For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Christmas 2021:క్రిస్మస్ పండుగ వేళ ఎక్కువ మంది ఎలాంటి పనులు చేస్తారో తెలుసా...

క్రిస్మస్ పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

మరికొన్ని గంటల్లో క్రిస్మస్ పండుగ రాబోతోంది. మనలో చాలా మందికి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఈ సందర్భంగా వారికి అడ్వాన్స్ క్రిస్మస్ విషెస్ చెప్పడంతో పాటు.. వారితో మీరు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ను షేర్ చేసుకోవచ్చు.

Interesting and Surprising Facts about Christmas in Telugu

ఈ పండుగ వేళ పిల్లలు, పెద్దలు కలిసి ఎక్కువగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక పార్టీలను చేసుకునే కల్చర్ ఎన్నో సంవత్సరాలుగా వస్తోంది.

Interesting and Surprising Facts about Christmas in Telugu

అయితే కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల నుండి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ ఏడాది కరోనా నుండి కాస్త ఉపశమనం దొరకడంతో అందరూ ఈ పండుగను ఉత్సాహంగా.. ఉల్లాసంగా సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకోండి...

Homemade Christmas Cake: ఇంట్లోనే ఈజీగా క్రిస్ మస్ కేక్ చేసేయండి...Homemade Christmas Cake: ఇంట్లోనే ఈజీగా క్రిస్ మస్ కేక్ చేసేయండి...

కానుకల పండుగ..

కానుకల పండుగ..

క్రిస్మస్ పండుగ అంటేనే కానుకలు. ఈ వేడుకల వేళ శాంటా తాత వచ్చి అందరికీ కానుకలు ఇస్తాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు అందరూ తమకు ఎలాంటి గిఫ్ట్ లభిస్తుందా అని ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. కొందరు పెద్దలు వారే శాంటా క్లాజ్ గా మారిపోయి తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు సర్ ప్రైజ్ ఇస్తుంటారు. అలాగే పేద పిల్లలకు బహుమతులను అందిస్తూ ఉంటారు.

అనాధలతో వేడుకలు..

అనాధలతో వేడుకలు..

క్రిస్మస్ పండుగ వేళ కొందరు వ్యక్తులు శాంటా లేదా సీక్రెట్ శాంటాగా మారువేశాలు వేసుకుని, తమ స్నేహితులకు, ఫ్యామిలీకి గిఫ్టులు ఇచ్చే సంగతి గురించి మనలో చాలా మందికి తెలుసు. అయితే ఇంకా కొందరు వ్యక్తులు మాత్రం ఈ పండుగ వేళ అనాధలకు ఏమి కావాలో తెలుసుకుని.. వారికి పండుగ బహుమతులు ఇస్తుంటారు. వారితోనే పండుగ సంబరాలను జరుపుకుంటారు.

క్రిస్మస్ ట్రీ..

క్రిస్మస్ ట్రీ..

క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు మనలో చాలా మందికి గుర్తుకొచ్చేది క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ కేక్, శాంటా క్లాజ్. అందుకే క్రిస్మస్ పండుగ వేళ క్రియేటివ్ ఆలోచనలతో చాలా మంది క్రిస్టియన్లు తమ ఇంటిని అందంగా డెకరేట్ చేస్తుంటారు. అంతేకాదు ఆ చెట్టు కింద గిఫ్టులను పెడుతుంటారు. దీని వల్ల వారి క్రియెటివిటీ పెరుగుతుందని భావిస్తారు.

Christmas 2021:ఏసు అంటే అర్థమేంటి? క్రిస్మస్ కథ గురించి తెలుసుకుందామా...Christmas 2021:ఏసు అంటే అర్థమేంటి? క్రిస్మస్ కథ గురించి తెలుసుకుందామా...

ప్రత్యేక వంటకాలు..

ప్రత్యేక వంటకాలు..

క్రిస్మస్ పండుగ వేళ చాలా మంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటారు. అయితే కొంచెం స్పెషల్ గా జరుపుకోవాలనుకునే వారు రమ్ కేక్, హాట్ చాక్లెట్ వంటివి మేకింగ్ చేస్తుంటారు. అయితే క్రిస్మస్ సందర్భంగా చాలా మంది ప్రత్యేక వంటకాలను తయారు చేసేందుకు సన్నద్ధమవుతుంటారు. అలా ప్రయత్నించి తమలో టాలెంట్ ను బయటపెట్టాలని ఆశిస్తూ ఉంటారు.

ఫ్రెండ్స్ తో పార్టీ..

ఫ్రెండ్స్ తో పార్టీ..

మనలో చాలా మంది ఏదైనా సందర్భం వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాం. అయితే క్రిస్మస్ పండుగ వేళ హ్యాపీగా గడిపేందుకు పార్టీలను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారట. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్లలో కాకుండా ఇళ్లల్లోనే పార్టీలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత రెండు సంవత్సరాల పాటు కూడా ఇంట్లోనే డిస్కో లైట్లతో పార్టీ మూడ్ తెచ్చుకున్నారట.

హోమ్ డెకరేషన్..

హోమ్ డెకరేషన్..

సాధారణంగా ఏ పండుగ వచ్చినా మనలో చాలా మంది తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. అయితే క్రిస్మస్ పండుగ వేళ మాత్రం హోమ్ డెకరేషన్ కు పెద్ద పీట వేస్తారట. అయితే ప్రతి సంవత్సరం కొంచెం ప్రత్యేకంగా ప్రయత్నిస్తారట. ఇందుకోసం ఆన్ లైనులో ఉన్న సింపుల్ ట్రిక్స్ ను ఫాలో అవుతుంటారు చాలా మంది. అందులో భాగంగానే చిన్న చిన్న స్టార్స్, గిఫ్ట్ బాక్సులు, పేపర్ ఫ్లవర్స్.. వంటి వాటితో అద్భుతమైన డెకరేషన్లు ప్లాన్ చేస్తారట.

కొత్త జంటలు..

కొత్త జంటలు..

క్రిస్మస్ పండుగ వేళ కొత్త జంటలు క్యాండిల్ లైట్ డిన్నర్ లేదా క్యాంప్ ఫైర్ ప్లాన్ చేసుకొని రాత్రంతా రొమాంటిక్ గా గడపాలని కోరుకుంటారట. ఇక డిన్నర్ లో క్రిస్మస్ ప్రత్యేక వంటకాలన్నీ ఉండేలా చూసుకుంటారట. ఇలా వీలు కాని వారు ఏదైనా హోటల్ కు వెళ్తారట.

FAQ's
  • క్రిస్మస్ పండుగను ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు?

    ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులందరు డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన ఏసుక్రీస్తు జన్మించినట్లు నమ్ముతారు. అందుకే ఈరోజున చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు.

English summary

Interesting and Surprising Facts about Christmas in Telugu

Here we are talking about the interesting and surprising facts about christmas in Telugu. Have a look
Story first published:Friday, December 24, 2021, 9:51 [IST]
Desktop Bottom Promotion