Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
వీరి ప్రేమ కారణంగా భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత తగ్గుతుందా?
ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఎందుకు పడుతుందో కూాడా తెలియదు. కానీ ఆ ప్రేమకు ఎంతో శక్తి ఉంది.
ప్రేమ, ప్యార్, మోహబ్బాత్, ఇష్క్ ఇలా ఏ పేరుతో పిలిచిన ప్రేమికుల మనసు పులకరిస్తుంది. ఈ ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేనే లేవు. అది మరోసారి నిజమని నిరూపించింది ఓ జంట. ప్రతిరోజూ ఏదో ఒక జంట ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. కాకపోతే కొంతమంది పెద్దలను ఒప్పించి చేసుకుంటారు. ఇంకొందరు తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి కథలెన్నో మనం ఇంతకుముందు చూశాం. ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఇప్పుడు మీరు వినబోయే కథ మాత్రం ఎవ్వరూ కలలో కూడా ఊహించనటువంటిది. వారిద్దరి ప్రేమ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని చాలా మంది చెబుతున్నారు. ఇంతకీ వారిద్దరు ఎవరో తెలుసా.. వారేమిటో తెలియాలంటో ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.
ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఎందుకు పడుతుందో కూాడా తెలియదు. కానీ ఆ ప్రేమకు ఎంతో శక్తి ఉంది. అనేక వివాదాలకు తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. అంతే కాదు రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతను కూడా తగ్గిస్తుందని ప్రేమికులు చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా భారత్ - పాకిస్థాన్ లెస్బియన్ (స్వలింగ సంపర్కులు) జంటను చూపుతున్నారు.

కాలిఫోర్నియాలో ఇటీవల ఓ అద్భుత వివాహం జరిగింది. సాధారణంగా వివాహమంటే పెళ్లికూతురు మెడలో పెళ్లి కొడుకు మూడు ముళ్లు వేస్తారు. కానీ అక్కడ మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. భారత్-పాక్ లెస్బియన్స్ బియాంకా మరియు సైమా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇంకో విశేషమేమిటంటే ఇది కూడా కులాంతర వివాహం. బియాంకా మైలీ కొలంబియన్-ఇండియన్ క్రిస్టియన్ కాగా సైమా పాకిస్థాన్ దేశానికి ముస్లిం మహిళ.
వీరిద్దరూ తొలిసారి అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో కలుసుకున్నారు. అప్పటి నుండి వీరి ప్రేమ షురూ అయ్యింది. ఆ తర్వాత వివాహానికి సిద్ధమయ్యారు. అంతే వారి కుటుంబ సభ్యులను సైతం ఒప్పించారు. అందంగా ముస్తాబయ్యారు. బియాంకా తన భారీ ఎంబ్రాయిడరీ ఐవరీ చీరతో పాటు ముత్యాల హారం, గాజులతో తళుక్కున మెరిసింది. సైమా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లాక్ షెర్వానీ ధరించి ముత్యాల హారం, కలర్ ఫుల్ గా కనిపించే ఎంబ్రాయిడరీ ఉన్న మ్యాచింగ్ స్టోల్ తో తన రూపాన్ని అందంగా రూపు దిద్దుకుంది.
కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జోడీ అందమైన చిత్రాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. కొందరు సోషల్ మీడియా యూజర్లను
ఇవి బాగా ప్రేరేపించాయి. ''లైఫ్ మీతో మధురంగా ఉంది..'' అని క్యాప్షన్ తో ఉన్న వారి ఫొటోను బియాంకా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. చాలా మంది యూజర్లు వీరిద్దరి కలయిక, వివాహంపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ''అందమైన దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు'' కామెంట్ చేశారు. దీని తర్వాత మరో కామెంట్ కాస్త భిన్నంగా వచ్చింది. 'అందమైన', 'అద్భుతమైన', 'ఒక రాణి'ని కనిపెట్టారు! అని, అందమైన జంట 'చిత్రం'పై దంపతులకు లెక్కలేనన్ని ఆశీర్వాదాలు అని కామెంట్లు వచ్చాయి. ప్రేమ చేదు వాతావరణంలో కూడా జీవించగలదని ఈ జంట నిరూపించింది.



Click it and Unblock the Notifications
