప్రవేశపెట్టినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇందులో చంటిబిడ్డల తల్లులు తమ బిడ్డతో కలిసి సౌకర్యవంతమైన ప్రయాణం చేయొచ్చని చెప్పారు.

భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో బాలింతలు, చంటి పిల్లలు ఉన్న తల్లులు జర్నీ చేస్తుంటారు. వారి కోసం ఇంతవరకు ప్రత్యేక సీట్లు లేకపోవడంతో తల్లీబిడ్డలు ఒకే బెర్త్ పై పడుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో తగినంత చోటు లేక చాలా మంది ఇబ్బంది పడేవారు. రైళ్లలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. అయితే తొలిసారిగా ఉత్తర విభాగానికి చెందిన రైల్వే ఇంజనీర్లు బేబీ బెర్త్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు. దీంతో తల్లీ బిడ్డలు, చంటి పిల్లలున్న తల్లులకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.


మరోవైపు రైల్వే శాఖ మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా జబల్ పూర్ రైల్వేస్టేషన్లో డిజిటల్ లాకర్ ఏర్పాటు చేసింది. ప్రయాణికుల లగేజీకి భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. నాలుగు అంకెల పిన్ కోడ్ ఉపయోగించి లాకర్లను తెరవొచ్చు. అందుకు సంబంధించిన వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ అధికారిక అకౌంట్లో జబల్ పూర్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన డిజిటల్ లాకర్ ఫొటోలను షేర్ చేసింది.

FAQ's
  • భారతీయ రైల్వే శాఖ ఏ స్టేషన్లో తొలిసారిగా డిజిటల్ లాకర్ సౌకర్యం కల్పించింది?

    తొలిసారిగా జబల్ పూర్ రైల్వేస్టేషన్లో డిజిటల్ లాకర్ ఏర్పాటు చేసింది. ప్రయాణికుల లగేజీకి భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. నాలుగు అంకెల పిన్ కోడ్ ఉపయోగించి లాకర్లను తెరవొచ్చు. అందుకు సంబంధించిన వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ అధికారిక అకౌంట్లో జబల్ పూర్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన డిజిటల్ లాకర్ ఫొటోలను షేర్ చేసింది.

English summary

Indian Railways Introduces Baby Berth to facilitate mothers traveling with their little ones

Here we are talking about the Indian Railways Introduces ‘Baby Berth’ On The Occasion Of Mother’s Day. Have a look
Story first published:Wednesday, May 11, 2022, 11:07 [IST]
Desktop Bottom Promotion