`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఆకాశమే నీ హద్దురా’ కెప్టెన్ గోపినాథ్ సామాన్యులకు విమానయానం అనే కల నిజమైందా?

|

'ఆకాశం నీ హద్దురా' అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన కొద్ది గంటల్లోనే అనేక రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా అంతటికి ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపినాథ్ ఆటోబయోగ్రఫీ 'సింప్లిఫై' పుస్తకమే ఆధారం.

సామాన్య ప్రజలకు గగనవిహారం చేయించాలన్న కెప్టెన్ గోపినాథ్ కల ఎలా నిజమైంది.. అందుకోసం తను ఎంతలా కష్టపడ్డారు.. తన భార్య నిజ జీవితంలో కూడా అంతే సపోర్ట్ చేసిందా.. అసలు ఇదంతా నిజమేనా?

చివరికి ఎలాగోలా ఎయిర్ డెక్కన్ పేరిట సొంతంగా విమానాలను కొనుగోలు చేసి వాటిని విజయవంతంగా నడిపిన కెప్టెన్ గోపినాథ్ కు ఇలాంటి ఇబ్బందులన్నీ నిజ జీవితంలో ఎదురయ్యాయా?

అసలు ఇంతకీ తనకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది. సూర్య నటించినట్టు నిజంగా ఇవన్నీ తన జీవితంలో జరిగాయా? అనే విషయాలతో కెప్టెన్ గోపినాథ్ గురించి అనేక ఆసక్తకిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సెరికల్చర్ ఫామ్..

సెరికల్చర్ ఫామ్..

కెప్టెన్ గోపినాథ్ కేవలం ఎయిర్ డెక్కన్ మాత్రమే కాదు.. అంతకుముందే తను స్థాపించిన సెరికల్చర్ ఫామ్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అతను స్థాపించిన స్థిరమైన సెరికల్చర్ ఫామ్ కూడా తనకు అనేక పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈ ఫీట్ గురించి అప్పట్లో చాలా వార్తా పత్రికలలో కూడా వచ్చింది.

హోటల్ కూడా..

హోటల్ కూడా..

కెప్టెన్ గోపినాథ్ విమానాలను కొనుగోలు చేసే ముందు మాల్నాడ్ మోటర్ బైకులు అని పిలువబడే వెంచర్ ఎన్ ఫీల్డ్ డీలర్ షిప్ కుడా ప్రయత్నించాడు. ఆటోమొబైల్స్ లోనూ కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత ఒక హోటల్ కూడా తెరిచారు. ఆ హోటల్ ఇప్పటికీ కర్నాటక రాష్ట్రం హాసన్ లో ఉంది.

28 ఏళ్ల వయసులో..

28 ఏళ్ల వయసులో..

కెప్టెన్ గోపినాథ్ తన డ్రీమ్ ప్రాజెక్టును నిజం చేసుకోవడానికి కేవలం 28 సంవత్సరాల వయసులో సైన్యం నుండి రిటైర్ మెంట్ తీసుకున్నాడు. తన కలను నిజం చేసుకోవడానికి.. తను ఎంత నిబద్ధతతో ఉన్నాడో ఈ ఒక్క సంఘటన చక్కగా నిరూపిస్తుంది.

హెలికాఫ్టర్ సేవలు..

హెలికాఫ్టర్ సేవలు..

తను ఎయిర్ డెక్కన్ తక్కువధరకే విమానయాన సంస్థను స్థాపించడానికి ముందే 1997 సంవత్సరంలో హెలికాఫ్టర్ ఛార్టర్ సేవలను ప్రారంభించారు. దీనినే డెక్కన్ ఏవియేషన్ అని కూడా పిలుస్తారు.

ఫ్రెంచ్ ప్రభుత్వం..

ఫ్రెంచ్ ప్రభుత్వం..

తన ఆదర్శప్రాయమైన విజయాలను గుర్తించిన ఫ్రెంచ్ ప్రభుత్వం, కెప్టెన్ గోపినాథ్ కు ఫ్రెంచ్ దేశ ప్రభుత్వం యొక్క ప్రధానమైన పౌర పురస్కారమైన ‘చెవాలియర్ డి లా లెజియన్ డి హోన్నూర్'తో గౌరవించింది.

పాఠ్యపుస్తకంగా..

పాఠ్యపుస్తకంగా..

కెప్టెన్ జిఆర్ గోపినాథ్ ఆత్మకథ సింప్లీ ఫై గురించి విన్న మాజీ అధ్యక్షుడు ఎపిజె అబ్దుల్ కలాం గారు కూడా ఈ ‘సింప్లీ ఫ్లై' అనే కథ తప్పనిసరిగా పాఠ్యపుస్తకంగా మారాలని ప్రకటన చేశారట.

పొలిటికల్ జర్నీ..

పొలిటికల్ జర్నీ..

వ్యాపారంలో విజయవంతంగా ఎదిగిన కెప్టెన్ గోపినాథ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టేశారు. 2009 సంవత్సరంలో బెంగళూరు సౌత్ నుండి లోక్ సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత 2014లో అమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ, రెండు సందర్భాలలో తనకు ఫలితం ఆశాజనకంగా రాలేదు.

ఫిక్షన్ ఎక్కువగా..

ఫిక్షన్ ఎక్కువగా..

ఈ సినిమాను చూసిన కెప్టెన్ గోపినాథ్ ట్విట్టర్ ద్వారా తన స్పందనను కూడా తెలియజేశారు. ‘ఆకాశమే నీ హద్దురా' సినిమా చూశాను. ఇది ఒక రోలర్ కోస్టర్ లా అనిపించింది. ఫిక్షన్ ఎక్కువగా ఉన్నా కూడా నా పుస్తకంలోని భావోద్వేగాలను చక్కగా క్యాప్చర్ చేశారు. నాకు నవ్వు రాలేదు.. ఏడుపు రాలేదు.. కానీ గతం మాత్రం గుర్తుకొచ్చింది' అని వివరించారు.

English summary

Inspiring story of captain gopinath(Aakashame Nee Haddura)

Here we talking about the Inspiring story of captain gopinath(Aakashame Nee Haddura). Read on